News
News
X

Karthika Deepam November 17th Update: శౌర్యని కలిసిన సౌందర్య, దీప-కార్తీక్ ను తప్పుదారి పట్టించిన మోనిత

కార్తీకదీపం నవంబరు 17 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
 

Karthika Deepam November 17th  Episode 1511 (కార్తీకదీపం నవంబరు 17 ఎపిసోడ్)

ఇంద్రుడు-చంద్రమ్మ-శౌర్య ముగ్గురూ మళ్లీ పాత ఇంటికి బయలుదేరి వస్తారు. ఇక్కడే ఉంటే బావుండేదని శౌర్య అనడంతో శౌర్యని ఏమార్చే ప్రయత్నం చేస్తారిద్దరూ. ఆ తర్వాత ఐస్ క్రీం తినడానికి వెళతారు. మరోవైపు కార్తీక్ దీప ఇద్దరూ మోనిత కోసం ఇంటిదగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. వస్తుంది కదా ఈ రోజు మోనితతో అటో ఇటో తేల్చుకుంటాను అని అనడంతో..వద్దు దీపా నీకు ఏమీ కాకుండా  నేను చూసుకుంటాను కదా అని భరోసా ఇస్తాడు.

మోనిత కారుని ఫాలో అవుతుంటుంది సౌందర్య...
మోనిత:  ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత. అంకుల్ అంటే ఎలాగో అలా మేనేజ్ చేశాను కానీ ఆంటీ తో చాలా కష్టం
సౌందర్య: ఇది ఏదో చేస్తోంది అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది
మరొకవైపు శౌర్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. అప్పుడు చంద్రమ్మ ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటుంది. ఇంతలో సౌందర్య..ఐస్ క్రీం తింటున్న శౌర్యని చూసి కారు ఆపుతుంది. మోనిత మాత్రం..తప్పించుకునేందుకు ఇదే మంచి సమయం అనుకుంటుంది కానీ..ఇల్లు తెలుసుకదా ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటుంది. మళ్లీ అంతలోనే  సౌందర్య ఆంటీ ఇంటికి రాకముందే వెళితే...ఆంటీ వచ్చేసరికి కార్తీక్, దీప లేకుండా చేయొచ్చని వెళ్లిపోతుంది. 

Also Read: పెళ్లి విషయంలో ఒకే నిర్ణయం తీసుకున్న రిషిధార, ఇప్పుడు జగతి-మహేంద్ర ఏం చేయబోతున్నారు!

News Reels

దీప-కార్తీక్: మోనిత తో గొడవ పెట్టుకుంటాను అంటే డాక్టర్ బాబు ఏమీ అనడం లేదు అంటే కచ్చితంగా గతం గుర్తుకు ఉంటుంది అనుకున్న దీప ఆ విషయం ఎలా బయటపెట్టాలా అని ఆలోచిస్తుంది.. ఇంతలో  మోనిత-కార్తీక్ ఇద్దరూ దిగిన ఫొటోలు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడు కార్తీక్ కావాలనే సీరియస్ అవుతాడు. అధి మీ భార్య కాదు నేను మీ భార్యని ఇంత చెప్పినా మీకు అర్థంకావడం లేదేంటి..జరిగిన పరిస్థితులననీ చూస్తున్నా మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారని నిలదీస్తుంది. నిన్ను భార్య కాదని చెప్పడానికి ఎంత నరకం అనుభవిస్తున్నానో..ఆ మోనిత భార్య అని చెప్పడానికి అంతకు వెయ్యిరెట్లు నరకం అనుభవిస్తున్నా అనుకుంటాడు కార్తీక్. నా పరిస్థితి తెలిసి కూడా ఇలా ప్రశ్నించకు.. మోనిత కన్నా నువ్వు చాలా మంచిదానివి..నీకు అంతా మంచే జరుగుతుందంటుంది... మీకు గతం గుర్తు రావాలి లేదంటే మోనిత నిజం ఒప్పుకోవాలి..మోనితకు చుక్కలు చూపిస్తానంటుంది..

సౌందర్య-శౌర్య: శౌర్యని కలిసిన సౌందర్య..ఇన్ని రోజులు ఊరేగింది చాలు ఇంటికి వెళదాం పద అంటుంది. అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కనిపించగానే నేనే వస్తాను నానమ్మ అంటుంది. అప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారే వాళ్ళు చనిపోయారు అనటంతో శౌర్య సీరియస్ అవుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి నానమ్మ నా మనసు అమ్మానాన్నలు ఉన్నారని చెబుతోంది నేను ఇక్కడి నుంచి రాను అని అంటుంది. అప్పుడు సౌందర్య ఇంద్రుడు దంపతుల మీద సీరియస్ అవడంతో శౌర్య సౌందర్య కి నచ్చ చెబుతుంది. శౌర్య ఫంక్షన్ జరిగింది అని తెలుసుకున్న సౌందర్య సౌర్య ని ఎమోషనల్ గా హత్తుకుంటుంది. ముందు ఇంటికి పదండి మాట్లాడుకుందాం అంటుంది..

Also Read: మోనిత ఇంటికొచ్చిన సౌందర్య, డోర్ తీసిన దీప-కార్తీక్, పెద్ద ట్విస్టే ఇది! 

మోనిత టెన్షన్ టెన్షన్ గా ఇంటికి వెళుతుంది. ఆంటీ ఎందుకు వచ్చింది నా ప్రాణాలు తీయడానికి అనుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది. దీప ఇంటికి తాళం వేసి ఉంది, నా ఇంటికి తాళం వేసి ఉంది..ఇద్దరూ ఎక్కడికి వెళ్లి ఉంటారనుకుంటూ కారు దగ్గరకు వెళుతుంది. అటు దుర్గ మోనిత కారు కీస్ తీసుకుని వెళ్లిపోతాడు. 

సౌందర్య-శౌర్య: కనీసం నీ ఫంక్షన్ కూడా చేసే అవకాశం ఇవ్వేలేదేంటని సౌందర్య సీరియస్ అవుతుంది.. కనీసం సమచారం కూడా ఇవ్వలేదని ఇంద్రుడు-చంద్రమ్మ వైపు సీరియస్ గా చూస్తుంది. అమ్మా నాన్న లేకపోతే ఎంత పెద్ద వేడుక అయినా సంతోషం ఇవ్వదంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు వాళ్లు లేరని అంటూ సౌందర్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. చిన్న పిల్ల దానికి తెలియదు మీకైనా పరిస్థితి అర్థంకావడం లేదా ఎందుకు దాని నమ్మకాన్ని బలపరుస్తున్నారని నిలదీస్తుంది. ఓ అబద్ధాన్ని నిజం అనుకుని నమ్మి నమ్మి చివరకు ఆ అబద్ధంలోనే ఉండిపోయి ఉన్న జీవితాన్ని పోగొట్టుకోవాల్సి వస్తోందని ఫైర్ అవుతుంది సౌందర్య..

రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
ఈ రోజు మోనితతో నేను ఏం మాట్లాడినా మీరు అఢ్డుపడకూడదంటుంది దీప... ఇంతలో ఇంటికి చేరిన మోనిత.. దీప-కార్తీక్ లోపలే ఉండడం చూసి షాక్ అవుతుంది.. ఇంతలో సౌందర్య వచ్చి డోర్ కొడుతుంది.. దీప-కార్తీక్ డోర్ తీస్తారు...

Published at : 17 Nov 2022 09:17 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1512 Karthika Deepam Serial November 17th

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?