News
News
వీడియోలు ఆటలు
X

Fat Burning: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...

ప్రపంచంలో సగం మంది సమస్య బరువు పెరగడం. దాన్ని తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన పద్ధతులు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

FOLLOW US: 
Share:

నిజానికి శరీరంలో చేరే కొలెస్ట్రాల్ మొత్తం చెడ్డది కాదు. అందులో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంది. అది మన శరీరానికి అవసరం కూడా. అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతేనే బరువు పెరగడం అనే సమస్య మొదలవుతుంది. సర్జరీలు చేయించుకోవడం, జిమ్ లో అధికసమయాలు గడపడం కన్నా... జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా బరువు పెరగకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. 

1. బరువు పెరగకుండా కాపాడుకోవడానికి, పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేపలు సహకరిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రక్తంలో హానికర ట్రైగ్లిజరైడ్లను చేరకుండా అడ్డుకుంటాయి. కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలోని కొవ్వులోనే ఉంటాయి. కనుక కొవ్వు పట్టిన సాల్మన్, సార్ డైన్, టూనా వంటి చేపలు తినడం మంచిది. కాకపోతే వీటిని కూరగా వండుకునే తినాలి కానీ, నూనెలో వేయించుకుంటే మాత్రం బరువు పెరుగుతారు. 

2. చిప్స్, చాక్లెట్లు, బజ్జీలు, బోండాలు, మిర్చిబజ్జీలు వంటి చిరు తిళ్లు బరువు పెంచడానికి ప్రయత్నిస్తాయి. కనుక వీటిని దూరం పెట్టాలి. ఇలాంటి చిరుతిళ్లకు బదులుగా బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ఓ గుప్పెడు తింటే చాలు. వీటిలో కూడా కొవ్వును తగ్గించే గుణాలు ఎక్కువ. కాకపోతే అధికంగా తింటే మాత్రం కొవ్వు పట్టేస్తుంది. వీటి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. 

3. బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో దోశెలు, పూరీలు, బోండాలు తినడం మానేస్తే అధిక బరువు సమస్య ఎదురుకాదు. బ్రౌన్ రైస్, జొన్నలు, ఓట్స్, సజ్జలు వంటి చిరు ధాన్యాలతో చేసిన వంటకాలు తింటే త్వరగా ఆకలి వేయదు. కాబట్టి అధికంగా తినే అవకాశం ఉండదు, తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

4. ఏమి తిన్నా కూడా బరువు తగ్గడానికి ఎక్కువ సాయం చేసేది వ్యాయామం. తినేసి కూర్చుంటే ఎవరైనా బరువు పెరుగుతారు. రోజులో ఒక గంట పాటూ వేగంగా నడక అలవాటు చేసుకుంటే మంచిది. దీని వల్ల పక్షవాతం, గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. 

5. ఒత్తిడి... ఆధునిక కాలంలో ఎక్కువమంది ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తున్న మహమ్మారి ఇది. అధిక ఒత్తిడి బరువు పెరిగేందుకు కూడా సహకరిస్తుంది. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ శాతం కూడా ఎక్కువ కావచ్చు. అందుకే ధ్యానం, యోగా లాంటి వాటితో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: బొప్పాయి వల్ల నిజంగానే గర్భం పోతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

Also read:  చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి

Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Oct 2021 09:34 AM (IST) Tags: Healthy life Lose Belly fat Fat burning Healthier Life

సంబంధిత కథనాలు

ఈ వేసవి డయాబెటిస్ బాధితులకు డేంజరే - ఈ సూచనలు పాటిస్తే సేఫ్!

ఈ వేసవి డయాబెటిస్ బాధితులకు డేంజరే - ఈ సూచనలు పాటిస్తే సేఫ్!

Hypothyroidism: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? వీటిని తింటే మేలు

Hypothyroidism: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? వీటిని తింటే మేలు

SugarCane Juice: పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

SugarCane Juice: పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Blood Circulation: ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో రక్త సరఫరా సరిగా జరగడం లేదని అర్థం

Blood Circulation: ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో రక్త సరఫరా సరిగా జరగడం లేదని అర్థం

Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు

Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు

టాప్ స్టోరీస్

KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్

KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్

New Parliament Inauguration Live: కాసేపట్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం, పాల్గోనున్న 25 పార్టీలు, బహిష్కరించిన 21 పార్టీలు

New Parliament Inauguration Live: కాసేపట్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం, పాల్గోనున్న 25 పార్టీలు, బహిష్కరించిన 21 పార్టీలు

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు