Guppedantha Manasu November 16th Update: పెళ్లి విషయంలో ఒకే నిర్ణయం తీసుకున్న రిషిధార, ఇప్పుడు జగతి-మహేంద్ర ఏం చేయబోతున్నారు!
Guppedantha Manasu November 16th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
![Guppedantha Manasu November 16th Update: పెళ్లి విషయంలో ఒకే నిర్ణయం తీసుకున్న రిషిధార, ఇప్పుడు జగతి-మహేంద్ర ఏం చేయబోతున్నారు! Guppedantha Manasu November 16th Today Episode 609 written update, Know In Details Guppedantha Manasu November 16th Update: పెళ్లి విషయంలో ఒకే నిర్ణయం తీసుకున్న రిషిధార, ఇప్పుడు జగతి-మహేంద్ర ఏం చేయబోతున్నారు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/9574bcef90eec1c5fce197cae8bcefee1668570747983217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 16th Today Episode 609)
మీరిద్దరూ ఒక్కటైతే మహేంద్ర అంకుల్-జగతి మేడం వస్తారని గౌతమ్ చెప్పడంతో..వసుధారకు డౌట్ వస్తుంది. సార్-మేడం ఎక్కడున్నారో మీకు తెలుసా అని నిలదీస్తుంది..వసుకి అనుమానం వచ్చిందని క్లారిటీ వచ్చిన గౌతమ్ ఏదో చెప్పి కవర్ చేస్తాడు.
వసు: మేడం-సార్ లేరని ప్రెస్ మీట్ వాయిదా వేశాను అలాంటిది జీవితానికి సంబంధించిన పెళ్లి విషయంలో వాళ్లు లేకుండా ఆ నిర్ణయం ఎలా తీసుకుంటాను అంటుంది
గౌతమ్: అటు వాడు అంకుల్ కోసం..ఇటు నువ్వు మేడం కోసం...ఎన్నాళ్లు ఎదురుచూస్తారు..
వసు: ఎన్ని మెయిల్స్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు..వచ్చేవరకూ ఎదురుచూస్తాను
గౌతమ్: బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతుండగా..ఎక్కడకి వెళుతున్నావ్..
నా మనసు బాలేదు వెళుతున్నా...మహేంద్ర సార్-జగతి మేడం ఎక్కడున్నారో మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్ అనేసి వెళ్లిపోతుంది... నీ దగ్గర నిజాన్ని దాస్తున్నందుకు అదోలా ఉంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి అనుకుంటాడు గౌతమ్
ఇంతలో ప్రెస్ వాళ్ల నుంచి రిషికి కాల్ వస్తుంది.. ఇంటర్యూ వాయిదా వేయమందా ఎందుకు అని అడిగి ఇంటర్యూ వాయిదా ఉండదు మీరు రండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అంతా తనిష్టమేనా అనుకుని కోపంగా బయలుదేరుతాడు. అటు వసుధార ఆటోలో వెళుతూ గౌతమ్ మాటలు గుర్తుచేసుకుంటుంది...నువ్వు-రిషి పెళ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకునేవరకూ వాళ్లు రారు అన్నమాటలు తలుచుకుంటుంది.. ఇంతలో కాలేజీ బయటకు వచ్చిన రిషి..వసుకనిపించిందా అని గౌతమ్ ని అడుగుతాడు. వెళ్లిపోయిందని చెప్పిన గౌతమ్.. మీ పెళ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకోమని చెప్పినట్టు చెబుతాడు..
రిషి: పిచ్చిపిచ్చి సలహాలు ఇవ్వకు
గౌతమ్: జగతి మేడం రావాలని తను..డాడ్ రావాలని నువ్వు..నేను చెప్పేది వాస్తవంరా..ఇద్దరూ వాస్తవంలోకి వచ్చి ఆలోచించండి
రిషి: వసుధారకి నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తనకి జగతి మేడం ప్రాణం, డాడ్ అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ..అలాంటిది వాళ్లు లేకుండా మేం ఒక్కటి ఎలా అవుతాం.. వసుధారతో నేను వెంటనే మాట్లాడాలి
గౌతమ్: తను ఎక్కడికి వెళ్లిందో చెప్పలేదు
రిషి: నాకు తెలుసు
ఏంటో వీళ్లు చెప్పింది వినరు..అక్కడున్నవారు మనసు మార్చుకోరు..ఏంటో ఇదంతా అనుకుంటాడు గౌతమ్..
Also Read: మోనిత ఇంటికొచ్చిన సౌందర్య, డోర్ తీసిన దీప-కార్తీక్, పెద్ద ట్విస్టే ఇది!
వసుధార అమ్మవారి దగ్గర నమస్కారంపెట్టుకుంటుంది. తల్లి కొడుకుని ఒక్కటి చేయమంటే తండ్రి-కొడుకుని దూరం చేశావా అని బాధపడుతుంది. వాళ్లు లేకుండా మా పెళ్లికిసంబంధించిన నిర్ణయం ఎలా తీసుకుంటాం..ఇదేం న్యాయం తల్లి నీకు రిషి సార్ కి తండ్రిని దగ్గరచేయి అని వేడుకుంటుంది. వెనక్కు తిరిగే సరికి రిషి అక్కడ రిషి ఉంటాడు..
మీరేంటి ఇక్కడ అని అడిగితే..నువ్విక్కడున్నావని నామనసు చెప్పింది అంటాడు. నువ్వు కోరుకోవాల్సింది కోరుకున్నావ్ కదా నువ్వు ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుందని ధైర్యం చెప్పి వసుని చేయిపట్టుకుని తీసుకెళతాడు రిషి. ఓ దగ్గర కారు ఆపి మాట్లాడుకునేందుకు దిగుతారు
రిషి: ఎందుకు ఇంటర్వ్యూ వాయిదా వేశావు , నువ్వు అనుకున్నది సాధించావు. నీ గురించి ప్రపంచం మొత్తం తెలియాలి , నీ ఇంటర్వ్యూ చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు . ఇంటర్వ్యూ వద్దు ఇవ్వను అనడం సరైనది కాదు
వసు:సార్ నా జీవితంలో అడుగడుగునా జగతి మేడం తోడు ఉండి నాకు సహాయపడింది. అలాంటి మేడం నా పక్కన లేకుండా నా గురించి నేను చెప్పుకోవడం అంటే అది అసంపూర్ణం సార్ అంటూ జగతి మేడంనితలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది
కన్నీళ్లు తుడిచి ధైర్యం చెబుతాడు రిషి..ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు
Also Read: వసు ముందు తడబడిన గౌతమ్, దేవయానిని నిలదీసిన ఫణీంద్ర, రిషి ఏం చేయబోతున్నాడు!
ఫణీంద్ర-గౌతమ్
ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారని ఫణీంద్ర అనడంతో...మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం అంకుల్ అని కవర్ చేస్తాడు. ఇలాంటి టైమ్ లో రిషికి నువ్వు తోడుగా ఉండాలని ఫణీంద్ర అంటే..ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషిని చాలా ప్రేమగా చూసుకుంటోంది..రిషి ప్రతి మూడ్ ని అర్థం చేసుకుంటుంది, రిషికి ఏం కావాలో చూసుకుంటుంది అంటాడు. తను రిషిని బాగా అర్థం చేసుకుంటుంది తను తెలివైన అమ్మాయి అంటాడు ఫణీంద్ర..ఇంతలో రిషి-వసుధార వస్తారు.
ఫణీంద్రని పలకరించి లోపలకు వెళ్లిపోతుంది వసుధార. ఆ తర్వాత రషి..తండ్రిని తలుచుకుని బాధపడతాడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)