News
News
X

Egg yolks: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?

గుడ్డులో పోషకాలు ఎక్కువేనని చాలా సార్లు చదువుకున్నాం. అయినా పచ్చసొన పడేసేవాళ్లు ఇప్పటికీ ఎక్కువమందే. నిజంగా పచ్చసొన తింటే ప్రమాదమా?

FOLLOW US: 

గుడ్డును సంపూర్ణ పోషకాహారం అంటారు. మరి మనలో చాలా మంది గుడ్డును సంపూర్ణంగా తినకుండా తెల్లసొన తిని, పచ్చసొన పడేస్తారు. అలాంటప్పుడు గుడ్డు అందించే సంపూర్ణ పోషకాలు మనకెలా అందుతాయి? శరీరానికి ఉపయోగపడే మినరల్స్ 45 అయితే, అందులో గుడ్డులో 44 మినరల్స్ ఉన్నాయి. అందులోనూ పచ్చసొనలో 12 దాకా మినరల్స్ ఉన్నాయి. కనుక సంపూర్ణ ఆరోగ్యం కోసం పచ్చసొన కూడా తినాల్సిందే. సెలెబ్రిటీ డైటీషియన్ రుచిరా బాత్రా చెప్పిన దాని ప్రకారం... పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ అది రక్తంలో కలిసే చెడు కొలెస్టాల్ కాదు. పచ్చసొనలో అధిక కొవ్వు ఉన్నప్పటికీ అది  రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదని అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. కాబట్టి పచ్చసొనను కూడా తింటే చాలా మంచిది. అయితే ఊబకాయంతో బాధపడే వారు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే పచ్చసొనను తీసుకుంటే మంచిది. 

పచ్చసొనలో విటమిన్ ఎ, బి, ఇ, డి, కె లతో పాటూ సెలీనియం, జింక్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్ డి కూడా దీన్నుంచి లభిస్తుంది. ల్యూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ దీనిలో ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజుకో గుడ్డు తినడం అలవాటుగా మార్చుకుంటే గుండె సంబంధింత వ్యాధులకు గురికాకుండా జాగ్రత్త పడచ్చు. గుడ్డలోని ఇనుమును శరీరం సులువుగా గ్రహిస్తుంది. గర్భవతులకు గుడ్డు పెడితే అందులోని ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడంలో గుడ్డులోని బయోటిన్ సహకరిస్తుంది. 

బరువు పెరుగుతారా?
బరువు పెరగడం అనేది శరీరంలోకి చేరే కెలోరీల మీద ఆధారపడి ఉంటుంది. పచ్చసొనలో కెలోరీలు తక్కువగానే ఉంటాయి. కనక దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం పెట్టుకోవద్దని అంటున్నారు రుచిరా భాత్రా. ఎక్కువ ఆహారం తింటే ఎక్కువ కెలోరీలు ఒంట్లోకి చేరతాయి... అలాగే ఎక్కువ గుడ్లు తింటే... అధికంగా కెలోరీలు శరీరానికి అందుతాయి అంటున్నారు ఆమె. కనుక రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని, బరువు పెరుగుతామన్న భయం పెట్టుకోవద్దని చెబుతున్నారు. కనుక పచ్చసొన తీసి బయటపడేయకుండా తిని ఆరోగ్యంగా ఉండండి. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత
Also read: ఆన్ లైన్ లో స్పెర్మ్ ఆర్డర్... తొమ్మిది నెలల తరువాత పండంటి బిడ్డ
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం

Published at : 23 Sep 2021 07:49 AM (IST) Tags: Good food Egg yolks unhealthy Food Food Expert

సంబంధిత కథనాలు

ఉదయం లేవగానే ఈ పనులు చేసి చూడండి - ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం

ఉదయం లేవగానే ఈ పనులు చేసి చూడండి - ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం

Krishnashtami Recipes: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు

Krishnashtami Recipes: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు

Diet Drinks: ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఎంత ముప్పో తెలిస్తే మళ్లీ ముట్టరు!

Diet Drinks: ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఎంత ముప్పో తెలిస్తే మళ్లీ ముట్టరు!

Banana: అరటి పండు అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త

Banana: అరటి పండు అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త

Periods Pain: నెలసరి నొప్పి రాకుండా ఉండాలంటే తాగాల్సిన డ్రింకులు ఇవే

Periods Pain: నెలసరి నొప్పి రాకుండా ఉండాలంటే తాగాల్సిన డ్రింకులు ఇవే

టాప్ స్టోరీస్

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

YSRCP Vs Janasena :  వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!