2023 లో ఈ రాశులవారికి సక్సెస్ ఇంటిపేరుగా మారిపోతుంది
నవగ్రహాలు…జాతకాన్ని నిర్దేశించే గ్రహాలు. అందులో గురు గ్రహం (బృహస్పతి) అతి ప్రధానమైనది. దీని ప్రభావంతో జీవితంలో పలు కార్యాలను సులభంగా జయించవచ్చు. గురువు బాగుంటే అన్ని బాగున్నట్లే అంటారు.
విద్య, ఉపాధి, ఉద్యోగం, వివాహం, సంతానానికి సంబంధించిన తీరాలంటే గురుగ్రహ సంచారం బావుండాలి. బృహస్పతి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త ఏడాదిలో బృహస్పతి ఆశీస్సులు పుష్కలంగా ఉండే రాశులేంటంటే...
మిధున రాశి కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలకు కొత్త ఏడాదిలో ఉపశమనం లభించబోతోంది. తలపెట్టిన ప్రతిపనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారం బాగాసాగుతుంది, పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలరు.
కర్కాటక రాశి నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న ఈ రాశివారికి 2023 బాగా కలిసొస్తుంది. నూతన పెట్టుబడులు ధైర్యంగా పెట్టొచ్చు. ఆర్థికపరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. ఇంటిని కొనుగోలు చేయాలని, దాన్ని పునర్నిర్మించాలి అనుకున్నవారికి శుభసమయం.
కన్యా రాశి ఈ రాశివారికి వివాహానికి సంబంధించి ఉన్న సమస్యలు 2023లో తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..అందుకుగల మార్గాలు అన్వేషించడంలో సక్సెస్ అవుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అవివాహితులు పెళ్లిచేసుకుంటారు.
ధనుస్సు రాశి 2022 తో పోల్చుకుంటే 2023లో ధనస్సు రాశివారి కెరీర్ మెరుగుపడుతుంది. మీ తెలివితేటల ద్వారా మీరు పెద్ద లాభాలను పొందుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వివాదాలకు ముగింపు పలికేందుకు ఇదే మంచి సమయం.
మీన రాశి మీ లక్ష్యాలను సాధించడంలో సక్సెస్ అవుతారు. కొత్త కంపెనీలలో చేరాలి అనుకునేవారికి అనుకూలమైన సమయం. విదేశీ వ్యవహారాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది. ఆర్థిక, దీర్ఘకాలిక ప్రణాళికపై మీ దృక్పథం మెరుగ్గా మారుతుంది. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది.
నోట్:ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు