పవన్ కల్యాణ్‌తో వన్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ ( Nidhi Agarwal Interview)
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నిధి అగర్వాల్ సక్సెస్ అందుకున్నారు. సంక్రాంతికి 'హీరో'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఇంటర్వ్యూ...
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'హీరో'. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మీడియాతో ముచ్చటించారు.
'హీరో' సినిమాలోకి మీరు ఎలా వచ్చారు?
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కథ వినమని పిలిచారు. కథ విన్నాను. డిఫరెంట్‌గా ఉంది. సాంగ్స్, ఫైట్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ... స్టోరీ డిఫరెంట్, ఆఫ్ బీట్ అని చెప్పవచ్చు. డార్క్ కామెడీ కూడా ఉంటుంది. చాలా టిస్టులు కూడా ఉంటాయి.
స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేస్తున్నారు. అశోక్ గల్లాకు హీరోగా ఇది మొదటి సినిమా. కొత్త హీరోతో చేయాలంటే ముందు ఆలోచించారా?
అలా ఏం లేదు. కథ బావుంది. నేను కూడా స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. మంచి కథలు, స్టార్ హీరోల సినిమాలు... అన్నీ చేయాలని అనుకుంటున్నాను. కొన్నిసార్లు మంచి క్యారెక్టర్ వస్తే మిస్ చేసుకోను.
'హీరో'లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
డాక్టర్ పాత్ర చేశా. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మరోసారి. అయితే... ఆ సినిమాతో కంపేర్ చేస్తే డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలో నా పేరు సుబ్బు. నా తండ్రి పాత్రలో జగపతిబాబు నటించారు. మా మధ్య సన్నివేశాలు బావుంటాయి. హీరో తండ్రి పాత్రలో నరేష్ గారు నటించారు. ఫ్యామిలీ డ్రామా, సిట్యువేషనల్ కామెడీ ఉంది.
Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్...
అశోక్ గల్లాతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్?
కొత్త హీరోతో నటిస్తున్నట్టు అనిపించలేదు. చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. అశోక్ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు. తొలి సినిమా చేయడం కష్టంగా ఉంటుంది. నాలుగేళ్ల క్రితం నేను కూడా తొలి సినిమా చేశా. అప్పుడు ఫీలింగ్స్ ఏంటో నాకు తెలుసు. అందుకని, అశోక్ కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేశా.
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది?
కొవిడ్... లాక్‌డౌన్... ఏం చేయాలి? షూటింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఏప్రిల్ నుంచి హిందీ సినిమా స్టార్ట్ అవుతుంది.
అశోక్ గల్లాకు నటనలో టిప్స్ ఇచ్చారా?
నటన పరంగా నేను ఎవరికీ టిప్స్ ఇవ్వను. ఎవరు ఎలా యాక్ట్ చేయాలో దర్శకుడు చెబుతారు. డాన్స్ పరంగా నేను హెల్ప్ చేశానని అశోక్ చెబుతున్నాడు. సెట్ సాంగులో చిన్న చిన్న స్టెప్స్ గురించి చెప్పాను.
'ఇస్మార్ట్ శంకర్'లో మీరు డాక్టర్. అది హిట్. 'హీరో'లోనూ డాక్టర్. సెంటిమెంట్ పరంగా శ్రీరామ్ ఆదిత్య మిమ్మల్ని సంప్రదించారా?
(నవ్వుతూ) తెలియదు. యాక్చువల్లీ... ఇంకో సినిమాలో కూడా డాక్టర్ రోల్ చేస్తున్నాను. అది తమిళ సినిమా. 'హీరో' సినిమా హిట్ తర్వాత సెంటిమెంటా? కాదా? అనేది తెలుస్తుంది.
'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ తర్వాత ఇటువంటి సినిమా చేయడం రైట్ అనుకున్నారా? ప్రయోగం చేయడం?
నేను అంత ఆలోచించను. ఫ్లోలో అలా వెళతా. 'హీరో' సినిమాకు సంతకం చేసిన తర్వాతే నాకు పవన్ కల్యాణ్ సినిమా వచ్చింది. చక్కగా నటించాలి, హార్డ్ వర్క్ చేయాలి, అందరితో మంచిగా ఉండాలని మాత్రమే చూస్తా. స్టార్ హీరో సినిమా చేస్తున్నామా? కొత్త హీరోతో చేస్తున్నామా? అనేది మేటర్ కాదు. నేను కొత్త హీరోతో సినిమా చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ సినిమా కూడా చేశా. దర్శకుడికి మనపై ఎంత నమ్మకం ఉందనేది ముఖ్యం.
హిందీలో, తమిళంలో, తెలుగులో చేస్తున్నారు. మూడు ఇండస్ట్రీల మధ్య డిఫరెన్స్ ఉందా?
తెలుగు ఇండస్ట్రీ కంఫర్టబుల్. నాకు తెలుసు ప్రేక్షకులు ఎంతో ప్రేమ ఇచ్చారు. ఇంకొకటి... నేను హైదరాబాద్ లో జన్మించాను. తెలుగుతో అదొక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మూడు ఇండస్ట్రీల మధ్య డిఫరెన్స్ ఏమీ లేదు.
నిధి అగర్వాల్ కమర్షియల్, గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర పడింది. ప్రస్తుతం హీరోయిన్లు నేచురల్, డిఫరెంట్ ఫిలిమ్స్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో... మీరు ఏ డైరెక్షన్‌లో వెళ్లాలని అనుకుంటున్నారు?
గ్లామరస్ హీరోయిన్ ముద్ర అనేది కొన్నిసార్లు నచ్చుతుంది. కొన్నిసార్లు నచ్చదు. గ్లామరస్ అనే పదానికి నేను ఇచ్చే నిర్వచనం వేరు. కొంతమంది ఇచ్చే నిర్వచనం వేరు. నన్ను ఎందుకు గ్లామరస్ అంటున్నారని ఆలోచించాను. 'అది ప్లస్ పాయింటే. బ్యాడ్ ఏమీ కాదు. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్' అని ఒకరు చెప్పారు. గ్లామరస్ అంటే నాకు ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇప్పుడు తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో మేకప్ ఏమీ లేదు. తెలుగు దర్శకులు ఆ సినిమా చూసి నాకు అటువంటి రోల్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే... నేను యాక్టర్ మాత్రమే. దర్శకులు అవకాశం ఇస్తేనే నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను.
డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
యాక్షన్ రోల్ చేయాలని ఉంది. నేను యాక్షన్ లో ట్రయినింగ్ కూడా తీసుకున్నాను.
ఏయే హీరోలతో నటించాలని ఉంది?
నాది చాలా పెద్ద లిస్ట్. ఇండస్ట్రీలో అందరితో నటించాలని ఉంది. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్... అందరూ గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు. కొత్త హీరోలు కూడా బాగా చేస్తున్నారు. కరెక్టుగా చెప్పాలంటే... పవన్ కల్యాణ్‌తో మరో సినిమా చేయాలనుంది.
Also Read: ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బాలకృష్ణ కుమార్తె ఫస్ట్ స్టెప్... 'అన్‌స్టాపబుల్' సక్సెస్ స్టెప్
Also Read: టిక్కెట్ల ఇష్యూలో " బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?
Also Read: పీరియడ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్
Also Read: ఆమె ఆవేదన అక్షర రూపంలో... అయిదేళ్ల మౌనం తరువాత తొలిసారి స్పందించిన భావన
Also Read: 'జబర్దస్త్' నుంచి అభి అవుట్... 'హైపర్' ఆది కామెంట్!
Also Read: నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అన్నీ చేశాకే ఇక్కడొచ్చి కూర్చున్నాం.. అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది!
Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి