X

Bigg Boss 5 Telugu:పెళ్లికాకుండానే తల్లైన సిరి హన్మంత్‌.. ఇదిగో బాబుతో ఉన్న ఫొటో..

బిగ్ బాస్ సీజన్ 5లో సందడి చేస్తున్న సిరి హన్మంత్ పెళ్లికాకుండానే తల్లైందా..బుల్లితెర ప్రేక్షకుల్లో ఇప్పుడిదే చర్చ. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసా...

FOLLOW US: 

‘బిగ్ బాస్’ సీజన్ 5 యాక్టివ్ కంటిస్టెంట్స్‌లో సిరి హన్మంతు టాప్ 5 లోనే ఉంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటివరకూ ఎక్కడా జోష్ తగ్గలేదు. ‘బిగ్ బాస్’ సీజన్ 5 తొలి కెప్టెన్ అవడమే కాదు టాస్కుల్లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుందనే క్రెడిట్ కొట్టేసింది. ఆ మధ్య బిగ్ బాస్ ఇచ్చిన 'మరపురాని తొలిప్రేమ' టాస్కులో భాగంగా ఫస్ట్ లవ్ గురించి మాట్లాడిన సిరి ఇంటి సభ్యులతో పాటూ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. తన ఫస్ట్ లవ్ గురించి సిరి అప్పుడు ఏం చెప్పిందంటే.. ‘‘అతడి పేరు విష్ణు..అందరూ ముద్దుగా చిన్నా అంటారు. ఇద్దరం ఎదురెదురు ఇళ్లలో ఉండేవారం. మా లవ్ టెన్త్ క్లాసులో మొదలైంది. తను ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకున్నా. తెల్లారితే నిశ్చితార్థం అనగా ఇంట్లోంచి వెళ్లిపోయా. ఆ తర్వాత మా అమ్మ నచ్చజెప్పడంతో మళ్లీ ఇంటికి తిరిగొచ్చా. అప్పటి నుంచి సంతోషంగా తనతో రిలేషన్ కొనసాగించా కానీ ఓ రోజు తెల్లవారుజామునే అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది. మళ్లీ నిద్రపోయా. అయితే అదే నాకు మెలుకువ వచ్చిన సమయంలోనే తనకి యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు" అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సిరి. అయితే మళ్లీ ఇదంతా ఎందుకంటే సిరి హన్మంతు తల్లైంది. ఈ ఫొటో చూస్తే మీకే అర్థమవుతుంది.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించిన యూట్యూబ్ స్టార్ సిరి హన్మంతుకి ఈ మధ్యే నటుడు శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరిగింది.  ఇంతలోనే బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడంతో ప్రియుడిని ఒంటరిగా వదిలేసి షోలో ఎంట్రీ ఇచ్చింది. అయితే వీరిద్దరికీ ఓ కొడుకు ఉన్నాడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో కొంత నిజం, కొంత అబద్ధం ఉందండోయ్. వీళ్లిద్దరకీ ఓ బాబు ఉన్నాడన్నది నిజమే. కానీ ఆ బాబుని వీళ్లు దత్తత తీసుకున్నారు. ఆ మధ్య ఓ నెటిజన్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ చైతూని అడాప్ట్‌ చేసుకుంటున్నారా? అని ప్రశ్నించగా అవునని సమాధానమిచ్చింది సిరి. ఆమె నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మంచి నిర్ణ‌యం తీసుకున్న సిరి- శ్రీహాన్ జంటపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంటరైన యూట్యూబర్ సిరి హన్మంత్.. ఫస్ట్ వీక్ నుంచి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తోంది. బయట కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఈమధ్యే తన ఇన్ స్టాగ్రామ్‌లో 4 లక్షల ఫాలోవర్స్‌‌కు చేరుకుంది. ఈ క్రమంలో సిరి ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆమె టీం పోస్ట్ పెట్టింది. 

Also Read: కత్తులతో ఫసక్.. సన్నీకి చుక్కలు చూపించిన హౌస్‌మేట్స్, కెప్టెన్ ఎవరంటే..

Also Read:‘కొండపొలం’ సాంగ్.. ‘శ్వాసలో హద్దులని దాటాలనే ఆశ’ అంటూ రకుల్‌తో తేజ్ రొమాన్స్!

Also Read:నిశ్చితార్థం ముందు రోజే లేచిపోయిన సిరి.. డయల్ 100కి ఫోన్ చేసి ప్రియుడితో వెళ్లిపోయిన కాజల్‌.. ఒక్కొక్కరిది భలే లవ్‌స్టోరీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss 5 Telugu Bigg Boss Season 5 contestant Siri Hanumanth Adopted Child Actor

సంబంధిత కథనాలు

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Ritu Varma: ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Ritu Varma:  ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

TS Letters To KRMB : సాగర్ ఆయుకట్టు పెంపుపై అభ్యంతరం.. కేఆర్ఎంబీకి తెలంగాణ కొత్తగా రెండు లేఖలు !

TS Letters To KRMB :  సాగర్ ఆయుకట్టు పెంపుపై అభ్యంతరం.. కేఆర్ఎంబీకి తెలంగాణ కొత్తగా రెండు లేఖలు !

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ