Valimai Glimpses: అజీత్ ‘వాలిమై’ గ్లింప్సెస్.. ‘గెట్ రెడీ ఫర్ ది గేమ్’ అంటూ కార్తికేయ ఛాలెంజ్
అజీత్ కుమార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం.. ‘వాలిమై’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సెస్ వీడియోను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది.
అజీత్ కుమార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం.. ‘వాలిమై’. ఈ టైటిల్‌లో తెలుగులో అర్థం బలం. బైక్ రేస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ తమిళ చిత్రంలో ప్రతినాయకుడిగా తెలుగు హీరో కార్తికేయ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సెస్ వీడియోను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. చూస్తుంటే.. ఈ చిత్రం ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాగా కనిపిస్తోంది. ఇందులో అజీత్, కార్తికేయలు బైక్ రేసర్లుగా కనిపిస్తున్నారు.
దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా హుమా ఖురేషీ, బానీ, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయ్యింది. అనంతరం చిత్రయూనిట్ మరికొన్ని పతాక సన్నివేశాల చిత్రీకరణ కోసం రష్యా వెళ్లారు. అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత అజీత్.. తన స్నేహితుడితో కలిసి బైక్ ట్రిప్‌కు వెళ్లారు. రష్యాలో సుమారు 5 వేల కిలోమీటర్లు ఆయన చుట్టివచ్చారని తెలిసింది. అలాగే, అజీత్ బైకు మీద ప్రపంచయాత్రకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Glimpses of Valimai:
రష్యాలో అజీత్ బైకు మీద షికారు చేస్తున్న ఫొటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అజీత్ నటనలోకి రావడానికి ముందు బైక్ రేసర్ కావాలని అనుకున్నారు. అయితే, సినిమాల్లో వరసు అవకాశాలతో అజీత్ బిజీగా మారిపోయారు. అయితే, ఎప్పుడు సమయం దొరికినా కార్, బైక్ రేసుల్లో పాల్గొనేవారు. ఏరో మోడలింగ్, కార్ రేస్, బైక్ రేస్‌పై అజీత్ పట్టు సాధించారు. కొన్ని నెలల కిందట అజీత్ ఇండియాలో సుమారు 10,800 కిమీలు ప్రయాణించారు. అజీత్ కొన్ని ఇటీవల రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు సైతం అర్హత సాదించడం గమనార్హం.
Also Read: ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..’ మోస్ట్ ఇంటెన్స్ ట్రైలర్ వచ్చేసింది!
Also Read: ఆ వార్తల్లో నిజం లేదు.. అవి చూసి చాలా బాధపడ్డా: నాగ చైతన్య
Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్
Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?