X

MAA Elections: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!

‘మా’ అంటే తల్లి. ‘మా’ సభ్యులంటే ఆ తల్లి బిడ్డలు. మరి, వారిలో వారే ఇలా కొట్టుకుంటే.. ఆ తల్లి మనసు గాయపడదా? ఈ విషయం మన మహానటులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?

FOLLOW US: 

న్న బిడ్డలు కొట్టుకుంటే.. కడుపుకోత తల్లికే. కళామతల్లికే ప్రాణం ఉంటే.. టాలీవుడ్‌లో ఉన్న ఇప్పటి పరిస్థితిని చూసి తప్పకుండా కన్నీరు పెట్టుకుంటుంది. ‘మా’ బిడ్డల పోరు చూసి.. సిగ్గుపడుతుంది. ‘మా’ ఎన్నికల ప్రకటన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే.. తెలుగు ప్రేక్షకుడికి సైతం వెగటు పుడుతోంది. ఆయా ప్యానెల్ సభ్యుల పరస్పర ఆరోపణలు వింటుంటే.. ఆదిపత్యం కోసం అంత పైత్యమేలా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. 


ఇంటిగుట్టు బయటకు వెళ్తే.. నలుగురు నానారకాలుగా అనుకుంటారనే విచక్షణ మరిచిన మహానటులు.. ‘మా’కు మచ్చపడకుండా చూస్తామంటున్నారు. వాస్తవం ఏమిటంటే.. వీరు ఎప్పుడైతే రచ్చ మొదలుపెట్టి రోడ్డున పడ్డారో అప్పుడే ‘మా’ చరిత్ర మసకబారింది. ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అర్థమే మారిపోయింది. ఇప్పుడు ‘మా’ ఎన్నికలంటే.. వర్గపోరు. మీడియా కడుపు నింపే ‘వినోద’ క్రీడ. 


టాలీవుడ్ అంటే.. పొరుగు రాష్ట్రాలకు ఇన్నాళ్లూ మంచి ఉద్దేశం ఉంది. కానీ, ఈ వర్గపోరుతో ఇప్పుడు పరువు మొత్తం పోయింది. టాలీవుడ్‌లో ప్రాంతీయ విభేదాలు ఉన్నాయని ఒకరు వెక్కరిస్తుంటే.. వారిలో వారికే పడదంటూ మరొకరు హేళనగా చూస్తున్నారు. తమిళంలో మూడువేలకు పైగా సభ్యులున్న నడిగర్ సంఘంలో స్పర్థలు వచ్చాయంటే ఒక అర్థముంది. పట్టుమని వెయ్యి సభ్యులు కూడా లేని ‘మా’లో ఈ పోరాటమేలా? రాజకీయాలేలా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. బాధ్యతగా మెలగాల్సిన మీడియా కూడా స్టూడియోలకు పిలిచి మరీ పుల్లలు పెడుతుంటే.. ఆ మహానటులు మరింత రెచ్చిపోయి.. తన సోదర సమానులైన తోటి కళాకారులనే తిట్టుకుంటూ వారి టీఆర్పీలకు ఇంధనం పొస్తున్నారు. 


Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం: ప్రకాష్ రాజ్


‘మా’లో పోట్లాటలు కొత్తకాదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, అది ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్యే ఉండేది. పెద్దరికంతో హూందాగా ఉండేవి. ఎప్పుడైతే పోటీ అభ్యర్థులు.. విలేకరుల సమావేశాలు పెట్టి ఆరోపణలు చేశారో అప్పుడే పరువు మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. కళామతల్లి బిడ్డలు కొట్టుకుంటున్నారు చూడండని బుల్లితెరలు.. వెండితెర గౌరవాన్ని మొత్తం బజారుకు ఈడ్చాయి. ‘‘సేవ చేయాలనే తపన ఉంటే గెలవాలనే ప్రయత్నం చేయాలేగానీ.. పక్కోడిని తొక్కేసే ఆరోపణలు చేయకూడదు’’ అనే డైలాగులను వారికి ఎవరూ రాసివ్వలేదో ఏమో.. వీరు బొత్తిగా గతి తప్పి మరీ మతి తప్పినవారిలా ప్రవర్తిస్తున్నారు. 


Also Read: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. నా కుటుంబాన్ని లాగితే మర్యాదగా ఉండదు: విష్ణు వార్నింగ్


ఓ కళామతల్లి బిడ్డ చెప్పినట్లు.. ‘చెడును చెవిలో చెప్పుకోవాలి.. మంచిని మైకులో చెప్పుకోవాలి’ అనే మాటను పూర్తిగా విస్మరించి విమర్శలు చేసుకుంటున్నారు. పంతం పట్టి మరీ తమ పరువును తామే తీసుకుంటున్నారు. కళాకారులారా మిమ్మల్ని కోట్లాది కళ్లు విప్పరించి చూస్తున్నాయ్.. ఇప్పటికైనా కళ్లు తెరిచి కళామతల్లి కన్నీటిని తుడవండి. సాయం కోసం చూస్తున్న ఆ పేద కళాకారుల కడుపు నింపి పుణ్యం కట్టుకోండి. మీ ఈగోల కోసం.. మేమెంతో ప్రేమించే ‘మా’ తెలుగు సినీ పరిశ్రమ పరువును తీయకండి. మీ గొడవలు చూస్తుంటే సిని‘మా’ అభిమానుల గుండె బరువెక్కుతోంది. మిమ్మల్ని.. సినిమాల్లో మాత్రమే హీరో-విలన్లుగా చూడాలని అనుకుంటాం. నిజజీవితంలో అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటే ఆనందిస్తాం. మార్పు కోసం వస్తున్నామని చెబుతున్న మీరే ముందుగా మారండి. మౌనంగా ‘మా’ మనసులు గెలుచుకోండి. 


- ఇట్లు.. మీ తెలుగు సినిమా అభిమానులు 


Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Manchu Vishnu Maa elections Prakash raj Maa Elections 2021 మా ఎన్నికలు 2021 మా ఎన్నికలు మంచు విష్ణు ప్రకాష్ రాజ్ MAA Elections Fight

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Annaatthe trailer: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..

Annaatthe trailer: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..

Aryan Khan Bail Hearing: ఆర్యన్ ఖాన్‌కు మరో 'సారీ'.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Aryan Khan Bail Hearing: ఆర్యన్ ఖాన్‌కు మరో 'సారీ'.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Bigg Boss 5 Telugu: సన్నీ వర్సెస్ కాజల్.. ఎవరు గెలుస్తారో..?

Bigg Boss 5 Telugu: సన్నీ వర్సెస్ కాజల్.. ఎవరు గెలుస్తారో..?

Balakrishna 'Unstoppable': 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య ప్రోమో.. అదిరిపోయిందంతే..

Balakrishna 'Unstoppable': 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య ప్రోమో.. అదిరిపోయిందంతే..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..