Karthika Deepam January 7th Update:ముగ్గురి భామల మధ్య డాక్టర్ బాబు- చారుశీలను వణికించిన మోనిత, శపథం చేసిన దీప
కార్తీకదీపం జనవరి 7 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
కార్తీకదీపం జనవరి 7 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam January 7th Update)
హిమ,శౌర్య ఇద్దరూ కార్తీక్-దీప కోసం వెతుకుతుంటే హేమచంద్ర చూసి బాధపడతాడు. మీ అమ్మానాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మీకు నిజం చెప్పడం లేదనుకుంటాడు.పిల్లల్ని తీసుకెళ్లి ఏదైనా తినిపించాని అనుకుంటాడు...
మరోవైపు చారుశీల ఆలోచనలో పడుతుంది. నా గురించి కార్తీక్ కు తెలియకూడదు అనుకుంటుంది.. ఇంతలో కార్తీక్ బయటినుంచి చారుశీల అన అరుస్తాడు . నీ గురించి మొత్తం తెలిసిపోయిందని మండిపడతాడు. చారుశీల ఎంత కవర్ చేసుకునేందుకు ప్రయత్నించినా కార్తీక్ అస్సలు మాట్లాడనివ్వడు. ఇంతలో లోపలి నుంచి మోనిత మాట వినిపించడంతో కోపంగా వెళతాడు కార్తీక్..
మోనిత: నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ అంటూ చీరలు ఎంచుకుంటూ ఉంటుంది మోనిత
కార్తీక్: మోనిత ఇలాంటి పిచ్చిపనులు మానేయమని ఎన్నిసార్లు చెప్పాను
మోనిత: ఇదంతా మన పెళ్లి ప్లానింగ్.. మన హనీమూన్ స్విడ్జర్లాండ్ లో ... వచ్చే నెల 16న బుక్ చేసాను అప్పటికి దీప కార్యక్రమాలు పూర్తై..పదోరోజు కూడా పూర్తవుతుంది .
కార్తీక్: ఏం కూశావ్..ఛీ..నిన్ను ముట్టుకునేందుకు కూడా చిరాగ్గా ఉంది...నీకు పెళ్లి కావాలా అని చీరలన్నీ విసురుతూ ఉండగా..బయటి నుంచి దీప ఎంట్రీ ఇస్తుంది
మోనిత: చారుశీల చెప్పాను కదా..దీప కూడా వస్తుందని..అయినా అంతా బావున్నప్పుడే ఏమీ చేయలేకపోయింది..ఇప్పుడేం చేస్తుందిలే..కోపంగా చూడడం తప్ప
దీప; నిన్ను ఇప్పుడే చంపేస్తానని దీప ఆవేశపడుతుంది
మోనిత: నువ్వు పోయాక మా పెళ్లి జరుగుతుంది..తను నా కార్తీక్.నా బిడ్డకు తండ్రి..హనీమూన్ ప్లాన్ చేశాను... ఏంటి ఇదికూడా ఆపేద్దామనా..అప్పటి వరకూ నువ్వ ఉండవు కదా..మహా అయితే వారం రోజుల్లో దుకాణం బంద్.. ఏం చేసుకున్నా ఈవారం రోజులే..గుర్తుపెట్టుకో...
దీప: అసలు అంతవరకూ నువ్వుంటే కదా..దీని అంతు చూడడం మీ ఒక్కరి వల్లే ఎలా అవుతంది...
కార్తీక్: దీప నవ్వు ఆవేశపడకు
మోనిత: నవ్వు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వారం రోజులే..ఆ తర్వాత మన పెళ్లికి ప్రిపేర్ అవు.. గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాను దీపా..కానీ..నీ ప్రాణం కన్నా ఖరీదు ఏముంది చెప్పు..కార్తీక్.. నీ అంత అదృష్టం వంతుడు ఎవ్వరూ ఉండరు. ఓ భార్య పోగానే మరో భార్య రెడీగాఉంది...
కార్తీక్: మోనితా..నన్ను హంతకుడిని చేసి జైలుకి వెళ్లేలా చేయకు
దీప: మీకెందుక ఆ శ్రమ..వారం రోజుల్లో దీనికి పిండం పెట్టి నేను పోతాను..
చారుశీల మాత్రం చూస్తుంటుంది...
చారుశీల: ఎందుకు వాళ్లని వెర్రెక్కించి టెన్షన్ పెట్టి మాటలు అనిపించుకంటావ్
మోనిత: దీప ఎంత టెన్షన్ పడితే అంత త్వరగా పోతుంది..అదే నా ప్లాన్..
Also Read: త్వరలో కలుద్దాం - చిటికెలు వేసి మరీ దేవయానికి వసు వార్నింగ్, తాళిపై రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి!
శౌర్య మేడపై నిల్చుని బాధపడుతుంటుంది.. ఎందుకమ్మా ఏడుస్తున్నావని అడుగుతాడు ఇంద్రుడు. అమ్మానాన్న కనిపిస్తారన్న నమ్మకం లేదని అంటుంది. అలా అనొద్దమ్మా..నానమ్మ హైదరాబాద్ వెళ్లినప్పటికీ నీతోపాటూ వెతికారు కదా అంటాడు ఇంద్రుడు. నానమ్మ వాళ్లతో నేను వెళ్లనని శౌర్య అంటే...అలా మాట్లాడొద్దు నేను వెళ్లి మీ నానమ్మతో మాట్లాడతాను అంటాడు ఇంద్రుడు...
Also Read: నా దారి రహదారి అన్న మోనిత,దీపకు తెలియకుండా మోనితను కలిసిన కార్తీక్, చారుశీల సైడైపోయినట్టేనా!
మోనిత ఫుల్ ఖుషీగా కూర్చుని ఉయ్యాలలో ఊగుతుంటుంది.. చారుశీల వస్తుంది
చారుశీల: కార్తీక్ దీప తిట్టారన్న బాధలేదు..జైలు నుంచి వచ్చిన ఫీలింగ్ లేదు..ఎంచక్కా మౌత్ ఆర్గాన్ వాయించుకుంటోంది అనుకుంటుంది..
మోనిత: కార్తీక్ తో కలసి ఉన్నట్టు ఊహించుకుంటున్నాను..అందుకే ఇంత ఆనందం
చారుశీల: నువ్వు నిజంగా కలలు కంటున్నావు..దీప చనిపోయినా కార్తీక్ నీ దగ్గరకు వస్తాడన్న నమ్మకం ఏంటి
మోనిత: వస్తాడు
చారుశీల: దీప పోయినా నీ దగ్గరకు ఎందుకు వస్తాడు..దీప పోయినా నిన్ను శత్రువులానే చూస్తాడు
మోనిత: నన్ను శత్రువులా చూడకుండా ఉండేందుకు నా ప్లాన్స్ నాకున్నాయి.. జైలు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది.. నేను కార్తీక్ ను సొంతం చేసుకునేందుకు అక్కడే అద్భుతమైన పథకాలు రచించాను...
చారుశీల: నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది.
మోనిత: నిన్ను కూడా భయపెట్టలేకపోతే ఇక కార్తీక్ ను ఏం సాధిస్తాను.. కార్తీక్ నిన్నేమన్నాడు
చారుశీల: నీతో పోల్చి నన్ను తిట్టాడు.. ఇంప్రెషన్ మొత్తం పోయింది
మోనిత: నువ్వెందుకు బాధపడుతున్నావ్..కార్తీక్ కు నువ్వు ఏమైనా ట్రై చేస్తున్నావా అనగానే చారుశీల షాక్ అవుతుంది
మళ్లీ కార్తీక్, దీప కనిపిస్తే ఏం చేయాలో సలహాలిస్తుంది మోనిత...