Pickles Health Benefits: నిల్వ పచ్చళ్లు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
కొన్ని రకాల తీవ్రమైన వ్యాధులను అరికట్టేందుకు పులియబెట్టిన పెరుగు, ఊరగాయలు చక్కగా పనిచేస్తాయని తేల్చింది ఓ కొత్త అధ్యయనం.
![Pickles Health Benefits: నిల్వ పచ్చళ్లు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది? Eating yoghurt and pickles daily can prevent serious diseases Pickles Health Benefits: నిల్వ పచ్చళ్లు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/dbc15652b721879ecfabe91a8aa3afd6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు కనిపించని తెలుగిళ్లను కనిపెట్టడం కష్టమే. అంతగా మన ఆహారంలో భాగం అయిపోయాయి ఈ వంటకాలు. అయితే వాటిని ఎక్కువగా తినేది మహిళలే. పురుషులు ఆవకాయలు, పచ్చళ్ల జోలికి ఎక్కువగా పోరు. కానీ కొత్త అధ్యయనం ప్రకారం ఎవరైతే రోజు కాస్త నిల్వ పచ్చడి, లేదా ఊరగాయ, పెరుగు తింటారో వాళ్లు... డయాబెటిస్, ఆర్డరైటిస్ (మోకాళ్ల నొప్పులు) వంటి వ్యాధుల బారిన తక్కువగా పడతారు. కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ రోజుకు రెండు ముద్దలైన నిల్వ పచ్చడి లేదా ఊరగాయతో తినమని చెబుతున్నారు అధ్యయనకర్తలు. అలాగే చివర్లో పెరుగుతో భోజనం ముగించమని సలహా ఇస్తున్నారు. పెరుగు కూడా డయాబెటిస్, ఆర్ధరైటిస్ వంటివి అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
స్టాన్ ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం పులియబెట్టిన ఆహారాలలో పేగులకు అవసరమైన మంచి బ్యాక్టిరియా లభిస్తుంది. దీని వల్ల పొట్టలో వాపు లాంటి లక్షణాలు రాకుండా నిరోధిస్తుంది. క్లినికల్ ట్రయల్ లో భాగంగా 36 మంది ఆరోగ్యవంతులైన వారిని ఎంపిక చేసుకున్నారు అధ్యయనకర్తలు. వారికి పది వారాల పాటూ అధిక ఫైబర్ ఉన్న ఆహారాలతో పాటూ ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు, పెరుగు తినిపించారు. ఆ తరువాత వారిపై పరిశోధన చేయగా పేగులోని మంచి బ్యాక్టిరియా, రోగనిరోధక వ్యవస్థలలో చాలా మంచి మార్పులు గమనించారు. అంతేకాదు మంచి బ్యాక్టిరియాలలో మరిన్ని వైవిధ్యమైన సూక్ష్మజీవులు పేగులలో చేరాయి. ఇవన్నీ పేగుల ఆరోగ్యాన్ని కాపాడేవే.
అలాగే నాలుగు రకాల రోగనిరోధక కణాలు కూడా నిల్వ పచ్చళ్లు, ఊరగాయలు, పెరుగు వంటి వాటిలో క్రియాశీలకంగా మారాయి. రక్తంలో ఇన్ ఫ్లమ్మేటరీ ప్రోటీన్ల స్థాయులు కూడా తగ్గాయి. ఈ ప్రోటీన్లలో ఒకరకం, రుమటాయిడ్ ఆర్ధరైటిస్, టైప్ 12 డయాబెటిస్, ఒత్తిడి... వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులో ముడిపడి ఉంది. ఈ సమస్యలు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్టు తేలింది. అలాగే మంచి బ్యాక్టిరియా వల్ల ఊబకాయం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. రోజూ పెరుగు, నిల్వ పచ్చళ్లు తినేవారిలో ఈ మంచి బ్యాక్టిరియాలో వైవిధ్యం అధికమవుతుంది. ఇది ఆరోగ్యానికిన చాలా మేలు చేస్తుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: సెప్సిస్ గురించి విన్నారా? పైకి కనిపించకుండా ప్రాణాలు తీసేస్తుంది...
Also read: బాయ్ ఫ్రెండ్ కు అందంగా కనిపించాలనుకుంది... చివరకు ఆసుపత్రి పాలైంది
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)