Chaitanya-Samantha: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?
ఇన్ స్టాలో పోస్టులకు, ట్విట్టర్లో కామెంట్స్ కి సంబంధం లేదు. ఇద్దరం ఒకరినొకరం బాధ పెట్టుకుని ఉండొచ్చని ఇన్ స్టా లో కొటేషన్స్…నాగ్ మామ అని ట్విట్టర్లో పోస్టులు, అసలేం జరుగుతోంది..
అక్కినేని నాగచైతన్యతో సమంతకు స్పర్థలు వచ్చాయని, ఇద్దరూ విడిపోతున్నారని హడావుడి జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టే ఉంది వీరి ప్రవర్తన కూడా ఉంది. సోషల్ మీడియాలో ఈ విషయం మారుమోగిపోతున్నా ఇప్పటి వరకూ ఇద్దరూ స్పందించకపోవడం విమర్శలకు మరింత ఊతమిచ్చినట్టైంది. మరోవైపు సమంత మాత్రం ఇటు భర్త చైతన్య.. అటు మామ నాగార్జునకు సంబంధించిన పోస్టులపై పాజిటివ్ గా రియాక్టవుతూ.. అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది.
This is so beautiful @iamnagarjuna mama 🥺🙏🤗❤️ #ANRLivesOn https://t.co/Xt6XQ6rhNu
— S (@Samanthaprabhu2) September 20, 2021
ఇక తాజాగా నాగార్జున పోస్ట్‌కు సమంత స్పందించింది. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నాగార్జున ఆయనకు నివాళులర్పిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ట్విట్టర్ ద్వారా స్పెషల్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను చైతన్య కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టును షేర్ చేసిన సమంత 'నాగార్జున ఇది చాలా అందంగా ఉంది' అంటూ మొదట కామెంట్ చేసింది. ఎప్పుడూ 'మామ' అని సంబోధించే సమంత ఇలా కామెంట్ చేయడంతో అందరూ షాకయ్యారు. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆమె వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసి.. మళ్లీ 'మామ' అంటూ కొత్త ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు మరింత గందరగోళానికి గురయ్యారు.
Also Read: విశాల్ ఆ ఊపుడేంది? తెలుగు డబ్బింగ్‌పై ఫన్నీ వీడియో వదిలిన హీరో
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత గురించి గత నెల రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య విభేధాలు తలెత్తాయని.. ఇది విడాకుల వరకు దారితీసిందని రూమర్స్ వస్తున్నాయి. వీటిపై అటు చైతన్య కానీ ఇటు సామ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల 'లవ్ స్టోరీ' ట్రైలర్ సందర్భంగా ఒకరికొకరు ట్వీట్ చేసుకున్నప్పటికీ.. పుకార్లకు బ్రేక్ పడలేదు. ఇదే సమయంలో సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ''అఫ్ కోర్స్ నేను నిన్ను బాధపెట్టి ఉండొచ్చు.. నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. ఇద్దరం ఒకరినొకరం బాధ పెట్టుకుని వుండొచ్చు. కానీ ఇదే ఉనికి. వసంతకాలం కావాలంటే శీతాకాల ప్రమాదాన్ని అంగీకరించాలి. ఉనికిగా మారడమంటే లేని ప్రమాదాన్ని అంగీకరించడం'' అంటూ సామ్ పలు కోట్‌లు పోస్ట్ చేసింది.
ALSO READ: కీర్తి సురేష్, త్రిషలతో సమంత పార్టీ.. ఫొటోలు వైరల్..
మరోవైపు ‘లవ్ స్టోరీ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కూడా సామ్ హాజరు కాలేదు. చాలా రోజుల తర్వాత చైతూ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ జరుగుతున్నా ఎక్కడా సామ్ కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. ఇప్పుడు వైరల్ అవుతోన్న మరో వార్త ఏంటంటే ఇద్దరి కుటుంబాలు చాలా తీవ్రంగా ప్రయత్నించినా చై-సామ్ మనసు మార్చుకోవడం లేదట. వీరిద్దరు కలిసుంటున్న ఇంట్లోంచి ఇప్పటికే నాగ చైతన్య తండ్రి నాగార్జున నివసిస్తున్న ఇంటికి వెళ్లిపోయాడని చెబుతున్నారు. సమంత కూడా ముంబై వెళ్లిపోయే ప్రయత్నంలో ఉందనే వార్తలొస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఇద్దరూ తమ ఇష్టపూర్వకంగానే, పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేశారని సమాచారం. వారిద్దరినీ కలిపి ఉంచేందుకు నాగార్జున చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని అంటున్నారు. అయితే ‘చై’కు గతంలో లవింగ్ హజ్బెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది సామ్. హఠాత్తుగా వారిద్దరి మధ్య ఏమైందో తెలియక అక్కినేని అభిమానులు బాధపడుతున్నారు. వచ్చే నెలలో పెళ్లి రోజు నాటికైనా దీనిపై క్లారిటీ ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నారు.
ALSO READ: సమంతకు లవర్ దొరికేశాడు! సామ్ పేరుతో చేతిపై టాటూ కూడా.. ఇవిగో ఫొటోలు