By: ABP Desam | Updated at : 03 Jan 2023 09:18 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deepam January 3rd Update (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కార్తీకదీపం జనవరి మంగళవారం 3 ఎపిసోడ్ (Karthika Deepam January 3rd Update)
కార్తీక్ పూజ చేస్తాడు. భగవంతుని ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అని ప్రార్థించలేదు కానీ ప్రస్తుత పరిస్థితులలో నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు దీపని కాపాడు..ఇద్దరం కలసి జీవితాంతం కలసి బతకాలి అని కోరుకుంటాడు. దీప ఎన్నో పూజలు చేసింది ఎన్నో వ్రతాలు చేసింది అయినా కూడా ఎందుకు దీపకు ఇలాంటి పరిస్థితి కలిగించావు. ఆ మాత్రం కనికరం లేదా స్వామి అనుకుంటాడు. హారతి తీసుకుని దీప దగ్గరకు వెళతాడు కార్తీక్. దీప లేచేందుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి అనిపించడంతో పైకి లేవలేక ఇబ్బంది పడతుంది. ఈలోగా కార్తీక్ అక్కడికి రావడంత దీపకు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వు అని హారతి ఇస్తూ ఉండగా ఆ శబ్దానికి దీప నిద్ర లేస్తుంది. అప్పుడు దీప పైకి లేవడానికి ప్రయత్నించగా గుండె నొప్పిగా అనిపించడంతో పైకి లేవలేక పోతుంది. ఎందుకు లేవలేక పోతున్నాను చనిపోయే రోజులు దగ్గరకు వచ్చాయా..ఈ లోగా డాక్టర్ బాబుని వాళ్లింటికి పంపించాలి అనుకుంటుంది. నీకేం కాదు దీప..చావైనా, బతుకైనా నీతోనే అంటాడు కార్తీక్.
Also Read: వసు మెడలో తాళి కట్టిన రిషి- రాజీవ్, దేవయానికి దిమ్మతిరిగే షాక్ !
సౌందర్య-చారుశీల
చారుశీల దగ్గరికి వెళ్లిన సౌందర్య...కార్తీక్ రాసిన ప్రిష్క్రిప్షన్ చూపించి..ఇది కార్తీక్ రైటింగే అనే డౌట్ వచ్చింది అందుకే ఆశగా వచ్చానంటుంది. కాసేపు టెన్షన్ పడిన చారుశీల..ఇది నా రైటింగే అని అబద్ధం చెబుతుంది. ఆ తర్వాత చారుశీల కొంత చనువు తీసుకుని మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తున్నాను ఏమీ ఇబ్బంది లేదుకదా అంటుంది. అలా పిలిచిన ప్రతీసారీ పనికిమాలిన మోనిత గుర్తొస్తుందన్న సౌందర్య..పర్వాలేదు పిలువు అనేసి వెళ్లిపోతుంది.
Also Read: చారుశీల దగ్గర మాట తీసుకున్న దీప- ఇంద్రుడుని క్షమించమని అడిగిన హిమ
ఆనందరావు-సౌందర్య
చారుశీల దగ్గర నుంచి ఇంటికెళ్లిన సౌందర్య..ఆనందరావుతో మాట్లాడుతుంది. కార్తీక్-దీపను వెతకడానికి వెళుతున్నాను ఆనందరావుగారు...దేవుడుని వేడుకోండి అంటుంది. మనమిద్దరం వెళ్ళిపోతే ఆ హిమ సౌర్య ఇద్దరు కొట్టుకుంటారు మీరు ఇంట్లోనే ఉండండని అంటుంది. వాళ్లు ఎప్పటికి కలుస్తారో అని బాధపడతాడు ఆనందరావు. ఇంతలో ఇంద్రుడిని పిలిచి చంద్రమ్మపై ఒట్టు వేయించి నిలదీసి అడుగుతుంది సౌందర్య. ఇంద్రుడు నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా చంద్రమ్మ అడ్డుపడుతుంది. నీకు ఏమీ తెలియదని చెప్పు గండా అంటాడు ఇంద్రుడు. ఆ మాట విని సౌందర్య బాధపడుతుంది.
ఆ తర్వాత అంజి సౌందర్య ఇద్దరు కార్తీక్ వాళ్ళను వెతకడానికి వెళుతూ ఉంటారు. ఎక్కడికి తీసుకెళ్లమంటారని అంజి అడిగితే.. ఊరు మొత్తం కవర్ చేశామా అని అడుగుతుంది. ఊరి చివర కొత్తపేట అనే ఏరియా ఉందని అంజి చెప్పడంతో అక్కడకు వెళతారు. ఈలోగా ఆనందరావు కాల్ చేసి..పిల్లలు కనిపంచారేమో అనిపించింది అందుకే కాల్ చేశానంటాడు. అవునా అయితే అదే జరగాలని కోరుకోండి అని కాల్ కట్ చేస్తుంది సౌందర్య.
నిద్రలేచిన కార్తీక్..దీప కోసం వెతుకుతుండగా దీప వంట చేస్తూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను వంట చేయొద్దని అంటాడు. పండరి ఏది అని అడుగుతాడు.. అదే ఏరియాలో సౌందర్య, అంజి ఇద్దరూ దీప-కార్తీక్ ను వెతుకుతుంటారు. ఏం మాట్లాడొద్దు డాక్టర్ బాబు ఏ పని చేయకుండా నన్ను ఇలాగే మరింత రోగిష్టి దాన్ని చేస్తున్నారని అంటుంది.ఉండేది కొద్దిరోజులే కదా డాక్టర్ బాబు ఉన్నన్ని రోజులైనా నాకు నచ్చినట్టు ఉండనివ్వండి అని బాధగా మాట్లాడుతుంది దీప. కార్తిక్ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. సౌందర్య అంజి ఇద్దరూ దీప వాళ్ళు ఉన్న ఇంటికి దగ్గరలోకి వస్తారు.
Guppedanta Manasu January 28th Update: వసుని సపోర్ట్ చేస్తూ దేవయానికి షాక్ ఇచ్చిన రిషి, చక్రపాణిని మాట వినిపించుకోని జగతి-మహేంద్ర
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
Vishnu Priya Mother Died: యాంకర్ విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం - జీవితాంతం రుణపడి ఉంటా అమ్మా అంటూ భావోద్వేగం
Guppedanta Manasu January 27th Update: చుట్టూ కమ్మే రేయో,మాయో మొత్తం కరగాలి - వసుని మరింత గాయపర్చిన రిషి
Janaki Kalaganaledu January 27th: పరీక్షల్లో ఫెయిలైన జానకి- కొడుకులకి గడ్డి పెట్టిన గోవిందరాజులు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?