అన్వేషించండి

Fasting: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం

పూజా పునస్కారాల్లో ఉపవాస దీక్ష సర్వసాధారణం. అయితే ఉపవాసం చేసేప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

దేవీ నవరాత్రులైన, నోములైనా, వ్రతాలైనా చాలా మందికి ఉపవాసం చేసే అలవాటు ఉంది. హిందూ సాంప్రదాయంలో ఉపవాసానికి ఓ పరమార్థం ఉంది. కానీ చాలా మందికి ఉపవాసం అంటే ఏమీ తినకపోవడం అని మాత్రమే తెలుసు. దీక్ష ముగిశాక పొట్టనిండా తినేస్తారు. నిజానికి ఉపవాసం ఉండేవాళ్లు కొన్ని ఆరోగ్యనిమయాలు పాటించాలి. లేదంటే అనారోగ్య బారిన పడేఅవకాశం ఉంది. ఉపవాసం చేసేటప్పులు ఏం చేయాలో; ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం...

నెలకో రోజు మంచిదే...
 ఉపవాసం కేవలం దైవారాధనకే కాదు, ఆరోగ్య రీత్యా కూడా మంచిదే. అప్పుడప్పుడు ఇలా ఏమీ తినకుండా కొంతసేపు ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. కాబట్టి నెలలో ఒక రోజు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తే చాలా మంచిది. 

నిర్జలోపవాసం వద్దు
ఉపవాసాల్లో నిర్జలోపవాసం ఒకటి. అంటే కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. ఆహారం కొన్ని గంటల పాటూ తీసుకోకపోయినా ఫర్వాలేదు కానీ, నీరు తాగకపోతే ప్రధాన అవయవాలకు చాలా ప్రమాదం. శరీరానికి గాలి తరువాత అత్యవసరమైనది నీరు. శరీరంలోని వ్యర్థాలు బయటికి పోవాలన్నా నీటితోనే సాధ్యం. 

ఉత్త నీళ్లే కాదు...
కొంతమంది ఉదయం నుంచి రాత్రి పొద్దు పొడిచే వరకు ఉపవాస దీక్షలో ఉంటారు. కేవలం నీటితోనే గడిపేవారు కూడా ఉంటారు. ఇలా అధిక సమయం నీరు ఒక్కటే తాగుతూ ఉండకూడదు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ఓసారి, తేనే ఓసారి ఇలా కలుపుకుని తాగొచ్చు. మధ్యలో గ్లూకోజ్ కూడా తాగితే మంచిదే. ఇలా చేయడం వల్ల వ్యర్థాలు బయటికి  పోవడమే కాకుండా, అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. 

బీపీ, షుగర్ ఉన్న వాళ్లు...
భక్తి గుండెల్లో ఉన్నా చాలు ఆ దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. హైబీపీ, మధుమేహం ఉన్నవాళ్లు అధిక సమయాల పాటూ ఉపవాస దీక్షలు చేపట్టడం మంచిది. ఒక వేళ తప్పదను కుంటే వైద్యుల సలహాలు తప్పకుండా తీసుకోండి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం,తేనె కలుపుకుని తాగొచ్చు. ఎందుకంటే తేనెలో ఉండే తీసి ఒకేసారి రక్తంలో చేసి షుగర్ స్థాయులను పెంచదు. కొంచెంకొంచెంగా శక్తినిస్తుంది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?

Also read:  గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...

Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Sports Year Ender 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న మహిళల జట్టు
ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న మహిళల జట్టు
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Embed widget