Karthika Deepam January 4th Update: దీపను చంపేసి కార్తీక్ ను పెళ్లిచేసుకుని ఇంటికొస్తానన్న చారుశీల, సౌందర్యలో మొదలైన అనుమానం
కార్తీకదీపం జనవరి 4 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
కార్తీకదీపం జనవరి 4 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam January 4th Update)
ఉన్న కొద్ది రోజులు అయినా ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని అనుభవించాలి. ఏ జబ్బు లేనట్టే ప్రవర్తించాలి ఏదో ఒక రోజు ప్రశాంతంగా కన్నుమూయాలి అని అంటుంది దీప.నేను కోరుకునేది అదే అని కార్తీక్ అంటాడు.
కార్తీక్: ఏం చేస్తున్నావు
దీప: దోసకాయ పచ్చడి చేస్తున్నాను . హేమచంద్ర అన్నయ్య ద్వారా హిమకు చేరేలా చేస్తాను
కార్తీక్: అక్కడికి పదేపదే వెళ్లొద్దు దీప
దీప: నేను చూసుకుంటాను డాక్టర్ బాబు
తర్వాత కార్తీక్ పేస్ట్ ,బ్రష్ తీసుకుని అక్కడికి వచ్చి పేస్ట్ అయిపోయింది అనడంతో ఇంతకుముందు పేస్ట్ అయిపోయినప్పుడు ఎలా చేసేవారో గుర్తింది కదా ఇప్పుడు కూడా అలాగే చేయండి అంటుంది.
కార్తీక్: రాయితో కొట్టుకుని తీసుకోమంటావా
దీప: అంతే కదా...ఇదేం ఆనందం అని సంతోషంగా మాట్లాడుతుంది దీప
అప్పుడు రాయి కోసం బయటకు వెళ్లిన కార్తీక్ కి...సౌందర్య అంజి కనిపిస్తారు. వాళ్లు చూస్తారేమో అనే కంగారులో ఇంట్లోకి పరుగుతీసి..తాళం తీసుకొచ్చి వేసేస్తాడు. సౌందర్య వాళ్లు అక్కడకు వచ్చి తాళం వేసి ఉండడం చూసి వెనక్కు వెళ్లిపోతారు.
ఈ విషయం తలుచుకుంటూ దీప-కార్తీక్ బాధపడతారు...సమయానికి పండరి కూడా లేకపోవడం మంచిదైందని అంటాడు.
అంజి ఎవరో కాదు..పండరి కొడుకు అని అసలు విషయం దీపకు చెబుతాడు కార్తీక్.
దీప: కొడుక్కి ఎందుకు దూరంగా ఉంది
కార్తీక్: కొడుకు చెడుదారులు తొక్కడంవల్ల ఇంట్లోంచి పంపించేసింది పండరి.
దీప: ఇప్పుడు మారాడు కదా నిజం చెప్పేద్దాం
కార్తీక్: వద్దు దీప..అంజికి చెబితే మన విషయం అమ్మావాళ్లకి తెలిసిపోతుంది..
దీప: ఆ విషయం అంజికి అర్థమయ్యేలా చెబుదాం అంటుంది..
Also Read: గుప్పెడంత మనసులో చెప్పలేనంత అలజడి, రాజీవ్ కి రిషి ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!
ఆ తర్వాత సౌందర్య, అంజి బయట నిల్చుని బాధపడుతుంటారు..ఇంతలో అక్కడకు వస్తుంది చారుశీల.
సౌందర్య: ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు
చారుశీల: నేను ఉండేది ఇక్కడే..మీరేంటి ఇక్కడ
సౌందర్య: నా కొడుకు కోడల్ని వెతుక్కుంటూ వచ్చాను . వాళ్లు కనిపిస్తే చెప్పు
చారుశీల: సరే అని బయటకు చెప్పిన చారుశీల... మనసులో మాత్రం దీప పైకి పోయాక, కార్తీక్ తో నా పెళ్లయ్యాక చెబుతాను అనుకుంటుంది
ఆ తర్వాత దీప వెళ్లి హేమచంద్రని కలుస్తుంది. అత్తయ్యతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఇక్కడకు పిలవండి అన్నయ్యా అని అడుగుతుంది. నాకేమైనా అయితే ఆయన వెళ్లను అంటున్నారు..నేను చెప్పినా వినడం లేదు..కేవలం అత్తయ్య చెబితేనే వింటారు..నాపరిస్థితి ఆవిడ అర్థం చేసుకుంటారని వివరంగా చెబుతుంది దీప... నీ ఆలోచన మంచిదే అన్న హేమచంద్ర ...మరి కార్తీక్ ఏమంటారో అని సందేహం వ్యక్తం చేస్తాడు. ఇదంతా విన్న కార్తీక్..నేను వస్తానని చెప్పినా నువ్వు ఒక్కదానివే వచ్చినప్పుడే నాకు అర్థమైంది దీప అని ఫైర్ అవుతాడు. చావైనా బతుకైనా నీతోనే అని చెప్పాను కదా వెళ్లిపోదాం పద అని తీసుకెళ్లిపోతాడు. హేమచంద్ర నచ్చజెప్పడానికి ప్రయత్నించిన కార్తీక్ వినిపించుకోడు. వెళుతున్నప్పుడు హిమ బయటకు రావడంతో కార్తీక్-దీప దాక్కుంటారు. ఎంతవెతికినా ప్రయోజనం లేదు వెళ్లిపోదామా అని ఆనందరావుతో అంటుంది సౌందర్య. ప్రతి ఇల్లూ వెతుకాను...తాళం వేసి ఉన్న ఇల్లు ఒక్కటీ చూడలేదు..రెండు రోజులు ఉండి అయినా ఆ ఇంట్లో ఎవరున్నారో చూశాకే వెళదాం అంటుంది...
Also Read: కార్తీక్-దీప ఇంటి దగ్గరకు వచ్చిన సౌందర్య, తనని మోనితతో పోల్చుకున్న చారుశీల
హిమకు దోసకాయ పచ్చడి పెడతాడు హేమచంద్ర. అది తిన్న హిమ...తల్లిని తలుచుకుని బాధపడుతుంది. చాటునుంచి చూసిన కార్తీక్, దీప ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత హిమ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్తీక్, దీప బయటికి వస్తారు. చూశావా ఎంత టెన్షన్ పడ్డామో... దీప ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దంటాడు కార్తీక్. అప్పుడు దీప సరే డాక్టర్ బాబు మీరు ఎక్కడికి వెళ్లొద్దండి ఉన్నన్నాళ్ళు నాతోనే సంతోషంగా ఉండండి అని అంటుంది.