అన్వేషించండి

Bigg Boss 5 Telugu: నిశ్చితార్థం ముందు రోజే లేచిపోయిన సిరి.. డయల్ 100కి ఫోన్ చేసి ప్రియుడితో వెళ్లిపోయిన కాజల్‌.. ఒక్కొక్కరిది భలే లవ్‌స్టోరీ

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం నడుస్తోంది. కెప్టెన్సీ టాస్క్ సందడిగా గడిస్తే...ఫస్ట్ లవ్ గురించి చెప్పుకునే ఎపిసోడ్ కాస్త భారంగా గడిచింది.

బిగ్ బాస్ హౌస్‌లో 18వ రోజు సీక్రెట్ టాస్క్ సక్సెస్ ఫుల్‌గా చేయడంతో రవి మొదటి కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచాడని బిగ్ బాస్ ప్రకటించారు. అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి టాస్క్‌లో ఎవరు బెటరో చెప్పాలన్నాడు బిగ్‌బాస్. అమెరికా అబ్బాయి టీమ్‌లో శ్రీరామ్‌ని విశ్వ, సిరి సపోర్ట్ చేశారు. ఇతర సభ్యుల టీమ్ నుంచి శ్వేత ఎంపికైంది. హైదరాబాద్‌ అమ్మాయి టీం నుంచి తనకు ఛాన్స్ కావాలన్నాడు జెస్సీ. చాలా డిస్కషన్స్‌ తర్వాత ఎక్కువ ఓట్లు జెస్సీకి రావడంతో కెప్టెన్సీ పోటీదారుడిగా అతనే ఫైనలయ్యాడు. అయితే ఆప్షన్ లేక ఒప్పుకున్నా కానీ నేను సాటిస్‌ఫై కాలేదని చెప్పేసింది లహరి. ఇది హౌస్‌లో అగ్గిరాజేసింది. సన్నీ, జెస్సీ, లహరీ మధ్య ఫైట్ నడిచింది. రవి ఎంట్రీతో సీన్ కూల్ అయ్యింది. అమెరికా అబ్బాయి టీమ్ నుంచి శ్రీరామ్, హైదరాబాద్ అమ్మాయి టీమ్ నుంచి జస్వంత్, ఇతర సభ్యుల టీమ్ నుంచి శ్వేత, ముందే బిగ్ బాస్ ప్రకటించిన రవితో కలపి మొత్తం నలుగురు సభ్యులు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. 

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ‘స్విమ్ జర స్విమ్’


Bigg Boss 5 Telugu: నిశ్చితార్థం ముందు రోజే లేచిపోయిన సిరి.. డయల్ 100కి ఫోన్ చేసి ప్రియుడితో వెళ్లిపోయిన కాజల్‌.. ఒక్కొక్కరిది భలే లవ్‌స్టోరీ

ప్రతి టేబుల్ పై కెప్టెన్ వర్డ్ పెట్టిన బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న అక్షరాలను తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేయాలి. ఎవరు ముందు వివిధ సైజుల్లో ఉన్న అక్షరాలను ఖాలీ స్లాట్స్ ని ఫిల్ చేస్తే వాళ్లే విజేతని ప్రకటించారు బిగ్ బాస్. మరోవైపు నాతో ఎందుకు మాట్లాడడం లేదని సిరి షణ్ముక్ వెంట పడింది. నీ ప్రాబ్లెమ్ ఏంటన్నాడు షణ్ముక్. ఈ టాస్క్ అయ్యాక మాట్లాడతా అన్నాడు. మాట్లాడతావా అంటే చూద్దాం అన్నాడు. దీంతో రియాక్టైన సిరి మాట్లాడు ప్లీజ్ అని అడిగింది. నా దగ్గరనుంచి దూరంగా పో అన్నాడు షణ్ముక్. లోన్లీగా ఫీలవుతున్నా అంది. ఇంతలో అక్కడకు వచ్చిన జస్వంత్ తో అరె చెప్పరా నాకు ఇంట్రెస్ట్ లేదని అనగానే..ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి నేనేమైనా గర్ల్ ఫ్రెండ్ నా అంది. అక్కడి నుంచి వెళ్లిన సిరి కన్నీళ్లు పెట్టుకుంది. 

లోబో సంచాలకుడుగా టాస్క్ ప్రారంభమైంది . బిగ్ బాస్ బజర్ నొక్కగానే కెప్టెన్సీ టాస్క్ కంటెస్టెంట్స్ అందరూ స్విమ్మిగ్ పూల్ లోకి దూకారు. ఫస్ట్ శ్రీరామ్ వరుసగా సి, ఏ తీసుకొచ్చాడు. ఆ తర్వాత శ్వేతావర్మ, రవి, జెస్సీ కూడా అదే జోరు చూపించారు. శ్రీరామ్ చంద్ర విజేతగా నిలుస్తాడని అంతా భావించారు కానీ జెస్సీ అన్ని స్లాట్స్ ని ఫిల్ చేయడంతో హౌస్ కెప్టెన్ జెస్సీ అయ్యాడు. జెస్సీ నెగ్గాడనుకున్నప్పుడు కూడా ఓ లెటర్ తేడా ఉండడంతో మళ్లీ పూల్ లోకి దూకి  ఫర్ ఫెక్ట్ లెటర్ తీసుకొచ్చి పెట్టి విజేతగా నిలిచాడు. కెప్టెన్ గా గెలిచిన జస్వంత్ ని బిగ్ బాస్ అభినందించారు. ఇంటి కెప్టెన్ అయిన జెస్సీ…షణ్ముక్ ని రేషన్ మానేజర్ గా నియమించాడు. కిచెన్ డిపార్ట్ మెంట్ ప్రియ అని చెప్పినప్పటికీ ఆమె అంగీకరించలేదు. ఎప్పడూ కిచెన్లోనే ఉంటున్నాననే కారణంగా నామినేట్ చేస్తున్నారని ప్రియ వాపోయింది. అందుకే కిచెన్ డిపార్ట్ మెంట్ వద్దని చెప్పింది ప్రియ. 

షణ్ముక్ తనతో సరిగా ఉండడం లేదని సిరి కాజల్‌తో చర్చ పెట్టింది. అస్సలు తనకు స్పేస్ ఇవ్వడం లేదని...అస్తమానం శ్వేతతో ఉంటున్నాడని ఏమైనా అంటున్నానా అని కన్నీళ్ల పెట్టుకుంది. ఆ తర్వాత ఒంటరిగా కూర్చుని ఏడ్చింది. వాళ్లిద్దరి మధ్యా పరిస్థితిని కూల్ చేద్దామని జస్వంత్ ప్రయత్నించాడు. మన రేషన్ మానేజర్ అంటూ షణ్ముక్ ని పరిచయం చేసిన జెస్సీ షేక్ హ్యాండ్ ఇమ్మన్నా సరి పెద్దగా రియాక్టవలేదు. ఇద్దరి చేతులూ కలిపి గొవడకు ఫుల్ స్టాప్ పెట్టేందకు ట్రై చేశాడు జెస్సీ. మరోవైపు లోబో, నటరాజ్, యానీ మాస్టర్ మరో డిస్కషన్ పెట్టారు. ఇక్కడ అందరి మధ్యా సరిగా బాండింగ్ లేదన్నాడ లోబో. అందుకే నా పనేంటో నేను చేసుకుంటున్నా అన్నాడు లోబో.

Also Read:అజీత్ ‘వాలిమై’ గ్లింప్సెస్.. ‘గెట్ రెడీ ఫర్ ది గేమ్’ అంటూ కార్తికేయ ఛాలెంజ్

'మరపురాని తొలిప్రేమ' టాస్క్

Bigg Boss 5 Telugu: నిశ్చితార్థం ముందు రోజే లేచిపోయిన సిరి.. డయల్ 100కి ఫోన్ చేసి ప్రియుడితో వెళ్లిపోయిన కాజల్‌.. ఒక్కొక్కరిది భలే లవ్‌స్టోరీ

బెలూన్ పై తొలిప్రేమ పేరు రాశి ఎందుకు ప్రత్యేకమో ఎప్పటికీ ఎందుకు గుర్తుంటుందో రాసి గాల్లోకి వదలాలి. ఈ టాస్క్ షణ్ముక్ తో మొదలైంది.

షణ్ముక్: ఎనిమిదో క్లాస్ నుంచి ఇంటర్ వరకూ ఎప్పుడూ ఆమె అంటే పిచ్చే. ఇంటర్ సెకెండియర్ ఎండింగ్ లో తనకి చెప్పాను. ఆ తర్వాత బ్రేకప్ అయింది. అప్పుడే డాన్స్ ,నటనపై దృష్టిసారించా అన్నాడు.

సిరి: తనపేరు విష్ణు..అందరూ ముద్దుగా చిన్నా అంటారు.ఇద్దరం ఎదరెదుర ఇళ్లలో ఉండేవారం..మా లవ్ టెన్త్ క్లాసులో మొదలైంది. తను ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకున్నా. తెల్లారితే నిశ్చితార్థం అనగా ఇంట్లోంచి వెళ్లిపోయా. ఆ తర్వాత తన తల్లి నచ్చజెప్పడంతో మళ్లీ ఇంటికి తిరిగొచ్చా అప్పటి నుంచి సంతోషంగా తనతో రిలేషన్ కొనసాగించా కానీ ఓ యాక్సిడెంట్‌లో చనిపోవడం పెద్ద షాక్ అని కన్నీళ్లు పెట్టుకుంది.

విశ్వ: బెలూన్‌పై సుమలత అనే పేరు రాసిన విశ్వ..పదేళ్ల వయసు నుంచే ఆమె అంటే ఏదో తెలియని ఇష్టం అన్నాడు. అప్పట్లో సినిమాల ప్రభావం కూడా బాగానే ఉందన్నాడు. ఆమె నాకు వరుస కాదని తెలిసినా ఆ ఫీలింగ్ పోలేదన్న విశ్వ .. తన జీవితంలోకి శ్రద్ధ రావడంతో మొత్తం మారిపోయిందని చెప్పుకొచ్చాడు. 

ప్రియాంక: పేరు రవి..నేను మాత్రం అబ్బాయి అనేదాన్ని అంటూ మొదలు పెట్టి చాలా చెప్పింది. తనని ఓ ఫంక్షన్లో చూసానని అప్పటి నుంచి ఇద్దరం క్లోజ్ గా ఉండేవారమని తనకు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడని చెప్పింది ప్రియాంక. అమ్మాయిగా మారిన తర్వాత కొద్దినెలల పాటు తనకి చెప్పకుండా ఉండిపోయి..కొన్నాళ్ల తర్వాత తన ముందుకి వెళ్లినా వెంటనే యాక్సెప్ట్ చేయడం సంతోషంగా అనిపించింది. అప్పటి వరకూ క్లోజ్ గా ఉన్న అబ్బాయి…పెళ్లి మాటెత్తగానే మారిపోయాడన్న పింకీ..పెళ్లి చేసుకుందాం అని అడిగగానే తన విశ్వరూపం చూపించాడని ఆవేదన చెందింది. నువ్వు అమ్మాయివా, నీకు పిల్లలు పుడతారా అని చాలా కించపరిచే పదాలతో మాట్లాడాడంది. తన బండి వెనకే పరిగెత్తినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడని చెప్పింది. మాటలతో ఇబ్బంది పెట్టాడని ఏమోషన్ అయింది. 

యానీ మాస్టర్: లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రమోద్ చాలా సపోర్ట్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది యానీ. ఇప్పటి వరకూ ఐ లవ్ యూ చెప్పలేదు కానీ తన ప్రేమ ద్వారా అంతకుమించిన ఫిలీంగ్ కల్పించాడంది. తాను కరోనా బారిన పడినప్పుడు ప్రమోద్ చేసిన సేవలు మరిచిపోలేనంది యానీ.  అమ్మ సపోర్ట్ తో ఎదిగినా, నా భర్త సపోర్ట్ లేకుండా ఈ రోజు ఇక్కడుందేదాన్ని కాదని చెప్పుకొచ్చింది. 

రవి: సాయిబాబా గుడిలో హారతి ఇచ్చేటప్పుడు తనని మొదట చూశాను. తన కోసం తను జాయిన్ అయిన కాలేజీలో చేరాను. నేను కశ్చీఫ్ వేసేలోగా వేరే వాడు ట్రై చేసి నన్ను హెల్ప్ చేయమన్నాడు. కానీ ఆ అమ్మాయి తనలో చాలా  కాన్ఫిడెన్స్ నింపిందని..తాను ఉన్నతంగా ఎదిగేందుకు సహాయం చేసిందన్న రవి ఇప్పుడు ఆమె ఓ బిడ్డకి తల్లి. ఆ బిడ్డకు నేనే తండ్రిని..తనే ఇప్పుడు నా జీవిత భాగస్వామి నిత్య అని చెప్పాడు.

నటరాజ్ : కలర్ ఫుల్ లైఫ్ మధ్య తను కూల్ గా ఉండేది . అందరి మధ్యా మాట్లాడేది కాదు కానీ ఇంటికి వెళ్లాక కాల్ చేసేది. హలో అంటే బేబీ అనేది. ఏంటి చెప్పు అని గట్టిగా మాట్లాడి ఫోన్ కట్ చేసేవాడిని. కానీ తనెప్పుడూ సున్నితంగానే మాట్లాడేదని…ఓసారి క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నాం. ఈ రోజు హౌస్ లో ఉన్నానంటే అందుకు కారణం తన భార్యే అన్నాడు నటరాజ్ మాస్టర్.

జెస్సీ: 18 ఇయర్స్ అప్పుడు డేర్ చేసి నా క్లాస్ మేట్ ని ఫాలో అయ్యా. ఇప్పుడంటే బాగా మాట్లాడగలుగుతున్నా కానీ అప్పుడు ఓకల్ కార్డ్ ప్రాబ్లెమ్ వల్ల సరిగా మాట్లాడలేకపోయేవాడిని. ఎట్టకేలకు ఓ రోజు తన వెంటే వెళ్లి చాక్లెట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాను. చూసి నవ్వి తలూపి వెళ్లిపోయింది. ఆ తర్వాత చదువు పూర్తయ్యాక ఎవరికి వాళ్లు వెళ్లిపోయాం. ఓసారి ఫ్రెండ్ నుంచి నంబర్ తీసుకుని కాల్ చేస్తే బ్లాక్ చేసింది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చింది.  రెండు రోజల పాటూ కంటిన్యూగా చాట్ చేసి ..తను చెప్పాల్సింది చెప్పి మళ్లీ బ్లాక్ చేసింది. ఇప్పటికీ చిన్నీ కోసం హార్ట్ వెయిట్ చేస్తోందన్న జెస్సీ నువ్వు సింగిల్ అయితే వాంట్ టూ మింగిల్ అని బెలూన్ కి హగ్ ఇచ్చి గాల్లోకి వదిలాడు

ప్రియా: టెన్త్ క్లాస్ తర్వాత ఫస్ట్ లవ్ మొదలైందని చెప్పింది ప్రియా. తనని కేక్ అని పిలిచేదాన్ని అని చెప్పుకొచ్చింది. తను హీరో అవుదామని స్టూడియోకి వచ్చాడు. ఆ సమయంలో అక్కడ నన్ను చూసి ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నా కుటంబం ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల్లో ఉండడంతో కుటుంబాన్ని వదిలేసి వెళ్లలేకపోయా. కానీ తన తల్లిదండ్రులు అంగీకరించకపోయినా నా తల్లిదండ్రులు మా ఇద్దరి పెళ్లి చేశారు. లవ్ కి, ఇష్టం దాటి వెళితే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా అవసరం అన్న మాట లేట్ గా అర్థమైందన్న ప్రియా…ఇప్పుడు మ్యారీడా, సెపరేటెడా , డైవర్సీనా తెలీదంటూ..తన ఫస్ట్ లవ్ కేక్ అంటూ బెలూన్ వదిలిపెట్టింది.

కాజల్: అక్కకి అవసరమై ఓ పనిపై వెళ్లి అక్కడున్న వారి కాంటాక్ట్ నంబర్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడని చెప్పుకొచ్చింది కాజల్. ఆ తర్వాత తనతో ప్రేమలో ఉన్నానని తెలిసి హైదరాబాద్ నుంచి వైజాగ్ పంపించేశాని..తనని ఇంట్లో బంధించారనే ఫీలింగ్ లో డయల్ 100 కి కాల్ చేసి చెప్పానంది కాజల్. అమ్మా నాన్న అన్నం తింటున్న సమయంలో పోలీసులు రావడంతో వాళ్లకేం అర్థంకాలేదు..ఆ క్షణం వాళ్లని వదిలి ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నా అని చెప్పింది కాజల్. అయితే తనకు పాప పుట్టిన తర్వాత తల్లిదండ్రుల ప్రేమ అర్థమైందని బాధపడిన కాజల్…ఇప్పుడు తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నానంటే తన తల్లిదండ్రులు భర్తని, పాపని చూసుకుంటున్నారని చెప్పింది. భర్త సపోర్ట్ తోనే కెరీర్ పరంగా ఎదిగానన్న కాజల్..థ్యాంక్యూ బుజ్జీ ఐ యామ్ నథింగ్ వితౌట్ యూ...అని బెలూన్ వదిలిపెట్టింది.

లోబో: 14 ఏళ్లపాటూ ఓ అమ్మాయిని ప్రేమించానన్న లోబో..ఇప్పటికీ ఆమె తాగి పడేసిన ప్లాస్టిక్ కప్పులు, వాడి పడేసిన టిష్యూ పేపర్లు ఉన్నాయన్నాడు. ఓ ఏడాది ఆమె పుట్టిన రోజుకి టాటూ గిఫ్ట్ ఇచ్చానని 22 మే 1.30 కి ప్రపోజ్ చేసిన ‘క్లాక్ టాటూ’ హౌస్ మేట్స్ కి చూపించాడు. ఆమెకి పెళ్లైంది కొడుకు పుట్టాడు. నాకు పెళ్లైంది కూతురు పుట్టింది. నా భార్య పేరు షాహిన్ బేగం …తన కారణంగానే ఈ స్టేజ్ లో ఉన్నానని చెప్పాడు లోబో.

Also Read: ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..’ మోస్ట్ ఇంటెన్స్ ట్రైలర్ వచ్చేసింది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget