By: ABP Desam | Updated at : 23 Sep 2021 03:05 PM (IST)
నటి గెహనా వశిష్ట్ (Image credit: Instagram)
రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి గెహనా వశిష్ట్ పై కేసు నమోదైంది. ఆమె అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడినట్టు పోలీసులు చెప్పారు. అయిదు నెలలుగా జైల్లోనే ఉంది. జైలుకి వెళ్లినప్పటి నుంచి ఆమె బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తోంది. చివరికి సుప్రీం కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. అలాగే పోలీసులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది కోర్టు. ఇదే కేసులో రాజ్ కుంద్రాకు సోమవారమే బెయిల్ లభించింది. కాగా గెహనా గతంలో బాంబే హైకోర్టుకు మొదట బెయిలు కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టులో సవాలు చేసి బెయిలు పొందింది. బెయిలు రావడంపై ఆనందం వ్యక్తం చేసింది గెహనా. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అంది.
ఆమె తన ఇన్ స్టా ఖాతాలో బెయిలుపై స్పందించింది. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని పోస్టు పెట్టింది. గురువారం ముంబై క్రైమ్ బ్రాంచ్ ముందు విచారణకు హాజరైంది. విచారణ పూర్తయ్యాక బయటికి వస్తూ మీడియాతో మాట్లాడింది. ‘ఎఫ్ ఐఆర్ చూస్తే నా మీద పెట్టిన కేసు తప్పని అందరికీ అర్థమవుతోంది. అయినా సరే ఆ కేసులో నన్ను కొనసాగించారు. కానీ చివరకు నాకు బెయిలు లభించింది. ఇందుకు సుప్రీంకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పింది. తాను పోర్నోగ్రఫీ కేసు విషయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్లే తనను అదే కేసులో ఇరికించారని అంది గెహనా. ‘నన్ను బలవంతంగా ఇందులో ఇరికించారని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది.
రాజ్ కుంద్రా బెయిలుపై స్పందించమని మీడియా ప్రతినిధులు అడగ్గా ‘నేను అతడి గురించి ఏ కామెంట్లు చేయదలచుకోలేదు. మా ఇద్దరం కలిసి నిర్మించిన సినిమాలు పోర్న్ కాదు అని మాత్రమే చెప్పదలచుకున్నా’ అని ముగించింది గెహనా.
Hon. Supreme Court of India has allowed my Interim Application of Bail with a condition to attend Investing Authority when required so I am appearing before the Investigation Agency i.e. Property Cell, Byculla tomorrow 23rd September, 2021 at 11AM for my statement. @ANI
— GEHANA VASISTH (@GehanaVasisth) September 22, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Also read: ‘మా’ ఎన్నికలు: ప్రకాష్ రాజ్‌తో మంచు విష్ణు ‘ఢీ’.. ప్యానెల్ ప్రకటన
Also read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత
Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడు నెలల కాల్షీట్స్ - రూ.60 కోట్ల రెమ్యునరేషన్
Liger: జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీ - విజయ్ దేవరకొండ స్పెషల్ మెసేజ్
Akshay Kumar: రామ్ చరణ్ ను 'అన్నా' అని పిలిచిన అక్షయ్ - ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ
Gopichand: రాని విషయాన్ని కెలకడం ఎందుకు? - డైరెక్షన్ పై గోపీచంద్ రియాక్షన్
Thor Love and Thunder Movie: ఇండియాలో ఒక్క రోజు ముందుగా 'థార్' - డే అండ్ నైట్ 96 గంటల పాటు...
Business Reforms Action Plan 2020 : ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ టాప్ - విమర్శలు తిప్పికొట్టేందుకు దొరికింది ఛాన్స్
Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!
PAN Aadhaar Linking: నేడే ఈ పని చేయండి! లేదంటే రూ.1000 ఫైన్ కట్టండి!!
Shruthi Haasan: ఆ ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్, అయినా ధైర్యంగా ఉన్నానంటున్న నటి