By: ABP Desam | Updated at : 30 Sep 2021 06:22 PM (IST)
Image Credit: Mango Music/YouTube
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘కొండపొలం’ సినిమా నుంచి చిత్రయూనిట్ మరో సాంగ్ విడుదల చేశారు. ‘‘నీలో నాలో.. శ్వాసలో’’ అంటూ సాగే ఈ పాట వీనుల విందుగా సాగుతోంది. ఎం.ఎం. కిరవాణి అందించిన ఈ పాటను వినేకొద్ది వినాలనిపిస్తోంది. యామినీ ఘంటశాల, పీవీఎన్ఎస్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు కీరవాణే స్వయంగా లిరిక్స్ అందించడం గమనార్హం. మాంచి రొమాంటిక్ కలిగించే ఈ పాట యూత్‌కు తప్పకుండా నచ్చేస్తుంది. ఈ పాటను చూస్తుంటే.. క్రిష్ మాంచి విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మీరూ చూసేయండి మరి.
‘కొండపొలం’.. నీలో నాలో శ్వాసలో హద్దులని దాటాలని.. సాంగ్:
గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్ర పోషిస్తోంది. కోటా శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమా, ఆంటోనీ, రవి ప్రకాష్, మహేష్ విట్టా, రచ్చ రవి, ఆనంద్ విహారి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాలో బాలనటుడిగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’, ‘అందరివాడు’ సినిమాల్లో నటించాడు. 2020లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా ‘కొండపొలం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాదిలోనే మరో రెండు సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు. మూడో చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, బాలీవుడ్ బ్యూటీ శోభితా రానాలను హీరోయిన్లుగా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరో చిత్రం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు
Naga Panchami Today Episode మోక్ష కంటే ముందు తానే చనిపోవాలని నిర్ణయించుకున్న పంచమి!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Bigg Boss 7 Telugu: శోభాను కాలితో తన్నిన అమర్దీప్ - ఓట్లపై మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రియాంకతో వాదన
Bigg Boss 17: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం
Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
/body>