అన్వేషించండి

Karthika Deepam January 6th Update: నా దారి రహదారి అన్న మోనిత,దీపకు తెలియకుండా మోనితను కలిసిన కార్తీక్, చారుశీల సైడైపోయినట్టేనా!

కార్తీకదీపం జనవరి 6 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

కార్తీకదీపం జనవరి 6 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam January 6th Update)

మోనిత మళ్లీ రావడంతో దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రశాంతంగా ఉందాం అనుకుంటే మళ్లీ వచ్చిందనే ఆలోచనలో ఉండగా కార్తీక్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు.ఆ మోనిత మనల్ని ప్రశాంతంగా ఉంచదని అనడంతో.. కార్తీక్ ధైర్యం చెబుతాడు. మోనిత గురించి మాట్లాడొద్దు..పట్టించుకోవద్దంటాడు.  
దీప: నేను బతికి ఉన్నప్పుడే దాన్ని పైకి పంపిస్తే పోయాక నాకు ఆత్మ శాంతి,మీకు మనశ్సాంతి లభిస్తుంది
కార్తీక్: మోనిత లేదు..ఇక్కడకు రాలేదనే ఆలోచనలో ఉండు..దాన్ని మళ్లీ మన జోలికి రాకుండా చూసుకుంటాను
ఇంతలో కార్తీక్ కి కాల్ రావడంతో..ఇప్పుడే వస్తున్నా అని చెబుతాడు..ఎవరని దీప అడిగితే తెలిసిన వాళ్లు అని చెబుతాడు. వంట అయిపోయింది తినేసి వెళ్లమని చెబితే అర్జెంటుగా వెళ్లాలని చెప్పి.. నువ్వు నాకోసం ఎదురుచూడకు ప్రశాంతంగా తినిసే రెస్ట్ తీసుకో అంటాడు.  ఆ మోనిత ఉన్నంత వరకూ ప్రశాంతత ఎక్కడుందని చెప్పి దీప బాధపడుతుంది..

Also Read: ద్యావుడా! మోనిత మళ్లీ వచ్చేసింది, చారుశీల గురించి మొత్తం తెలుసుకున్న కార్తీక్!

కార్తీక్ వెళ్లింది ఎవరికోసమో కాదు..మోనిత కోసం...
మోనిత:నువ్వు నాకోసం వచ్చావా
కార్తీక్: నీతో ఒక్క నిముషం మాట్లాడాలి
మోనిత: ఒక్క నిముషం ఏంటి..జీవితం మొత్తం నీ సొంతం. లోపలకు రా మాట్లాడుకుందా
కార్తీక్: అనసరం లేదు బయటే మాట్లాడతాను
మోనిత: గతం గుర్తులేనప్పుడు ఇదే ఇంట్లో ఎంతో సంతోషంగా గడిపాం..ఈ ఇల్లు నీదే..ఈ మోనితా నీదే..
కార్తీక్: ఆపు మోనితా
మోనిత: అన్నీ మర్చిపో..నా చేయి పట్టుకో అంతులేని సంతోషం నీ సొంతం అవుతుంది..
కార్తీక్: దీప పరిస్థితి తెలిసి కూడా ఇంకా అదేపాట పాడుతున్నావ్..ఏం చేయాలి నిన్ను
మోనిత: నువ్వు ఏం చేసినా నా అభిప్రాయం మారదు
కార్తీక్: మమ్మల్ని వదిలెయ్..
మోనిత: వదిలేస్తాను..కానీ..ఓ కండిషన్..నేను మీతో పాటే ఉంటాను మిమ్మల్ని డిస్ట్రబ్ చేయను..దీప బతికి ఉన్నంతకాలం సంతోషంగా ఉండను..మీ సంతోషం చూస్తూ  మీతోనే ఉంటాను..కానీ దీప పోయాక అంతే సంతోషంగా నాతో ఉండాలి
కార్తీక్: నీ బుద్ధి మారదని తెలిసికూడా నీతో మాట్లాడాలని రావడం నాదే తప్పు
మోనిత: ఒక్క అవకాశం ఇవ్వు..మీరు సంతోషంగా ఉంటారు..నేను కూడా సంతోషంగా ఉంటాను..
కార్తీక్: ఇప్పుడు దీప పరిస్థితి బాలేదు కాబట్టి..ఏ రకంగానూ డిస్ట్రబ్ చేయకూడదు కాబట్టి నిన్ను వదిలేసి వెళుతున్నాను.. కానీ నీవల్ల ఏదైనా సమస్య వచ్చిందో ప్రాణాలు తీసేస్తాను

Also Read: జైల్లో వసుధార, మెడలో తాళి చూసి మళ్లీ అపార్థం చేసుకున్న రిషి, రాజీవ్ కి మరో అవకాశం!

మరోవైపు హిమ-శౌర్య..ఇద్దరూ దీప-కార్తీక్ ను వెతుకుతూ బయలుదేరుతారు.. హిమ తనతో కలిసేందుకు ఎంత ప్రయత్నించినా శౌర్య మాత్రం కోపంగానే ఉంటుంది. అటు దీప ఇంట్లో ఆలోచనలో పడుతుంది..ఇంకా డాక్టర్ బాబు రాలేదేంటని అనుకుంటుండగా మోనిత వస్తుంది..
మోనిత: వంటేం చేశావు..తింటూ మాట్లాడుకుందాం
దీప: వెళతావా బయటకు గెంటేయనా
మోనిత: ఇలా ఆవేశపడే జీవితంలో చాలా కోల్పోయావు..సరే కార్తీక్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు..నాకోసం కాదులే నీకోసం.. పాపం దీప ఆఖరి క్షణాల్లో ఉంది ఇప్పుడన్నా ప్రశాంతంగా బతకనివ్వు అని బతిమలాడాడు.. సరే అని ఓ కండిషన్ మీద అయితే ఒప్పుకుంటా అని నా కండిషన్ చెప్పాను.. కార్తీక్ కు నచ్చలేదు..కనీసం నీకైనా నచ్చుతుందేమో అని ఆ ప్రపోజల్ తో వచ్చాను.. ఏంటంటే మన ముగ్గురం కలసి ఒకే దగ్గర ఉందాం..నేను మిమ్మల్ని డిస్ట్రబ్ చేయను..కార్తీక్ ను చూసుకుంటూ మూలన పడి ఉంటా..ఎలాగూ రేపు నువ్వు పోయిన తర్వాత కార్తీక్ నా సొంతం అవుతాడు కదా..నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. నా కాన్పెప్ట్ అర్థమవడం లేదు
దీప: చెప్పు తెగ్గుద్ది...ఏంటే అర్థమయ్యేది..నీ మొహం ముక్కలయ్యేది..కానీ నిన్ను ముట్టుకుంటే పాపం అని నీపై కోపం ఆ ప్లేట్ పై చూపించాను..నువ్వు వెళ్లకపోతే నిలువునా చీరేస్తాను
మోనిత: ఎందుకు నన్ను విలన్ లా చూస్తున్నావ్..నేను చెప్పినదాంట్లో కూడా నీకు మంచి కనిపిస్తుంది..
దీప: నీకు మంచి చేయడం రాదు..నాశనం చేయడమే వచ్చు..
మోనిత: నేను నాశనం చేసేదాన్నే..కానీ..నువ్వేం బాగుపడ్డావ్..కార్తీక్ ను ఏం బాగుచేశావ్..మీ పెళ్లైన దగ్గర్నుంచీ నువ్వూ సంతోషంగా లేవు కార్తీక్ సంతోషంగా లేడు..ఇద్దరూ దూరంగానే ఉన్నారు.. ఇప్పుడేంటి కొత్తగా వదలను వదలను అంటున్నావ్. బతికి ఉన్నప్పుడే పట్టుకోలేకపోయావ్..చావబోతూ పట్టుకుని ఏం చేస్తావ్ చెప్పు..నువ్వు ఏమీ చేయలేవు దీపా...ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయింది..కొద్దిరోజుల తర్వాత నా దారి రహదారి కాబోతోంది..అప్పటి వరకూ ఆగొచ్చు కానీ నీ దార్లోకి ఎందుకు వస్తున్నానో తెలుసా...నువ్వు పోయేముందు మా పెళ్లి జరిపించు కార్తీక్ ను ప్రేమగా చూసుకుంటా..నీక్కూడా కార్తీక్ ను నాచేతుల్లో పెట్టానన్న తృప్తి మిగులుతుంది. మొదట్నుంచీ కార్తీక్ నా దగ్గర ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు..బాగానే ఉంటాడు.. నేను చెప్పేది నిజం కాదని ఒక్కర్నైనా చెప్పమను... 
దీప:అవునే..నువ్వు చెప్పేవి నిజాలే...కానీ మాజీవితాలు ఇలా కావడానికి కారణం నువ్వే..మా మధ్య చిచ్చుపెట్టింది నువ్వే..నువ్వనేదానివి లేకపోతే మా జీవితాలు వేరేలా ఉండేవి..అందుకే మళ్లీ చెబుతున్నా..నేనంటూ పోతే పోవడానికి ముందే నీ ప్రాణాలు తీసేపోతాను... పో బయటకు..లేకపోతే గొయ్యితీసి పాతేస్తా...
మోనిత: నీ టైమ్ దగ్గరపడేకొద్దీ ఇదే ప్రపోజల్ తో నా దగ్గరకు వస్తావ్ చూడు.. బై అనేసి వెళ్లిపోతుంది మోనిత...

తల్లిదండ్రులకోసం వెతుకుతున్న హిమ-శౌర్యని చూసి హేమచంద్ర బాధపడతాడు. అసలు దీప కార్తీక్ ఉద్దేశం అర్థంకావడం లేదు ...ఎక్కువకాలం ప్రాణాలతో ఉండకపోయినా ఉన్నన్నాళ్లు సంతోషంగా ఉండాలికదా.. వాళ్లు సంతోషంగా ఉండక... పిల్లల్ని సంతోషంగా ఉండనీయక ఏం సాధిస్తున్నాట్టు అని బాధపడుతూ..హిమ-శౌర్య దగ్గర కారు ఆపుతాడు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Elections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులుSiddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget