MAA Elections: 'మా' అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు.. అదొక బాధ్యత.. మోహన్ బాబు లేఖ
మంచు విష్ణుని గెలిపించమని సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ను షేర్ చేశారు మోహన్ బాబు. అందులో ఏముందంటే..?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు కోసం మోహన్ బాబు రంగంలోకి దిగి ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా ఆయన మంచు విష్ణుని గెలిపించమని సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ను షేర్ చేశారు. అందులో ఏముందంటే..
Also Read: అతడి వల్లే 'మా'లో ఇన్ని గొడవలు.. శివాజీరాజా ఆరోపణలు..
''నేను మీ అందరిలో ఒకడ్ని, నటులతో పాటు నటుడ్ని, నిర్మాతలతో పాటు నిర్మాతని, దర్శకత్వ శాఖలో పనిచేసిన వాడ్ని, ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతిసారీ 'నేనున్నాను' అని ముందు నిలబడ్డ దివంగత దాసరి నారాయణ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డని. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదంటారు. కానీ, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థని స్థాపించిన రోజు నుంచి, నేటి వరకూ ఎన్నో చిత్రాల్ని నిర్మిస్తూ ఎంతోమంది టెక్నిషియన్లని, కళాకారులని పరిచయం చేశా. 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న ఎంతోమంది పిల్లలకి, మరణించిన సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి, వాళ్లు గొప్ప స్థాయికి చేరేలా చేశాను, దాన్ని కొనసాగిస్తాను.
నేను 'మా' అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లని ప్రవేశపెట్టా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. 'మా' అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత. ఈసారి ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకి, నా కమిట్‌మెంట్‌కి వారసుడు. తను ఇక్కడే ఉంటాడు. ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కనే ఉంటాడని నేను మాటిస్తున్నా. మీరు మీ ఓటుని విష్ణుతోపాటు పూర్తి ప్యానెల్‌కి వేసి సమర్థవంతమైన పాలనకి సహరించాలని మనవి'' అని లెటర్ లో పేర్కొన్నారు మోహన్ బాబు.
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి