News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Rakul Preet Marriage: త్వరలో రకుల్ పెళ్లి? వరుడు ఎవరో తెలుసా! ఇన్‌స్టా పోస్ట్ వైరల్

రకుల్ ప్రీత్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా? ఆమె ఇన్ స్టా పోస్టు చూస్తుంటే అదే అర్థమవుతోంది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది రకుల్. తాజాగా కొండపొలం సినిమా హిట్ టాక్, అందులో ఆమె ఓబులమ్మగా అందరికీ తెగ నచ్చేసింది. ఇప్పుడు రకుల్ మరో శుభవార్తను చెప్పకనే చెప్పింది. తన ప్రియుడితో కలిసున్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ పోస్టును బట్టి ఆమె త్వరలోనే ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేయబోతున్నట్టు అర్థమవుతోంది.  జాకీ భగ్నానీ అనే నటుడితో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారని సమాచారం. రకుల్ తన 31 పుట్టినరోజు సందర్భంగా ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

రకుల్ తన పోస్టులో ‘నా జీవితానికి ఎన్నో రంగులను జతచేశావు. ఈ ఏడాదిలో నాకు లభించిన అతి పెద్ద బహుమతి నీవే. ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటావు. మనమిద్దరం మరిన్ని మధురానుభూతులను మూటగట్టుకుందాం’ అంటూ అందమైన క్యాప్షన్ ను ఫోటోకు జతచేసింది. ఆ ఫోటోలో రకుల్, జాకీ ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నడుస్తున్నారు. క్యాప్షన్ నిండా లవ్ సింబల్స్ తో నింపేసింది రకుల్. జాకీ కూడా అదే ఫోటోను తన ఇన్ స్టాలో పోస్టు చేసి ‘నువ్వు లేకుండా రోజులు గడవవు, ఎంత రుచికరమైన ఆహారమైన తినాలనిపించదు. నేను ప్రపంచంగా భావించే అందమైన మనసుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వీరికి ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్ వంటి సెలెబ్రిటీలతో ఎమోజీలతో శుభాకాంక్షలు తెలిపారు. 

ఎవరీ జాకీ భగ్నానీ?
ఇతను బాలీవుడ్ నటుడు, నిర్మాత. ఈయన కోల్‌కతాలోని సింధీ కుటుంబంలో జన్మించారు. పూజా ఎంటర్టైన్‌‌మెంట్స్ పేరు మీద అతని తండ్రి వషు భగ్నానీ సినిమాలు నిర్మిస్తారు. 2009లో ఓ హిందీ సినిమాలో తెరంగేట్రం చేశాడు. సైడ్ క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపిస్తాడు. 2016లో సరబ్జిత్ సినిమాతో నిర్మాతగా మారాడు. ఇందులో ఐశ్వర్యరాయ్, రణ్ దీప్ హుడా కీలక పాత్రల్లో నటించారు. ఇది తప్ప ఇతని కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. కాగా త్వరలో జాకీ నిర్మాణంలో రకుల్ ఓ సినిమాలో నటించనుంది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Rakul Singh (@rakulpreet)

Published at : 10 Oct 2021 02:36 PM (IST) Tags: rakul preet singh Jackkybhagnani Kondapolam Heroine Rakul love Marriage

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: సిరిసిల్లలో కేటీఆర్ వెనుకంజ - కాంగ్రెస్ ఆధిక్యం

Telangana Election Results 2023 LIVE: సిరిసిల్లలో కేటీఆర్ వెనుకంజ  - కాంగ్రెస్ ఆధిక్యం

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?

DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!

DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
×