Allu Arjun: ఇది, బన్నీ అంటే.. ఒక్క దోశకు రూ.1000 చెల్లించిన అల్లు అర్జున్, ఉద్యోగం ఇస్తానని హామీ!
రోడ్డు పక్క హోటల్‌లో దోశ తినడమే కాదు.. దానికి వెయ్యి రూపాయలు చెల్లించి మరీ ఆ పేదవాడి ముఖంలో సంతోషాన్ని చూశాడు బన్నీ.
అల్లు అర్జున్ ప్రస్తుతం బన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో బన్నీ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ‘పుష్ప’ షూటింగ్ నిమిత్తం ఇటీవల బన్నీ ఇటీవల కాకినాడ వెళ్లాడు. అయితే, వర్షాల వల్ల షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో హోటల్‌లో టైంపాస్ చేయలేక.. కాకినాడ పరిసరాల్లో తిరుగుతూ సందడి చేశాడు. ఇందులో భాగంగా బన్నీ.. రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి వద్దకు వెళ్లి అల్పాహారాన్ని తీసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
షూటింగ్ కోసం కారులో గోకవరం వెళ్తున్న బన్నీకి రోడ్డు పక్కన ఓ టిఫిన్ బండి కనిపించింది. వెంటనే కారు నుంచి దిగిన బన్నీ.. నేరుగా అక్కడికి వెళ్లి దోశ ఆర్డర్ ఇచ్చాడు. టిఫిన్ తింటూ కాసేపు హోటల్ యజమానితో బన్నీ ముచ్చటించాడు. కరోనా తర్వాత పరిస్థితులు మరిపోయానని, నష్టాల్లో కూరుకుపోయామని యజమాని చెప్పడంతో బన్నీ చలించిపోయాడు. టిఫిన్ తిన్న తర్వాత బన్నీ అతడికి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ‘‘మీరు మా హోటల్‌కు రావడమే చాలా గొప్ప విషయం. మేం చాలా అదృష్టవంతులం’’ అంటూ డబ్బులు తీసుకోడానికి నిరాకరించాడు. దీంతో బన్నీ అతడి చేతిలో రూ.1000 పెట్టాడు. అంతేగాక.. హైదరాబాద్‌కు వస్తే ఉద్యోగం ఇస్తానని అతడికి చెప్పాడు. దీంతో ఆ హోటల్ యాజమాని సంతోషానికి అవధుల్లేవు. బన్నీ తనతో చాలా స్నేహంగా వ్యవహరించాడని, తన సమస్యలను అడిగి తెలుసుకున్నాడని అతడు తెలిపాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో బన్నీ విభిన్నమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం షూటింగ్ మొత్తం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందాన్న నటిస్తోంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండవ భాగం కోసం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. డిసెంబరు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.
కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ కు అంతా సిద్ధమైన సమయంలో.. ఆ ఏరియాలో భారీగా వర్షం పడడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయంలో బన్నీ ఏం చేశాడో తెలుసా.. గోపీచంద్ సినిమా సిటీమార్ ఇప్పటికే థియేటర్స్ లో సందడి చేస్తోంది. దీంతో గోపిచంద్ సినిమాకు ప్రమోషన్ అన్నట్టు.. సరదగా సిటీమార్ సినిమాను కాకినాడలోని ఓ థియేటర్‌లో వీక్షించాడు.
గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘సీటీమార్’ సినిమాను అభిమానులతో కలిసి చూశారు అల్లు అర్జున్.. దీంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బన్నీతో ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. మరి ఆదివారం అయినా షూటింగ్‌కు వాతావరణం అనుకూలిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘అల వైకుంఠపురంలో’ సినిమా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో అభిమానులు ‘పుష్ప’ సినిమా గురించి వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. అలాగే బన్నీ కూడా ఈ చిత్రం షూటింగ్ ముగిసేవరకు మరే చిత్రం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం పెండింగులో ఉన్నాయి. ‘పుష్ప’లో ఊర మాస్ గెటప్‌లో బన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పట్లో తన లుక్ మార్చుకోవడం కుదరదని చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఈ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ ముగించుకుని.. బన్నీ కొత్త చిత్రాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాడు.