Bigg Boss 5 Telugu: కత్తులతో ఫసక్.. సన్నీకి చుక్కలు చూపించిన హౌస్‌మేట్స్, కెప్టెన్ ఎవరంటే..
‘బిగ్ బాస్ 5 తెలుగు’లో 26వ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఈ వారం కెప్టెన్‌గా నిలిచిందెవరో తెలుసుకోవాలని ఉందా? ఇదిగో ఈ అప్ డేట్స్ చూసేయండి మరి.
‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ ఈ రోజు (గురువారం) ఎపిసోడ్‌లో కూడా కొనసాగింది. పవర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యానీ, స్వేతాలు.. షన్ముఖ్ సిరిని టాస్క్‌కు ఎంపిక చేసుకున్నారు. ‘చిక్కుల్లో చిక్కుకోకు’ టాస్క్ ఇచ్చారు. ఆరు తాళల్లో చిక్కులు విడదీసి.. తాడు రంగు గల హుక్కులో పెట్టినవారు విజేతలుగా నిలుస్తారని బిగ్ బాస్ తెలిపాడు. గార్డెన్‌లో జరిగిన పోటీలో.. స్వేత, యానీ మాస్టర్ త్వరగా టాస్క్ పూర్తి చేసి విజేతలుగా నిలిచారు.
కెప్టెన్ ఎంపిక కోసం ‘కత్తులతో సహవాసం’ టాస్క్: మానస్ రెండు రోజుల్లో 6 కిలోలు, సన్నీ 3 కిలోల బరువు తగ్గి టాస్క్‌లో కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు. ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ పూర్తి కావడంతో బిగ్ బాస్.. పిజ్జా, కూల్ డ్రింక్‌తో ట్రీట్ ఇచ్చాడు. అనంతరం.. అందరికన్నా ఎక్కువ బరువు కోల్పోయిన మూడు జంటల వివరాలను బిగ్ బాస్ అడిగాడు. సన్నీ-మానస్ ఫస్ట్, శ్రీరామ చంద్ర-హమీదా సెకండ్, యానీ మాస్టర్-స్వేత థర్డ్ ప్లేస్‌లో ఉన్నారని సంచాలకురాలు కాజల్ తెలిపింది. ఆ జంటల్లో ఎవరు కెప్టెన్‌గా ఉండాలనే విషయంపై వారిలో వారు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ ఫిటింగ్ పెట్టాడు. దీంతో జంటలు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. చివరికి స్వేత, శ్రీరామచంద్ర, సన్నీలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. ‘కత్తులతో సహవాసం’ టాస్క్ ద్వారా కెప్టెన్ ఎన్నిక చేసే బాధ్యతను ఇంట్లోవారికే బిగ్‌బాస్ అప్పగించాడు. ఎవరైతే అనర్హులో వారిని కత్తితో పొడిచి కెప్టెన్ కాకుండా చేయాలని.. బిగ్‌బాస్ తెలిపాడు.
సన్నీకి కత్తులు దింపిన హౌస్‌మేట్స్: టాస్కులో విశ్వ మాట్లాడుతూ.. కెప్టెనుగా లేనప్పుడు కూడా ఇంటి పనులను బాధ్యతగా తీసుకుని ఉంటే బాగుండేదని చెబుతూ సన్నీని కత్తితో పొడించాడు. షన్ను మాట్లాడుతూ.. కెప్టెన్సీకి నువ్వు అర్హుడవి కావంటూ సన్నీని పొడిచాడు. ముగ్గురు నాకు స్నేహితులే అంటూనే.. సన్నీ ఆర్టిఫిషియల్‌గా నవ్వుతూ ఫేక్‌గా ఉంటున్నాడని, చిక్కుల టాస్కులో కాజల్ తమని సపోర్ట్ చేస్తున్నట్లుగా కామెంట్ చేయడం బాగోలేదని తెలుపుతూ సన్నీని పొడిచింది. లోబో మాట్లాడుతూ.. నీకు ఆ టైము రాలేదు.. నువ్వు లాస్ట్ వరకు ఉంటావు.. అప్పుడు కెప్టెన్ అవుతావని చెబుతూ సన్నీని పొడిచాడు. టాస్కులో చిత్తశుద్ధిగా లేవని, బిర్యానీ తిన్నావంటూ హమీదా.. స్వేతను పొడించింది. అనంతరం ప్రియా కూడా సన్నీనే పొడిచింది. కెప్టెన్సీలో శ్రీరామ్, స్వేతకు ఛాన్స్ ఇవ్వాలంటూ నటరాజ్.. సన్నీని పొడిచాడు. యానీ మాస్టర్ శ్రీరామ్‌ను, రవి.. సన్నీని పొడిచాడు. త్వరగా ఆవేశానికి గురవ్వుతారంటూ ప్రియాంక.. సన్నీని పొడిచింది.
Also Read: ‘9000 రాత్రులు కలిసి పడుకోవాలి’.. మోస్ట్ రొమాంటిక్ ట్రైలర్ వచ్చేసింది!
కెప్టెన్ ఎవరంటే..: అంతా కత్తులతో పొడవడంతో సన్నీ బాధపట్టాడు. మానస్ మాట్లాడుతూ.. తనని ఇంప్రస్ చేసేవారిని పొడవనని చెప్పాడు. చివరికి స్వేతను పొడిచాడు. ఆ తర్వాత కాజల్ మాట్లాడుతూ.. తర్వాతి కెప్టెన్స్‌లో నీకు సపోర్ట్ చేస్తానంటూ స్వేతను పొడిచింది. జస్సీ శ్రీరామ్‌ను పొడిచాడు. చివరికి శ్రీరామ్‌ను తక్కువమంది పొడవడంతో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్వేత, జస్సీలతో సన్నీ మాట్లాడుతూ.. ‘‘కాజల్ ముందు నన్ను పొడుస్తానని చెప్పి.. గేమ్ ఛేంజ్ కోసం నిన్ను పొడిచింది. మానస్ కూడా ఒపీనియన్ ఛేంజ్ చేసుకున్నాడు’’ అని తెలిపాడు. అయితే, కెప్టెన్సీని త్యాగం చేసిన తన పార్టనర్ మానస్ గురించి స్వేతతో సన్నీ అలా మాట్లాడటం.. కాస్త ఆశ్చర్యకరమైన విషయమే.
Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు