BiggBoss5 Promo: బంగార్రాజులా ముస్తాబైన నాగ్, హెబ్బా డ్యాన్సు, పూజా-అఖిల్ ఎంట్రీ, అదిరిపోయిన దసరా స్పెషల్ ప్రోమో
బిగ్ బాస్ హౌస్ లో కు దసరా కల వచ్చేసింది. హౌస్ మీట్స్ సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై ఎంటర్టైన్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నారు.
దసరా ముందు ఆదివారం కావడంతో బిగ్ బాస్ హౌస్ పండుగ ఎపిసోడ్ కోసం ముస్తాబైపోయింది. గొడవలు, పంచాయతీలు, తీర్పులు, తిట్టుకోవడాలు అన్నీ పక్కన పెట్టి... ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ వాతావరణమే కనిపించింది ఇంట్లో. తాజా ప్రోమోను చూస్తుంటే ఆదివారం ఎపిసోడ్ ప్రేక్షకులకు నచ్చేలా కనిపిస్తోంది. నాగార్జున పంచెకట్టుతో బంగార్రాజులా ముస్తాబై వచ్చారు వేదిక మీదకి. కొంత మంది తారలను కూడా తీసుకొచ్చి డ్యాన్సులతో అదరగొట్టించారు. నేటి ప్రోమోలో ఏముందో ఓసారి చూస్తే...
మంగ్లీ మంచి పాటతో వేదికను ఒక ఊపు ఊపేసింది. ఆ పాటకు చిందేయ్యాలనిపిస్తుంది ఎవరికైనా. జబర్దస్ట్ ఆది ఈసారి పోలీస్ గెటప్ లో వచ్చాడు. షన్ను, సిరి, జెస్సీ గ్రూపుపై పంచ్ లేశాడు. వారిని త్రిమూర్తులుగా పిలిచాడు. ఇక హమీద-శ్రీరామ్ లకు గట్టి పంచే పడింది. ‘మీ ఇద్దరి మీద బయట ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు... హమీద వాకిట్లో శ్రీరామ్ చెట్టు’ అనగానే హౌస్ అంతా నవ్వులే నవ్వులు. హమీద, శ్రీరామ్ మాత్రం కాస్త సిగ్గుపడ్డారు. కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ చాలా రోజుల తరువాత మళ్లీ బుల్లి తెరపై కనిపించింది. డిచిక డిచిక డింక పాటకు చిందులేసింది. ఆమె డ్యాన్సును ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేలా ఉంది.
ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోహీరోయిన్లు పూజా, అఖిల్ ప్రత్యేక అతిధులుగా వచ్చారు. ప్రోమోలో అఖిల్ ఎక్కడా మాట్లాడినట్టు కనిపించలేదు. పూజా మాత్రం ఫుల్ జోష్ మీద కనిపించింది. మొత్తమ్మీద ఆదివారం ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంది.
#Navarathri special celebrations with King @iamnagarjuna ..We all will totally enjoy this many special attractions!#BiggBossTelugu5 today at 6 PM on #StarMaa #FiveMuchFun @AkhilAkkineni8 @hegdepooja @iamMangli #HyperAadi pic.twitter.com/W40ebtpTp2
— starmaa (@StarMaa) October 10, 2021
Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం
Also read: జాకీ భగ్నానీతో రకుల్ పెళ్లి? ఇన్ స్టా పోస్ట్ వైరల్
Also read: ధనవంతుడిగా ఎదగాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...
Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి