అన్వేషించండి
Advertisement
Mahesh Babu: వెనక్కి తగ్గిన 'సర్కారు వారి పాట'.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..
మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇదే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కి కరోనా కారణంగా గ్యాప్ వచ్చింది. ఆ తరువాత షూటింగ్ మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు.
Also Read: 'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబు
దానికి తగ్గట్లే జనవరి 13న రిలీజ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ డేట్ కి తగ్గట్లే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. కానీ సడెన్ గా 'ఆర్ఆర్ఆర్' సినిమాను జనవరి 7న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. దీంతో ఆ సమయానికి రావాలనుకున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు కూడా తన సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు.
ఏప్రిల్ 1, 2022లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. మార్చిలో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మహేష్ బాబు ఏప్రిల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తన తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారు. అందుకే రాజమౌళి అడిగిన వెంటనే తన 'సర్కారు వారి పాట' సినిమాను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
April 1st 2022!! 😊#HappyDiwali @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus #SarkaruVaariPaata pic.twitter.com/fw83zwDC7T
— Mahesh Babu (@urstrulyMahesh) November 3, 2021
Also Read: రవితేజ - వంశీ చిత్రం టైటిల్ వచ్చేసింది.. ఐదు భాషల్లో ఒకేసారి..
Also Read:పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్
Also Read:సన్నీ లియోనీ.. తగ్గేదే లే! ఆమె పేరుతో బ్లాక్‌చైన్‌తో రూపొందించే ఎన్‌ఎఫ్‌టీ.. ఇదో మరో రికార్డు!
Also Read: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్... శ్రీరామచంద్రకు టార్చర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion