Rashmika: అండర్‌వేర్‌ను అలా చూసి అడ్డంగా బుక్కైన రష్మిక.. ఆ ప్రకటనపై నెటిజనులు ఆగ్రహం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికపై నెటిజన్లు మండిపడుతున్నారు, ఫెమినిస్టులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఛీ ఛీ ఇంతలా దిగజారిపోతావనుకోలేదని అంటున్నారు. అంత కోపం తెప్పించడం వెనుక రష్మిక ఏం చేసిందంటే..
'ఛలో' అంటూ వచ్చి భలే అతుక్కుపోయింది రష్మిక మందన్నా. వరుస అవకాశాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. అతి తక్కువ సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ‘ఛలో’,‘గీతగోవిందం’తో వరుస హిట్స్ అందుకున్న రష్మిక స్టార్ హీరోలకు ఫస్ట్ ప్రయార్టీగా మారింది. ఆ తర్వాత ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ తో అంతగా ఆకట్టుకోలేకపోయినా మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’తో హిట్టందుకుంది. త్వరలో 'పుష్ప' మూవీతో రానుంది. త్వరలోనే బాలీవుడ్‌లో సిద్దార్ మల్హోత్రా కి జంటగా 'మిషన్ మజ్ను' సినిమాలో నటించనుంది. అయితే రష్మిక ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ కారణంగా నెటిజన్ల, ఫెమినిస్టుల ఆగ్రహానికి గురైంది.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో ఓ అండర్ వేర్ యాడ్ చేసింది రష్మిక. ఈ యాడ్ చూసిన జనాలకు పెద్ద షాకే ఇచ్చింది రష్మిక. ఇలాంటి యాడ్ ఒప్పుకునేందుకు బుద్ధిలేదా అని కడిగి పడేస్తున్నారు ఆమె అభిమానులు. ఇంతకీ ఆ యాడ్ లో ఏముందంటే.. రష్మిక ఇందులో ఓ ఫిట్ నెస్ ట్రైనర్ గా కనిపించింది. ట్రైనింగ్ కి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ప్రముఖ బ్రాండెడ్ ఇన్నర్ వేర్ వేసుకొస్తాడు. రష్మిక అతడి అండర్ వేర్‌ను అదో రకంగా చూస్తుంది. నెంబర్లు లెక్క పెడుతోంది. ఇది కాస్త డబుల్ మీనింగ్‌లా అనిపిస్తుంది. దీనికి కొనసాగింపుగా ఆ మర్నాడు ఆ వ్యక్తికి అవసరమైన మ్యాట్‌ను పైన షెల్ప్‌లో పెడుతుంది. అది తీసుకునేందుకు చేతులు పైకి ఎత్తగానే మరోసారి ఆ ప్రముఖ బ్రాండెడ్ అండర్ వేర్ చూసి రష్మిక మొహంలో నవ్వు విరబూస్తుంది. చెప్పుకునేందుకే చాలా అసహ్యంగా ఉన్న ఈ యాడ్‌లో ఎలా నటించావంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అండర్ వేర్ చూసి అమ్మాయిలు పడిపోతారా? అని ప్రశ్నిస్తున్నారు.
సెంట్, పౌడర్, బనీన్, అండవ్ వేర్లకు అమ్మాయిలు పడిపోతారా? ఎప్పటికి మారతార్రా మీరు? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఏం క్రియోటివిటీనో ఏమో దయచేసి మరోసారి ఇలాంటి ప్రకటనల్లో నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా రష్మికకి పోస్టింగ్స్ పెడుతున్నారు అభిమానులు.
ఆ ప్రకటన వీడియో ఇక్కడ చూడండి:
Also Read: పెళ్లికాకుండానే తల్లైన సిరి హన్మంత్.. ఇదిగో బాబుతో ఉన్న ఫొటో..
Also Read:కత్తులతో ఫసక్.. సన్నీకి చుక్కలు చూపించిన హౌస్‌మేట్స్, కెప్టెన్ ఎవరంటే..