Guppedanta Manasu January 3rd Update:గుప్పెడంత మనసులో చెప్పలేనంత అలజడి, రాజీవ్ కి రిషి ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!
Guppedantha Manasu January 3rd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు జనవరి 3 మంగళవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 3rd Update)
జగతి ఇచ్చిన నల్లపూసలు చేతిలోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార..అప్పుడే అక్కడ రిషి ప్రత్యక్షమవుతాడు... ఆ నల్లపూసలు చేతికి అందించడంతో రిషి ఆనందంగా వసు మెళ్లో వేస్తాడు. ఈ వసుధార ఎప్పటికీ మీదే సార్ అంటూ రిషి ని హగ్ చేసుకుంటుంది వసుధార... సోమవారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది..అయితే రూమ్ లో బంధీగా ఉన్న వసుధార దగ్గరకు రిషి అంత ఈజీగా రావడం జరగదు కాబట్టి..ఇదంతా వసుధార కలే అన్నది క్లారిటీ వచ్చినట్టే. మంగళవారం ఎపిసోడ్ లో వసుధార పెళ్లి గురించే హడావుడి జరుగుతోంది. రాజీవ్ కి ఇచ్చి కట్టబెట్టేందుకు చక్రపాణి సిద్ధంగా ఉన్నాడు...వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ రిషి బయలుదేరాడు...మరోవైపు ఏం జరుగుతోందో అర్థంకాక కంగారుగా వస్తున్నారు మహేంద్ర, జగతి...మొత్తానికి తల్లిదండ్రుల చేతులమీదుగా..రిషి-వసు పెళ్లిజరుగడం పక్కా అన్నది అర్థమవుతోంది. మరి ముక్కోపి అయిన వసుధార తండ్రి చక్రపాణి రియాక్షన్ ఎలా ఉండబోతోంది... దేవయాని సంధించిన బాణం రాజీవ్ తగ్గుతాడా...ఏం జరుగుతుందో అని గుప్పెడంతమనసు సీరియల్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు...
Also Read: కార్తీక్-దీప ఇంటి దగ్గరకు వచ్చిన సౌందర్య, తనని మోనితతో పోల్చుకున్న చారుశీల
సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
రిషి కాల్ చేసి వస్తున్నా అని చెప్పిన విషయం చక్రపాణి...రాజీవ్ తో చెబుతాడు. ముహూర్తం టైమ్ కన్నా ముందే వచ్చేలా ఉన్నాడు..ఈ పెళ్లిజరుగుతుందో లేదో అనే టెన్షన్ ఉందన్న చక్రపాణితో...నేను వసుతో మాట్లాడి వస్తానంటాడు రాజీవ్. వసుధార రూమ్ లోకి వెళుతున్న రాజీవ్ ని పిలిచి..ఈ పెళ్లిచీర మీ చేత్తో ఇవ్వండి అల్లుడుగారు అని ఇస్తాడు చక్రపాణి. ఆ తర్వాత రాజీవ్ వసుధార రూమ్ కి వెళ్లి చేయి పట్టుకోవడంతో విసురుగా విదిలించుకుంటుంది.
రాజీవ్: మరికొద్ది సేపట్లో మనిద్దరం భార్యాభర్తలు కాబోతున్నాం..ఇంకా బావా ఏంటి.. ప్రేమగా ఏవండీ అని పిలువు అని మాట్లాడుతుండడంతో వసుధార అసహ్యించుకుంటుంది. మనిద్దరికీ శుభవార్త ఏంటంటే మీ అక్క కొడుకు ఉన్నాడు కదా అదే నా కొడుకు వాడిని మనిద్దరం ప్రేమగా చూసుకుని మంచి చదువులు చదివిద్దాం. నీ పెంపకంలో వాడు ఇంకా మంచివాడు అవుతాడు
వసుధార: బావ మర్యాదగా బయటకు వెళ్ళు అని అరుస్తుంది
రాజీవ్: నువ్వు మీ రిషి సార్ చట్టా పట్టాలేసుకొని తిరిగినవన్నీ ఇందులో రికార్డ్ చేసి పెట్టాను అంతేకాదు ప్రెస్ వాళ్లకు మీడియా వాళ్లకు కొన్ని కాపీలు కూడా పంపించాను...నన్ను పెళ్లి చేసుకోను అంటే మీడియా వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారు ఆ ఫోటోలని టెలికాస్ట్ చేస్తారు అనడంతో వసుధార షాక్ అవుతుంది. మీడియా వాళ్ళు ఇంటికి వస్తే మీ నాన్న పరువు పోతుంది అప్పుడు మీ నాన్న ఉరేసుకుని చచ్చిపోతాడు. అప్పుడు మీ అమ్మ కూడా పోతుంది . నీకున్న ఒక అక్క చచ్చిపోయింది ఇంకొక అక్క కష్టాలు పడుతోంది నీ తమ్ముడు హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నాడు ఇక నీ బాగోగులు ఎవరు చూసుకుంటారు నేనే కదా
వసు: నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ బావ నువ్వు ఎంత భయపెట్టినా నేను భయపడను
రాజీవ్: నీకు భయం లేదని ధైర్యం ఎక్కువ ఉందని నాకు కూడా తెలుసు అంటూ తన జేబులో నుంచి గన్ను తీసి..దీనినీ కూడా వాడాలని డిసైడ్ చేసుకున్నాను. మనం భార్యాభర్తలమే కదా మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఈ గన్ను చివరిసారిగా ఎప్పుడూ వాడానో తెలుసా ఒకరోజు మీ జగతి మేడంని షూట్ చేశారు కదా అది ఎవరో కాదు నేనే...ఇప్పుడు కూడా నాతో పెళ్లికి ఒప్పుకోకుంటే రిషి సార్ ని, జగతి మేడంని, మహేంద్ర సార్ ని, ఆ తర్వాత మీ అమ్మానాన్నని చంపేస్తానని బెదిరించి వెళ్లిపోతాడు..
ఆ తర్వాత వసుధార పెళ్లికూతురుగా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. రాజీవ్ అన్నమాటలు తలుచుకుంటుంది..రిషి తొడిగిన ఉంగరం చూసుకుని..జగతి మేడం ఇచ్చిన నల్లపూసలు తీసి చేత్తో పట్టుకుంటుంది. ఎదురుగా ఉన్న రిషి..ఆ నల్లపూసలు తీసి వసుమెడలో వేసినట్టు చూపించారు...
(....దీనికి కొనసాగింపే పైన ఉన్న ప్రోమో...)
lso Read: వసు మెడలో తాళి కట్టిన రిషి- రాజీవ్, దేవయానికి దిమ్మతిరిగే షాక్ !