News
News
X

Vishnu Manchu: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.

FOLLOW US: 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హీరో మంచు విష్ణు స్పందించారు. మంగళవారం ఆయన తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఊరేగింపుగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు దివంగత దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మీడియాతో మాట్లాడారు. 

‘‘పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఆయన మా గురించి చేసిన వ్యాఖ్యలపై నాన్న మోహన్‌బాబే స్పందిస్తారు. 10న ఎన్నికలు పూర్తికాగానే.. 11న విలేకరుల సమావేశం పెట్టి మరీ మాట్లాడతారు. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దని నేను ముందే చెప్పా. కానీ, ఏ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ‘మా’ ఎన్నికల్లో మా ప్యానల్‌ తప్పకుండా గెలుస్తుంది. 900 మంది నాకు ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి మా ప్యానెల్ మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. మా మ్యానిఫెస్టో చూశాక చిరంజీవి, పవన్‌ కూడా మాకే ఓటు వేస్తారు’’ అని విష్ణు తెలిపారు. 

Also Read: పేద కళాకారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. బండ్ల గణేష్ ‘మా’ హామీ!

ప్రకాష్ రాజ్ ఏ వైపు?: ‘‘నిర్మాతలు లేనిదే ఇండస్ట్రీ కూడా లేదు. ‘మా’ ఎన్నికలు ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటం. నేను తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వైపు ఉన్నాను. ప్రకాష్ రాజ్ ఏవైపు ఉన్నారో చెప్పాలి. సినీ పరిశ్రమ వైపా లేదా పవన్ కళ్యాణ్ పక్షమా అనేది ప్రకాష్ రాజ్ చెప్పాలి’’ అని విష్ణు డిమాండ్ చేశారు.

News Reels

Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్

మంగళవారం నామినేషన్లు దాఖలు చేసిన మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు వీరే: 
మంచు విష్ణు - అధ్యక్షుడు
రఘుబాబు - జనరల్‌ సెక్రటరీ
బాబు మోహన్‌ - ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
మాదాల రవి - వైస్‌ ప్రెసిడెంట్‌
పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి - వైస్‌ ప్రెసిడెంట్‌
శివబాలాజీ - ట్రెజరర్
కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ
గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ 
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 28 Sep 2021 02:31 PM (IST) Tags: pawan kalyan Manchu Vishnu Maa elections Vishnu Manchu మా ఎన్నికలు మంచు విష్ణు

సంబంధిత కథనాలు

Gold Movie Review - 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా

Gold Movie Review - 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా

Allu Aravind: బాలయ్య, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా పడితే - అన్‌స్టాపబుల్‌ షోలో ఓపెన్ అయిన అల్లు అరవింద్

Allu Aravind:  బాలయ్య, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా పడితే - అన్‌స్టాపబుల్‌ షోలో ఓపెన్ అయిన అల్లు అరవింద్

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Ennenno Janmalabandham December 1st: 'వేద నా దేవత' అని ఖైలాష్ ని చితక్కొట్టిన యష్- భర్తని అపురూపంగా చూసుకున్న వేద

Ennenno Janmalabandham December 1st: 'వేద నా దేవత' అని ఖైలాష్ ని చితక్కొట్టిన యష్- భర్తని అపురూపంగా చూసుకున్న వేద

టాప్ స్టోరీస్

Mallareddy Case To ED : మల్లారెడ్డికి ఇక ఈడీ చిక్కులు కూడా - సోదాల డీటైల్స్ ఇచ్చి విచారణ చేయాలని ఐటీ సిఫారసు !

Mallareddy Case To ED :  మల్లారెడ్డికి ఇక ఈడీ చిక్కులు కూడా - సోదాల డీటైల్స్ ఇచ్చి విచారణ చేయాలని ఐటీ సిఫారసు !

Etela Rajender : అటుకులు బుక్కి నడిపిన పార్టీకి 8 ఏళ్లలో రూ.870 కోట్లు ఎలా వచ్చాయ్?- ఈటల రాజేందర్

Etela Rajender : అటుకులు బుక్కి నడిపిన పార్టీకి 8 ఏళ్లలో రూ.870 కోట్లు ఎలా వచ్చాయ్?- ఈటల రాజేందర్

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు