Samantha Naga Chaitanya: ఆ వార్తల్లో నిజం లేదు.. అవి చూసి చాలా బాధపడ్డా: నాగ చైతన్య
‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడారు నాగ చైతన్య. ఈ సందర్భంగా కొన్ని వార్తలు తనని బాధపెట్టాయని చెప్పారు.
![Samantha Naga Chaitanya: ఆ వార్తల్లో నిజం లేదు.. అవి చూసి చాలా బాధపడ్డా: నాగ చైతన్య I was very upset to see the gossips coming at me says Naga chaithanya Samantha Naga Chaitanya: ఆ వార్తల్లో నిజం లేదు.. అవి చూసి చాలా బాధపడ్డా: నాగ చైతన్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/702f6f55401bc403a69fa2f48d79942d_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నాగ చైతన్య, సమంతా విడాకులు తీసుకోనున్నారని, త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తారంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు చైతు, సామ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఓ ఇంటర్వ్యూలో చైతూ అసత్య వార్తలపై తన బాధను వెల్లడించారు.
నాగచైతన్య ఏ వార్తలనుద్దేశించి అన్నారో తెలియదు కానీ, మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు తనను బాధపెట్టాయని చెప్పారు. తన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్ లో భాగంగా ఆయన ఒక ప్రైవేటు టీవీ ఛానెల్ లో మాట్లాడారు. ఆ కార్యక్రమంలో తాను వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని వేరువేరుగా చూస్తానని చెప్పారు. కెరీర్ ప్రారంభంలోనే ఆ రెండింటినీ వేరుగా చూడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తన తల్లిదండ్రులు కూడా ఇంట్లో అలాగే ఉంటారని, బిజినెస్, షూటింగ్స్ గురించి మాట్లాడుకోరని, అలాగే పనిలో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించరని తెలిపారు. వారిని చూసి తాను కూడా అలాగే నేర్చుకున్నానని అన్నారు. కానీ గతంలో తనను కొన్నిసార్లు అసత్య కథనాలు బాధపెట్టాయని చెప్పారు.
పాతరోజుల్లో మ్యాగజైన్స్ ఉండేవని, అవి నెలకోసారి వచ్చేవని, దీని వల్ల నెలంతా ఆ మ్యాగజైన్ లో వచ్చే వార్తలు గురించే చర్చ ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు నిమిషాల్లో ఒక వార్త స్థానంలోకి మరో వార్త వచ్చేస్తోందని అభిప్రాయపడ్డారు. వార్తలు ఎన్ని వచ్చినా ప్రజలకు నిజాలు మాత్రమే గుర్తుంటాయని అర్థమయ్యాక పట్టించుకోవడం లేదని వివరించారు. అయితే అవి ఏ కథనాలో, ఏ నేపథ్యంలో వచ్చిన కథనాలో ప్రస్తావించలేదు.
Also read: నెలసరి నొప్పి భరించలేకపోతున్నారా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ప్రస్తుతం కూడా చైతూ-సమంతలా విడాకుల విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై రోజుకో వార్త వినిపిస్తోంది. కానీ అక్కినేని ఫ్యామిలీ ఇంతవరకు దీనిపై స్పందించలేదు. సమంత మాత్రం తన సోషల్ మీడియా ఖాతాల్లో చిన్న చిన్న పోస్టులు పెడుతూ సస్పెన్స్ ను పెంచేస్తోంది. అక్టోబర్ 7... వీరి పెళ్లి రోజున ఓ క్లారిటీ వచ్చేస్తుందని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సామ్-చైల పెళ్లి 2017లో జరిగింది.
Also read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Also read: నన్ను కేసులో ఇరికించారు.. చివరికి సత్యమే గెలుస్తుంది.. నటి ఆవేదన
Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?
Also read: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే విటమిన్ డి లోపం కావచ్చు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)