By: ABP Desam | Updated at : 01 Oct 2021 03:30 PM (IST)
Image Credit/ Poonam kaur's Instagram
‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి. ఇండస్ట్రీ అంతా ఒకటే అని చెప్పినప్పటికీ వర్గాలున్నాయన్నది మరోసారి క్లారిటీ వచ్చినట్టైంది. అయితే వివాదం అంతా ఒకెత్తు.. పోసాని ప్రస్తావించిన పంజాబీ అమ్మాయి విషయం మరొకెత్తు అయింది. ఆ పంజాబీ అమ్మాయి అంటే పూనమ్ కౌర్ అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. ఇదంతా పక్కనపెడితే తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
https://t.co/4qeX2I65Nn ( please listen )
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 28, 2021
దర్శకరత్న, దివంగత దాసరి నారాయణరావుని గుర్తు చేసుకుంటూ పూనమ్ చేసిన ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ ట్వీట్‌లో ఆమె దాసరి నారాయణరావు నటించిన ‘రౌడీ దర్బార్’ సినిమాలోని ‘‘ఇంద్రలోకం పార్టీ.. చంద్రలోకం పార్టీ.. మీ జెండాలకు వేల వేల దండాలయా.. మీ పార్టీల్లో గూండాలను చేర్చకండయ్యా’’ అనే వీడియో సాంగ్‌ని పోస్ట్ చేసి దయచేసి ఈ పాటను వినండి అని ట్వీట్ చేసింది.
May god send the msg I have for you today , I miss you ,
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 28, 2021
The only #guru in the industry #Dasari garu,
I miss you .
( dad like ) pic.twitter.com/OHvDMFi85V
ఆ వెంటనే మరో ట్వీట్ చేసిన పూనమ్ ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక గురువు దాసరిగారు. ఆయనను చాలా మిస్సవుతున్నాను. నాకు తండ్రిలాంటి వ్యక్తి. ఈరోజు దాసరిగారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. భగవంతుడు దానిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను’’ అని పోస్ట్ చేసింది. ఉన్నట్టుండి ఆమెకు దాసరి ఎందుకు గుర్తొచ్చారో అర్థమైంది కదా.. అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Some this Anna is great ,
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2021
Other times some other Anna is great !
Except for the egoistic pleasures in this patriarchal society ,
Who is thinking about the woman ?
All of u are selfish for your own egos and agendas,
None absolutely none thinking about a woman’s future.#jaihind
మరొక పోస్టులో ‘‘ఒక్కోసారి ఓ అన్న గొప్పగా అనిపిస్తాడు. మరి కొన్నిసార్లు ఇంకో అన్న గొప్పగా అనిపిస్తాడు. ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఎవరి ఈగోను వారు తృప్తి పరుచుకుంటున్నారే తప్పా.. ఆడవాళ్ల గురించి ఆలోచించేవారెవరున్నారు. మీరంతా మీ ఈగోలు, అజెండాల గురించి ఆలోచించే స్వార్థపరులు. ఏ ఒక్కరూ కూడా మహిళల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు’’ అని పూనమ్ కౌర్ చేసిన పరోక్ష కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు అత్యాచారం, బాధితురాలు అంటూ కొన్ని సందేశాత్మక వీడియోలను షేర్ చేసిన పూనమ్.. అత్యాచారం చేసిన వాడు సిగ్గుపడాలి. కానీ నేను ఎందుకు సిగ్గుపడాలి? ఏం తప్పు చేశానంటూ ఓ మహిళ ఆవేదన చెందుతున్న వీడియోను పూనమ్ కౌర్ షేర్ చేసింది. గత రెండు రోజులుగా పూనమ్ కౌర్ పేరు మారుమోగిపోతోంది. పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పూనమ్ కౌర్‌ను ఉద్దేశించినవే అనే చర్చమొదలైంది. పంజాబీ అమ్మాయి, నటి అంటూ పోసాని లేవనెత్తిన అంశం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలోని ఓ పవర్ఫుల్ వ్యక్తి ఆమెను మోసం చేశాడు. గర్భవతిని చేశాడు. అబార్షన్ కూడా చేయించాడు. దమ్ముంటే ఆ అమ్మాయికి న్యాయం చేయమని పవన్ కళ్యాణ్‌కు పోసాని సవాల్ విసిరాడు. అలా పూనమ్ కౌర్ పేరు మొత్తానికి వార్తల్లోకి ఎక్కేసింది. ఇలాంటి హడావుడి మధ్య పూనమ్ సోషల్ మీడియా పోస్టులపై భారీ చర్చే జరుగుతోంది.
Also Read: పెళ్లికాకుండానే తల్లైన సిరి హన్మంత్.. ఇదిగో బాబుతో ఉన్న ఫొటో..
Also Read: అండర్‌వేర్‌ను అలా చూసి అడ్డంగా బుక్కైన రష్మిక.. ఆ ప్రకటనపై నెటిజనులు ఆగ్రహం
Also Read: సాయి ధరమ్ తేజ్.. ‘రిపబ్లిక్’ ఎలా ఉంది? ప్రేక్షకుల రివ్యూ ఇదే..
Amrita Rao - Salman Khan: సల్మాన్‌తో సినిమా ఛాన్స్, దారుణంగా మోసపోయిన ‘అతిథి’ హీరోయిన్ అమృత రావు
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!