By: ABP Desam | Updated at : 02 Jan 2023 11:46 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
వసుని ఎలాగైనా రిషికి దూరం చేయాలని దేవయాని రాజీవ్ తో కలిసి స్కెచ్ వేస్తుంది. అటు ఇంట్లో చక్రపాణి రిషిని కలవనివ్వకుండా చేసేందుకు గదిలో పెట్టి బంధిని చేస్తాడు. వాటర్ బాటిల్ లో విషం కలుపుకుని తాగుతానని బెదిరిస్తాడు. వసు దగ్గర ఫోన్ కూడా లాగేసుకుంటాడు. వసు మాత్రం తల్లి సుమిత్రని తలుపు తియ్యమని ఆయన బెదిరింపులు పట్టించుకోవద్దని బతిమలాడుతుంది. కానీ చక్రపాణి మాత్రం మాటలు కాదు తలుపు తీస్తే నిజంగానే విషం తాగి చస్తాను అని బెదిరిస్తాడు. మరో పక్క ఇంట్లో రాజీవ్ తో బలవంతంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడే రాజీవ్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.
వసు నుంచి ఫోన్ రాకపోయేసరికి రిషి తనకి ఫోన్ చేస్తాడు. సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. రిషి వసు లిఫ్ట్ చేసింది అనుకుని ఇంటికి వస్తున్నా అని ఎవరి పర్మిషన్ అవసరం లేదని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో రిషి వసు మెడలో తాళి వేశాడు. పెళ్లి కూతురుగా ముస్తాబు అయిన వసు దగ్గరకి రిషి వస్తాడు. వసు వెంట వెళ్తున్న సమయంలో రిషి జగతికి నల్లపూసలు బాక్స్ లో పెట్టి ఇస్తుంది. దాన్ని వసుకి ఇవ్వమని చెప్తుంది. వసు ఆ బాక్స్ లోని నల్లపూసలు రిషి చేతికి అందిస్తుంది. దాన్ని తీసుకుని వసు మెడలో వేస్తాడు. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ‘ఈ వసుధార మీది సర్’ అని వసు రిషిని ప్రేమగా కౌగలించుకుంటుంది.
Guppedantha Manasu - Promo | 2nd Jan 2023| Mon-Sat at 7 pm Only on #StarMaa #StarMaaSerials #GuppedanthaManasu pic.twitter.com/FEVcVer1Dy
— starmaa (@StarMaa) January 2, 2023
నిన్నటి ఎపిసోడ్లో..
రాజీవ్ కి చక్రపాణి ఫోన్ చేస్తాడు. పరువు, కుటుంబాన్ని కాపాడాలని చక్రపాణి రాజీవ్ ని అడుగుతాడు. చక్రపాణి మాట్లాడిన విషయాలను మహేంద్రతో జగతి చెప్తుంది. ఈ విషయం రిషికి చెప్దామని మహేంద్ర అంటాడు. జగతి మాత్రం వద్దని అంటుంది. వసు పరిస్థితి ఎలా ఉందో ముందు మనం అక్కడికి వెళ్దాం. ఇంట్లో తెలియకుండా వెళ్ళాలి అని జగతి అంటుంది. వదినకి అనుమానం వస్తుందేమో అని మహేంద్ర అంటాడు. కానీ జగతి మాత్రం వెళ్ళాలి మనం వచ్చే దాకా బావగారు ఇంట్లోనే ఉంటారు, మనం వెళ్తే అక్కడి పరిస్థితి సరి చెయ్యొచ్చు కదా అని అంటుంది. ఆ మాటలు అన్నీ దేవయాని వింటుంది. ఇంత ప్లాన్ చేస్తావా అని దేవయాని రాజీవ్ కి కాల్ చేస్తుంది. రిషి కోసం జగతి, మహేంద్ర వాళ్ళు అక్కడికి వస్తున్నట్టు చెప్తుంది.
రాజీవ్ తో వసుకి పెళ్లి చేస్తున్నా అని చక్రపాణి చెప్తాడు. ఆ మాట విని వసు, సుమిత్ర షాక్ అవుతారు. రిషి సార్ ని పెళ్లి చేసుకుంటాను అని వసు అంటుంది. కానీ చక్రపాణి మాత్రం తన మాట వినకపోతే విషం తాగి చస్తాను అని బెదిరిస్తాడు. సుమిత్ర ఏమి చేయలేక ఏడుస్తుంది. చక్రపాణి ఇంట్లో పెళ్లికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. వసు అది చూసి తలుపు తియ్యమని వేడుకుంటుంది. కానీ వసు తండ్రి మాత్రం సుమిత్రని బెదిరిస్తూనే ఉంటాడు. అప్పుడే వసుకి ఫోన్ వస్తుంది. కానీ చక్రపాణి మాత్రం ఫోన్ ఇవ్వను అని చిరాకు పెట్టిస్తాడు. రిషి ఫోన్ సుమిత్ర లిఫ్ట్ చేసి స్పీకర్ అణ్ చేస్తుంది. రిషి కంగారుగా ‘ఏం జరుగుతుంది, మీ బావ వచ్చి ఏదేదో వాగి నీకు తనకి పెళ్లి అని అంటున్నాడు. నేను వస్తున్నాను, భయపడకు మా వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ బావ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతాడు. అందుకే నువ్వు వద్దన్నా ఎన్ను ఇంటికి వస్తున్నా’ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. రాజీవ్ పంతుల్ని తీసుకుని ఇంట్లో అడుగుపెడతాడు. పెళ్లి ఏర్పాట్లు చూసి రాజీవ్ నవ్వుకుంటాడు. మీరు ఇంత కష్టపడి పెళ్లి చేస్తున్నారని చూసి సంబరపడతాడు.
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!
HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్డే సర్ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?