అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Naga Chaitanya: అఖిల్ కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఈవెంట్ లో చైతు..
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.
అక్కినేని అఖిల్-పూజాహెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీనికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా వచ్చారు. స్టేజ్ పై అన్నదమ్ములిద్దరూ మాట్లాడడం అక్కినేని ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ముందుగా అఖిల్ మాట్లాడారు.
గత వైభవాన్ని మళ్లీ చూస్తాం..
రెండున్నరేళ్లు అయిపోయింది ఇలాంటి ఫంక్షన్ చేసుకొని అని స్పీచ్ మొదలుపెట్టిన అఖిల్.. తన డైరెక్టర్ ని తెగ పొగిడేశారు. ఆయన సినిమాలు చూసి చూసి ఆయన రైటింగ్ పై ఇష్టం ఏర్పడింది.. ఒక సీన్ ని ఎలా తీయాలని ఆయన మైండ్ లో యుద్ధాలు జరుగుతుంటాయని 'బొమ్మరిల్లు' భాస్కర్ ని ఉద్దేశిస్తూ చెప్పారు. ఆ తరువాత థియేటర్ కోసమే సినిమాలు తీస్తామని.. ఓటీటీలపై రెస్పెక్ట్ ఉంది కానీ థియేటర్ల కోసమే సినిమాలు చేస్తామని నొక్కి చెప్పారు అఖిల్. అక్కినేని ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. 'మీరిచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునే వరకు నేను నిద్రపోను' అని కామెంట్ చేశారు. కోవిడ్ కారణంగా అందరూ చాలా ఇబ్బంది పడ్డారని..
గత వైభవాన్ని మళ్లీ చూస్తామని చెప్పుకొచ్చారు.
గత వైభవాన్ని మళ్లీ చూస్తామని చెప్పుకొచ్చారు.
అఖిల్ కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది..
గెస్ట్ గా వచ్చిన నాగచైతన్య సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. సినిమా నిర్మాత అల్లు అరవింద్ గారికి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉన్నప్పటికీ.. థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఎదురుచూశారని చెప్పుకొచ్చారు. దర్శకుడు భాస్కర్ హ్యూమన్ ఎమోషన్స్ కి బాగా చూపిస్తాడని అన్నారు. ఇక తన తమ్ముడు గురించి మాట్లాడుతూ.. 'అఖిల్ ఒక సినిమా రిజల్ట్ కంటే దానికి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ ని ఎక్కువ ప్రేమిస్తాడు..' అని చెప్పారు. నెక్స్ట్ ఐదారేళ్లలో ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో అతడికి ఒక మాస్టర్ ప్లాన్ ఉందని అన్నారు. అఖిల్ ని చూస్తుంటే ఇప్పటికీ.. 'సిసింద్రీ'లో పాక్కొని వస్తున్నట్లే గుర్తుందని చెప్పారు. ఒక సినిమా కోసం చాలా డేడికేటెడ్ గా పని చేస్తాడని.. అఖిల్ పై తన ప్రేమని కురిపించారు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement