By: ABP Desam | Updated at : 04 Oct 2021 06:57 PM (IST)
ప్రకాష్ రాజ్ ప్యానెల్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్‌లో వాడీవేడి వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నటుడు నరేష్, మంచి విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను తెలుగువాడిని కాదని అంటున్నారు. నేను తెలుగు మాట్లాడినంతగా మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరూ మాట్లాడలేరు. నన్ను పెంచింది తెలుగు తెలుగు తల్లి, తెలుగు భాష. నేషనల్ అవార్డు తీసుకొచ్చాను. వారిలో ఎవరైనా తెచ్చారా? తెలుగు భాష గర్వించతగిన పనిచేశాను. నాకు తెలుగు భాష ఎంతో ఇచ్చింది. అది నేను తిరిగిచ్చి రుణం తీర్చుకోవాలి. ‘మా’ సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మాభిమానం ఉంది. దాన్ని కాపాడేందుకే నేను వచ్చాను. నేను ప్రశ్నించకపోతే.. ఈ ఎన్నికలే ఉండేవి కావు. దీని గురించి ప్రశ్నించినందుకు నన్ను కొందరు బెదిరించారు. నేను ఒక ఉత్తరం రాస్తే అసోసియేషన్‌కు తాళం పడేది’’ అని ప్రకాష్ వ్యాఖ్యానించారు.
‘‘మా ఎన్నికల్లోకి జగన్, కేసీఆర్, బీజేపీలను ఎందుకు లాగుతారా? జగన్ మీ బంధువైతే ‘మా’ ఎన్నికలకు వస్తారా? రెండు సార్లు హలో చెబితే కేటీఆర్ ఫ్రెండైపోతారా? ఈ ఎన్నికల్లోకి కులాలు మతాల ప్రస్తావన ఎందుకు?’’ అని ప్రశ్నించారు. ‘‘నరేష్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడుకోవాలి. నీకు సిగ్గులేకపోతే నాకు ప్రాబ్లం లేదు. కానీ, అసోసియేషన్ సిగ్గుపడేలా ప్రవర్తించవు. అర్జునుడు, కృష్ణుడు అంటున్నావు. నీకు తెలియడం లేదు.. నీ చక్రం ఎప్పుడో దొబ్బేశామని. నో బాల్ ఇది. నాకు ఎటకారం తెలీదు అనుకోకు. మేం ఇక్కడికి కేవలం సమస్యను పరిష్కరించడానికి వచ్చాం. ఎన్నికల్లో మీరు గెలవడానికి ప్రయత్నించండి. కానీ, అవతలివాడిని ఓడించడానికే పోటీ చేయకండి’’ అని అన్నారు.
Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
‘‘కొందరు నన్ను మీకు పెద్దవాళ్ల ఆశీర్వాదం ఉందా అని అడుగుతున్నారు. పెద్దవాళ్ల ఆశీర్వాదం నాకొద్దు. మా ఎన్నికల్లో నా సత్తాతో గెలుస్తాను. పెద్దలను ప్రశ్నించే హక్కు ఉండాలి. వారి దయతో గెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇటీవల విష్ణు చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘ప్రకాశ్ రాజ్ ఇండస్ట్రీ పక్కనున్నాడా.. లేక పవన్ కల్యాణ్ పక్కనున్నాడా అనడం కొద్దిగా బాధేసిందని.. అందుకే అలా మాట్లాడానే తప్ప వ్యక్తిగతంగా వేరే కారణాలు లేవు’’ అని తెలిపారు.
వీడియో:
Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం