Sunny Leone ON NFT: సన్నీ లియోనీ.. తగ్గేదే లే! ఆమె పేరుతో బ్లాక్‌చైన్‌తో రూపొందించే ఎన్‌ఎఫ్‌టీ.. ఇదో మరో రికార్డు!
బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీ లియోనీ ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్లోకి దిగింది. క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ అసెట్స్ లాంటివే ఇవి.
బాలీవుడ్ తార సన్నీ లియోన్ నాన్ ఫంగీబుల్ టోకెన్స్ (NFT) మార్కెట్ ప్లేస్‌లోకి అడుగు పెట్టింది. ఈ ఘనత అందుకున్న భారత తొలి నటిగా గుర్తింపు అందుకుంది.
ఎన్‌ఎఫ్‌టీ అంటే నాన్ ఫంగీబుల్ టోకెన్స్. ఇవీ ఒకరకమైన డిజిటల్స్ అసెట్స్. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఓనర్‌షిప్ ఇస్తారు. చిత్రాలు, వీడియోలు, ఇతర సేకరణలను ఎన్ఎఫ్‌టీలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్లే మరెవ్వరూ దీనిపై ఓనర్‌షిప్ క్లైమ్ చేసుకోలేరు. అలా చేయాలంటే వాటిని కొనుగోలు చేయాల్సిందే.
ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌టీలపై క్రేజ్ పెరుగుతోంది. వీటిని సేకరణ కర్తలు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సెకండరీ మార్కె్ట్లో విక్రయించుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌టీలను ప్రత్యేకంగా తయారు చేయాలా? కొద్ది మందికే విక్రయించాలా అన్నది క్రియేటర్ ఇష్టం. ఈ నేపథ్యంలో తన తొలి ఎన్‌ఎఫ్‌టీ గురించి సన్నీ లియోన్ ట్వీట్ చేసింది.
'మిస్ ఫిజ్‌ను కలవండి! ఇది మిస్ ఫిజ్ హనీ! ఆమెకు గులాబీ రంగంటే ఇష్టం. టాటూలు వేయించుకున్న కుర్రాళ్లన్నా ఇష్టమే. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? సన్నీలియోన్ ఎన్‌ఎఫ్‌టీలు సిద్ధంగా ఉన్నాయి' అని సన్నీ ట్వీట్ చేసింది. 'ఇదో ప్రైవేట్ సేల్. వెంటనే విక్రయిస్తాం. నా కలెక్షన్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నేనెలాగూ మిస్‌ఫిట్‌నే' అని ఆమె మీడియాకు తెలిపింది. ఇంతకు ముందే అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ ఎన్‌ఎఫ్‌టీ రంగంలోకి రావడం గమనార్హం.
MEET the MISFTIZ !
— sunnyleone (@SunnyLeone) October 30, 2021
This is misfitz HONEY! She loves the color pink…boys with tattoos…and then eats them for lunch 😈
What the world has been waiting for!!!
#SUNNYLEONENFT collectibles 😍
Check them all out on
👉 https://t.co/RAN8aK83uB
Join : https://t.co/9xjrNoQVTx #NFT pic.twitter.com/cOsWb3P9SA