అన్వేషించండి

Karthika Deepam January 5th Update: ద్యావుడా! మోనిత మళ్లీ వచ్చేసింది, చారుశీల గురించి మొత్తం తెలుసుకున్న కార్తీక్!

కార్తీకదీపం జనవరి 5 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

కార్తీకదీపం జనవరి 5 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam January 5th Update)

దీప గురించి హేమచంద్రతో మాట్లాడతాడు కార్తీక్...
కార్తీక్: దీపను అమెరికా తీసుకెళ్లాలా..
హేమచంద్ర: ఆపరేషన్ తర్వాత అంతా బావుంది కదా..మళ్లీ ఏమైంది
కార్తీక్: అదే అర్థంకావడం లేదన్న కార్తీక్..అమ్మా వాళ్ల ఇంటికి వెళ్లాం..లోపలకు వెళ్లేముందు కళ్లుతిరిగి పడిపోయింది .. రిపోర్ట్స్ వచ్చేవరకూ కూడా నాకు అర్థం కాలేదు..
హేమచంద్ర: దీప విషయం మనకే అంతుచిక్కడం లేదంటే..మనకు తెలియని కారణం ఏదో ఉండే ఉంటుంది
కార్తీక్: అప్పటికీ దీప కేస్ షీట్..చాలామందికి పంపించాను.. ఎందుకిలా జరిగిందో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. డాక్టర్ ని అయి ఉండి ఎందరో ప్రాణాలు కాపాడిన నేను..నా భార్యను కాపాడుకోలేకపోతున్నా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు
హేమచంద్ర: తను కేస్ షీట్ చూశాను..అంత ప్రమాదం లేదు..కంగారు పడొద్దు కార్తీక్
కార్తీక్: పేషెంట్ ఎవరో అయితే నేనుకూడా అదే చెప్పేవాడినేమో..కానీ అక్కడున్నది దీప..నా భార్య
హేమచంద్ర: ఇప్పుడు మీరు భర్తగా కాదు డాక్టర్ గా ఆలోచిస్తేనే అసలైన ప్రాబ్లెమ్ ఏంటో తెలుసుకోగలుగుతారు.. ఒక్కోసారి ప్రాబ్లెమ్ కనిపించనంత చిన్నగా ఉంటుంది కానీ దాని ఫలితం ఊహించనంత పెద్దగా ఉంటుంది..ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది... సరిగ్గా దృష్టిపెడితే మీరే సాల్వ్ చేయగలుగుతారు...

Also Read: జైల్లో వసుధార, మెడలో తాళి చూసి మళ్లీ అపార్థం చేసుకున్న రిషి, రాజీవ్ కి మరో అవకాశం!

మరోవైపు హిమ-శౌర్య ఇద్దరూ తల్లిదండ్రుల గురించి వెతుకుతారు.. నిన్నెలా నమ్మించాలో తెలియడం లేదని అంటుంది హిమ. నానమ్మ తాతయ్య ఆపరేషన్ కోసం వెళ్లారు కదా..వాళ్లొచ్చేసరికి వారం పడుతుంది.. ఈవారం రోజులూ ఈ ఊర్లో ప్రతి ఇల్లూ వెతుకుదాం..వాళ్లు కనిపిస్తే నువ్వు మాతో వస్తావా అని హిమ అంటే..వాళ్లు కనిపించకపోతే నన్ను వదిలేసి వెళ్లిపోతారా అంటుంది. సరే అని డీల్ కుదుర్చుకుంటారు హిమ-శౌర్య...

 

మరోవైపు దీప-కార్తీక్ బయటకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చేసరికి..ఇంటిముందు మోనిత కూర్చుని ఉంటుంది. షాక్ లో ఉన్న దీప-కార్తీక్ ను చూసి మోనిత మాట్లాడుతుంది
మోనిత: జైల్లో ఉన్నా నా ఆలోచనంతా నీపైనే ఉంది కార్తీక్..అందుకే జైలు నుంచి నేరుగా ఇక్కడికే వచ్చేశాను.. మీ పనిమనిషితో నేను నీ మనిషిని అని చెప్పగానే కాఫీ ఇచ్చేసింది... దీన్ని తాగుతూ నిన్ను తలుచుకుంటూ కూర్చున్నా.. ఇక నిన్ను వదిలిపోయేది లేదు..నీతో పాటూ ఇక్కడే ఉంటాను
దీప: ఏంటే ఇక్కడ ఉండేది..నడు బయటకు
మోనిత: జైలుకి పోయాను కాబట్టి నా చాప్టర్ క్లోజ్ అనుకున్నావా..నా ప్రేమను జైలు గోడలు ఎలా ఆపగలవు అనుకున్నావ్.. అవసరం అయితే కార్తీక్ కోసం జైలు గోడలు బద్దలుగొట్టైనా వచ్చేద్దాం అనుకున్నాను కానీ అంత కష్టపడకుండానే వదిలేశారు.
కార్తీక్: నువ్వు ఎంతకైనా తెగించగలవని తెలుసు..నువ్వు చేసింది చాలు..ఇక్కడి నుంచి వెళ్లిపో
మోనిత: నేను వచ్చింది వెళ్లడానికి కాదు..నీతో ఉండడానికి
దీప: ఇంకోసారి ఆ వాగుడు వాగితే ప్రాణాలు తీస్తాను
మోనిత: దీపక్కా ఎందుకు అంత ఆవేశపడుతున్నావ్..ఆవేశం పడేకొద్దీ ఆయుష్షు తగ్గిపోతుంది..అస్సలు బతికే ఛాన్సే లేదంట కదా ..ఇప్పుడే రిపోర్ట్స్ చూశాను..
దీప: నా పరిస్థితి ఎలా ఉంటే నీకెందుకు..
మోనిత: నెలలా రోజులా కార్తీక్..బతికే ఛాన్సే లేదంట కదా..పాపం దీప..నువ్వొకటి తలిస్తే ఆ దేవుడు మరొకటి తలిచాడు చూడు..కార్తీక్ నాకు దక్కకూడదని ఎంత కష్టపడ్డావ్..కానీ చివరకు ఏం జరుగుతోంది..కార్తీక్ ని నా చేతుల్లో పెట్టి నువ్వు ప్రశాంతంగా దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నావ్
కార్తీక్: పిచ్చిపిచ్చిగా మాట్లాడకు
మోనిత: నిజం కాదా..రిపోర్ట్స్ తప్పంటావా..మరి మీ ఇద్దరూ కలిశాక కూడా అమ్మానాన్న దగ్గరకు వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారు..ఎందుకంటే..దీప చనిపోబోతుందని వాళ్లకు తెలిస్తే తట్టుకోలేరు అంతేకదా..ఓ రకంగా ఆంటీకి చెప్పకుండా మంచిపనే చేశారు..ఆ తర్వాత ఆంటీని హ్యాండిల్ చేయడం నాకు కష్టం అవుతుంది..రేపు దీప పోయాక కూడా ఆంటీవాళ్లకు చెప్పొద్దు..మనిద్దరం ఇక్కడే సెటిలైపోదాం
దీప: నా డాక్టర్ బాబు మీద నీ నీడ కూడా పడనివ్వను...
మోనిత: మహా అయితే నెల...అంతకన్నా నీకు ఎక్కువ ఛాన్స్ లేదు దీపక్కా..
కార్తీక్: దీపకు ఏం కాదు..
మోనిత: ఇంకా దాయాలని ఎందుకు చూస్తున్నావ్.. దీప బతకదని నీకు ఎప్పుడు తెలిసిందో నాక్కూడా అప్పుడే తెలిసింది.. ఎలా అనుకుంటున్నారా చారుశీల చెప్పింది..
కార్తీక్: చారుశీల నీకెలా తెలుసు
మోనిత: నాకు తెలియకపోవడం ఏంటి..తను నా మనిషే కదా..నిన్ను అక్కా అని పిలుస్తోంది కదా అని నీ మనిషి అనుకుంటున్నావా..నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నేను పంపించిన మనిషి..లేకపోతే పరిచయం అయినా మీతో అంతబాగా కలసిపోతుందా..మీ అవసరాలన్నీ తీరుస్తుందా..నేను జైల్లో ఉన్నానో మీరెక్కడున్నారో తెలుసుకునేందుకు ఓ మనిషి కావాలి కదా..దానికోసం కూడా పనికొస్తుందని పెట్టాను..బాగానే పనికొచ్చింది..ఎప్పటికప్పుడు మీ విషయాలు చెబుతూ చివరకు నువ్వు పోతున్నావన్న శుభవార్త కూడా చెప్పింది దీపా...పోయినదానివి ప్రశాంతంగా పోకుండా నాతో గొడవెందుకు..
కార్తీక్: మోనితా...
దీప: కొట్టడానికి కూడా మీరు దీన్ని తాకడానికి వీల్లేదు..నేను పోతాను కానీ అంతకు ముందు ఒక్క క్షణం అయినా నీ ప్రాణాలు తీస్తాను
మోనిత: ఊరికే ఆవేశం ఎందుకు..పోవడానికి అంత తొందరెందుకు..
కార్తీక్: ఇంకోసారి దీప పోతుందని అన్నావంటే బాగోదు..నా ప్రాణాలు కూడా తన ప్రాణాలతోనే ముడిపడి ఉంటాయి.. చావైనా, బతుకైనా దీపతో పాటే నేను.. నీ సమాధిపై తను జీవితాన్నే నిలబెట్టుకోవాలని ఆశపడుతోందా.. తన సొంతం అవుతానని ఎలా అనుకుంటోంది..
మోనిత: దీప ప్రాణాలు పోతే నువ్వుకూడా ప్రాణాలతో ఉండవా.. మరి నా పరిస్థితి ఏంటి.. దీపతో కలసి బతికావ్ తట్టుకున్నా 
. ఇన్నేళ్లుగా నీ వెంట పడింది దీపతో పాటూ నువ్వుకూడా పోతుంటే చూస్తూ ఊరుకోడానికా... నువ్వేం మాట్లాడవేంటి దీపా.. నువ్వు కూడా కార్తీక్ పోవాలని కోరుకుంటున్నావా..
దీప: ఇప్పటికే ఎక్కువగా మాట్లాడావ్ వెళ్లిపో...
మోనిత: నువ్వు ఉన్నన్నాళ్లూ కార్తీక్ తో ఉండు... నువ్వు పోయాక కార్తీక్ ను నాకు అప్పగించు..
దీప: నీవల్లే మా జీవితం ఇలా తయారైంది..ప్రశాంతంగా ఉండనివ్వకుండా పీక్కుతినే పిశాచివి నువ్వు..అంటూ మోనితను గెంటేస్తుంది...

దీపా..కార్తీక్ గురించి నువ్వు కంగారుపడకు..నువ్వు పోయాక నేను చూసుకుంటాలే అని మరింత రెచ్చగొట్టి వెళ్లిపోతుంది మోనిత...

Also Read: దీపను చంపేసి కార్తీక్ ను పెళ్లిచేసుకుని ఇంటికొస్తానన్న చారుశీల, సౌందర్యలో మొదలైన అనుమానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Godzilla X Kong Review: గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Godzilla X Kong Review: గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Rs 2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Embed widget