New Study: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...

బబుల్స్ పేల్చడం చాలా మందికి ఇష్టం. కనిపిస్తే వాటిని పట్ పట్ మంటూ పేలుస్తూనే ఉంటారు.

FOLLOW US: 

ఫోన్లు, ఐపాడ్ లు, గాజుతో చేసిన వస్తువులు... ఇలా ఏవి కొన్నా వాటి చుట్టూ బబుల్ ర్యాపర్స్ చుట్టి ఇస్తున్నారు. గాలి నిండిన ఈ బబుల్స్, ఆ ప్యాకెట్ కిందపడినా వస్తువుకు ఎలాంటి డామేజ్ కాకుండా కాపాడతాయి. ఆ బబుల్ ర్యాపర్లను పిల్లలూ, పెద్దలూ ఇద్దరూ పాప్ చేస్తూనే ఉంటారు. అవి చాలా మందికి వ్యసనంలా మారిపోయింది. ఎదురుగా బబుల్ ర్యాపర్ కనిపిస్తుంటే దాన్ని పేల్చకుండా ఉండలేని వాళ్లే ఎక్కువమంది. అలా అది వ్యసనంలా ఎందుకు మారిందో ఓ అధ్యయనం తేల్చి చెప్పింది.  ప్రతి మనిషిలో కనిపించని భయం, ఒత్తిడి ఉంటాయని ఇలాంటి గాలి బుడగలు చేతికి రాగానే వాటిని పేల్చి రిలీఫ్ పొందుతారని చెబుతోంది కొత్త పరిశోధన. ఇలాంటి మెత్తని గాలి నిండిన వస్తవులు చేతిలో ఉన్నప్పుడు గట్టిగా నొక్కకుండా మనల్ని మనం నియంత్రించుకోలేమని చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఈ పరిశోధనను అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన సీల్డ్ ఎయిర్ కార్పొరేషన్ వారు నిర్వహించారు. 

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా గాలిబుడగలను పేల్చడం వల్ల మనిషిలోని ఒత్తిడి బయటికి పోతుంది. ఇలా బుడగలు పేల్చే వ్యక్తులు ఇతరులకన్నా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ బుడగలు పేల్చడం వల్ల మనిషి  దృష్టి ఒకే అంశంపై ఉంటుంది, దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. బుడగలు పేల్చేటప్పుడు బొటనవేలు, చూపుడు వేలు కలుస్తాయి. ఆ రెండు వేళ్ల కలయిక మంచి ధ్యాన సాధనంగా ఉపయోగపడుతుందని పరిశోధన పేర్కొంది. ఒక నిమిషం పాటూ ఇలా గాలిబుడగలను పేలుస్తుంటే మనిషిలోని ఒత్తిడి 33 శాతం తగ్గిపోతుందని అధ్యయనం తేల్చింది. ఇది మంచి సైకో థెరపిక్ విధానమని చెప్పింది. కాబట్టి బబుల్ ర్యాప్ కనిపిస్తే వదలకుండా పేల్చేయండి. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: భవిష్యత్తులో కరోనా కూడా జలుబులా మారిపోతుంది... ఇంగ్లాండు శాస్త్రవేత్తలు

Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?

Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం

Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Oct 2021 04:00 PM (IST) Tags: Facts bubble wraps bubble wraps facts bursting bubble wraps facts and study Research science

సంబంధిత కథనాలు

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం