Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్
రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా పరిస్థితి అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కు చెర్రీ ఫ్యాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
‘RRR’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే, పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
వాస్తవానికి ఈ సినిమాను ప్రకటించి చాలా కాలం అవుతున్నది. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. దర్శకుడు ఓవైపు 'ఇండియన్ 2'ను షూట్ చేస్తూనే, మరోవైపు 'గేమ్ ఛేంజర్' కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అటు నిర్మాణ సంస్థకు బడ్జెట్ కూడా తడిసిమోపెడు అవుతుందట. రీసెంట్ గా ‘ఇండియన్ 2’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చెర్రీ కూడా ప్రీగానే ఉండటంతో తాజాగా యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ, ఈ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయ్యింది. కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ కుదరకే వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ షెడ్యూల్ షూట్ ని అక్టోబర్ సెకండ్ వీక్ కి కంప్లీట్ చేయనున్నట్లు తెలిపింది.
చెర్రీ అభిమాని సీరియస్ వార్నింగ్
‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మరోసారి వాయిదా పడటంతో ఆయన అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అటు ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ కూడా పెద్దగా ఉండకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఓ చెర్రీ అభిమాని ‘గేమ్ ఛేంజర్’ టీమ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ లేఖ రాశాడు. తాను చనిపోతే అందుకు బాధ్యత దిల్ రాజు, శంకర్ వహించాలని హెచ్చరించాడు.
ఇంతకీ సూసైడ్ లెటర్ లో ఏం ఉందంటే?
“రామ్ చరణ్ వీరాభిమానిగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. కనీసం రిలీజ్ డేట్ ప్రకటిస్తారు అనుకున్నాను. కానీ, ఎలాంటి అప్ డేట్స్ లేవు. సినిమా షూటింగ్ కూడా చీటికి మాటికి వాయిదా పడుతోంది. సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో రెండు, మూడు రోజుల్లో చెప్పాలి. లేదంటే, నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుకు కారణంగా దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, SVC ప్రొడక్షన్స్. దయచేసి మీరు, నా హెచ్చరికను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. లవ్ యు చరణ్ అన్నా, నిన్ను మిస్ అవుతున్నాను. నా తర్వాతి జీవితంలో మీకు మంచి అభిమానిగా ఉంటానని ఆశిస్తూ, ఇట్లు బాబు గౌడ్” అని రాశాడు.
We, fans too have some emotions & that crossed the line, so Iam intimating with a gentle reminder for a harsh decision.@SVC_official #GameChanger #RamCharan pic.twitter.com/WawR9KiC2N
— Babu Goud (@RC_MSD_) September 29, 2023
ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య సహా పలువురు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Also: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial