News
News
X

Samantha: సమంతకు లవర్ దొరికేశాడు! సామ్ పేరుతో చేతిపై టాటూ కూడా.. ఇవిగో ఫొటోలు

సమంతా నువ్వేనా మొదటి, ఆఖరి ప్రేమవంటూ.. అతడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. చేతిపై టాటూ వేయించుకుని మరీ సామ్ దృష్టిలో పడ్డాడు.

FOLLOW US: 

సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడటం మీడియాకు అలవాటే. ముఖ్యంగా ఇండ్రస్ట్రీలో పేరొందిన దిగ్గజాలు పెళ్లి చేసుకుంటే.. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ప్రతి ఒక్కరి చూపు వారిపైనే ఉంటుంది. తాజాగా సమంత, నాగ  చైతన్య కూడా అలాంటి పరిస్థితితే ఎదుర్కొంటున్నారు. వీరు కొద్ది రోజులుగా కలిసి కనిపించకపోవడంతో.. విడాకులు తీసుకుంటున్నారంటూ వదంతులు షికారు చేయడం మొదలుపెట్టాయి. వారి మనసులో ఆ ఉద్దేశం ఉందో లేదోగానీ.. ఆ వార్తలు ఆ జంటను చాలా ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అది పూర్తిగా వారి వ్యక్తిగత జీవితం. కానీ, అభిమానులు ఎప్పుడూ.. వారిద్దరు కలిసి ఉంటే చూడాలనే కోరుకుంటారు. 

సమంత తన సోషల్ మీడియా వేదికల్లో తన ‘అక్కినేని’ పేరును తొలగించిన రోజు నుంచి ఈ వదంతులు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆమె ఒంటరిగా గోవా వెళ్లడంతో చైతుతో ఆమె విడిపోతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే సామ్.. ఇటీవల విడుదలైన ‘లవ్ స్టోరీ’ సినిమా గురించి ట్వీట్ చేయడం, ఇందుకు చైతన్య సమంతకు థాంక్స్ చెప్పడంతో.. హమ్మయ్య వీరిద్దరు మాట్లాడుకుంటున్నారని సంతోషపడ్డారు. కొందరు మాత్రం సమ్‌థింగ్ ఫిషీ అంటూనే ఆ జంటపై ఓ కన్నేసి ఉంచారు. శుక్రవారం ఆమె వధువు గెటప్‌లో ఉన్న ఫొటోలను చూసి కూడా చాలామంది.. ట్రోల్ చేశారు. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: ఇది, బన్నీ అంటే.. ఒక్క దోశకు రూ.1000 చెల్లించిన అల్లు అర్జున్, ఉద్యోగం ఇస్తానని హామీ!

అవన్నీ పక్కన పెడితే.. సమంతకు కొత్తగా ఓ ప్రియుడు దొరికాడు. అతడి పేరు పవన్ సమ్ము. అతడు తన చేతి మీద ఆమె పేరును పచ్చ బొట్టు పొడిపించుకున్నాడు. ‘‘సమ్ము నా మొదటి, ఆఖరి లవ్. నీ మీద నా ప్రేమ అనంతం. నీ మీద నా ప్రేమ.. ఈ టాటూ కూడా శాస్వతం’’ అంటూ.. పచ్టబొట్టు పొడిపించుకుంటున్న ఫొటోలను సమంతతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సమంత అతడి పోస్టును రీట్వీట్ చేసుకుని.. విషాదం ఎమోజీలను పెట్టింది. ఈ పోస్ట్ చూసి మిగతా ఫాలోవర్లు కూడా తమ పచ్చబొట్టు టాటులను ట్వీట్ చేస్తున్నారు. 

Also Read: నాడు కమల్‌ హాసన్‌పై విమర్శలు.. నేడు అంతా ఆయన బాటే, ఓటీటీలో సినిమాలు.. థియేటర్లకు ముప్పు?

Also Read: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ

Also Read: పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు

Published at : 16 Sep 2021 07:25 PM (IST) Tags: Samantha Akkineni samantha సమంత Samantha Tatoo Samantha Naga Chaitanya

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల