Most Eligible Bachelor Trailer: ‘9000 రాత్రులు కలిసి పడుకోవాలి’.. మోస్ట్ రొమాంటిక్ ట్రైలర్ వచ్చేసింది!
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ట్రైలర్ మొత్తాన్ని లవ్, రొమాన్స్‌లతో నింపేశారు.
అఖిల్, పూజా హెగ్డే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ మొత్తాన్ని లవ్, రొమాన్స్‌లతో నింపేసిన డైరెక్టర్.. తన టార్గెట్ ఆడియెన్స్ యువతేనని చెప్పకనే చెప్పాడు. ‘మన లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి. వందల వెకేషన్స్‌కు వెళ్లాలి. అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అనే పూజా హెగ్దే ప్రశ్నతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50 పర్సెంట్ కెరీర్, 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి’ అనే అఖిల్ డైలాగ్ వెంటనే వస్తుంది. ఈ రెండు డైలాగ్‌లతో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయో.. డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.
‘లైఫ్ పార్ట్‌నర్‌లో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు’, ‘ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హజ్బెండ్ చేయాల్సిన పనేంటి’ లాంటి డైలాగ్స్ కూడా అఖిల్ నోటి నుంచి వినవచ్చు. ‘అందరూ ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా’ అనే డైలాగ్‌తో జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లాని కూడా పరిచయం చేశారు. ఈ సినిమాలో తన పాత్రను సస్పెన్స్‌గా ఉంచారు.
తర్వాత కాస్త కామెడీని, హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. ఆ తర్వాత ట్రైలర్ పూర్తిగా ఎమోషనల్‌గా టర్న్ తీసుకుంది. మొత్తంగా ఒకే ట్రైలర్‌లో లవ్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్, కాస్త యాక్షన్ కూడా చూపించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబర్ 15వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.
గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి మనసా మనసా, గుచ్చే గులాబీ, ఏ జిందగీ, లెహరాయి సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వీటిలో మనసా మనసా, లెహరాయి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరో అఖిల్ అక్కినేనిలకు ఈ సినిమా విజయం చాలా కీలకం. అందుకే దీనిపై ఎంతో శ్రద్ధ తీసుకుని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు పలుమార్లు రీషూట్ కూడా చేశారు. కొన్ని రీషూట్ల కారణంగానే అక్టోబర్ 8న విడుదల కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీకి వాయిదా పడిందని కూడా టాక్ వినిపిస్తుంది. అక్టోబర్ 14వ తేదీన విడుదల కానున్న మహాసముద్రంతో ఈ సినిమా పోటీ పడనుంది.
Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు