ఆమె పేరు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
Kadali Satyanarayana: తెలుగు రచయిత్రి, గేయ రచయిత కడలి సత్యనారాయణ పేరు బిగ్ బాస్ 10 తెలుగు ప్రాబబుల్స్ లిస్టులో వినిపిస్తుంది. ఆమె రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

- బిగ్ బాస్ 10లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తారని ప్రచారం.
Kadali Satyanarayana: తెలుగు సాహిత్యం, సినీ రంగానికి చెందిన యువ రచయిత్రి, గేయరచయిత కడలి సత్యనారాయణ (Kadali Satyanarayana). ఆమె ఈసారి బిగ్ బాస్ 10 తెలుగులో ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కడలి సత్యనారాయణ రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
రియల్ లైఫ్ & కెరీర్
కడలి రౌతు అలియాస్ కడలి సత్యనారాయణ తెలుగు రచయిత. చిన్నతనం నుంచే కడలికి రచనలపై ఆసక్తి పెరిగింది. 8-10 ఏళ్ల వయసు నుంచే చిన్నపిల్లల పత్రికలకు కవితలు రాస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉమెన్స్ స్టడీస్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేసిన ఈమె, ప్రముఖ సినీ గేయరచయిత కేకే శిష్యురాలిగా పాటల రచనలో శిక్షణ పొందారు. దాదాపు 100కు పైగా పాటలను స్వరపరిచి తెలుగు లిరిసిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
రాసిన పుస్తకాలు
పాటలే కాకుండా నవలలు, కథలు రాయడంలో కడలి సత్యనారాయణ సిద్ధహస్తురాలు. చిక్ లిట్ పుస్తకంతో పాఠకుల్లో విశేష ఆదరణ పొందారు. లెటర్స్ టు లవ్ పుస్తకం.. ప్రేమ, బంధాల నేపథ్యంతో రాసిన మరో ప్రాచుర్యం పొందిన పుస్తకం.
సోషల్ మీడియా
సోషల్ మీడియాలో కడలి తన స్వతంత్ర భావాలు, ఫెమినిజం, సామాజిక అంశాలపై బహిరంగంగా మాట్లాడతారు. "ఆడవాళ్లకు సొంత ఇల్లు ఉండదు" వంటి వ్యాఖ్యలతో పాటు మహిళల హక్కులు, మానసిక భావోద్వేగాలపై ఆమె చేసిన కామెంట్లు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
Also Read: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ఆసక్తికర విషయాలు
కడలి తండ్రి రవి, తల్లి ఇద్దరూ తెలుగు ఉపాధ్యాయులే. ఆమె తండ్రి కూడా రచయిత కావడం విశేషం. చూడటానికి మోడ్రన్ గా కనిపించినా, తెలుగు భాష, సాహిత్యం పట్ల ఎంతో మక్కువ చూపుతారు. కన్నీళ్లు బలహీనత కాదని, భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడమే నిజమైన బలమని ఆమె నమ్ముతారు.
Also Read: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బిగ్ బాస్ 10 ఎంట్రీ
ప్రస్తుతం బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' కంటెస్టెంట్ల లిస్టులో కడలి సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గ్లామర్ పరంగానే కాకుండా, బోల్డ్ కామెంట్స్, స్ట్రాంగ్ కాంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని నెట్టింట విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
Frequently Asked Questions
కడలి సత్యనారాయణ బిగ్ బాస్ 10 లో పాల్గొంటున్నారా?
ట్రెండింగ్ వార్తలు






















