Karthika Deepam January 17th Update: సైకో మోనితకు హిమ రూపంలో మరో అవకాశం, మళ్లీ మాయలో పడిపోయిన సౌందర్య, కార్తీక్
కార్తీకదీపం జనవరి 17 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...
కార్తీకదీపం జనవరి 17 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam January 17th Update)
దీప తండ్రి పిల్లలను దీప కార్తీక్ లను చూసి ఇప్పటికీ ఇదంతా నిజమా కల అన్నట్టుగా ఉంది అంటాడు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు ఎందుకు రాలేదు అని అడుగుతుండగా ఇంతలో భాగ్యం అక్కడికి వచ్చి ఇంకా అదే మాట్లాడుతున్నారా కూతురు అల్లుడు వచ్చారు కదా అది చాలు అవన్నీ వద్దులేండి వదిలేసేయండి ఇదిగో ఈ పాయసం తినండి అని అంటుంది. అప్పుడు భాగ్యం భర్త భాగ్యం నువ్వేనా ఎప్పుడూ అర్థ కప్పుతో పాయసం చేసి దాన్ని ఇంటి అందరికి పెట్టేదానివి ఇప్పుడు పాయసం కప్పుల్లో అందరికీ ఇచ్చావు అనగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఈ సంతోషంలో ఊరందరికీ చేసి పెడదాం అనుకున్నాను కానీ నువ్వు షాక్ అవుతావని నేను ఇవ్వలేదు అంటుంది భాగ్యం. అప్పుడు వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
Also Read: సౌందర్యకి నిజం చెప్పిన మోనిత- కార్తీక్ కి రెండో పెళ్లి చేస్తానన్న దీప
సౌందర్య డాక్టర్ తో ఫోన్ మాట్లాడుతూ దీప బతికే అవకాశాలు లేవా అనగా గుండె మార్పిడి చేస్తే బతికే అవకాశాలు ఉంటాయి మేడం అనడంతో గుండె ఎవరు ఇస్తారు డాక్టర్ అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే మోనిత అక్కడికి వచ్చి సౌందర్య చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటుంది.
సౌందర్య: ఏంటే నువ్వు ఫోన్ ఇలా ఇవ్వు
మోనిత: ఎందుకు ఆంటీ ఆవేశపడతారు మీ కొడుకే గొప్ప కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ అని చెప్పుకుంటారు మరి కార్తీక్ తెలియనప్పుడు ఇంకెవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పండి. మీ కొడుకే దీప విషయంలో చేతులెత్తేశాడు .దీప మీకు దూరమవుతుందని ఒక్క కారణంతోనే వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడికి రాకుండా ఉన్నారు . మీ కోడల్ని కాపాడేది నేను ఒక్కదాన్నే ఆంటీ
సౌందర్య: నువ్వా
మోనిత: నేను కార్తీక్ కి ఆల్రెడీ దీప విషయం గురించి చెప్పాను. నేను గుండె ఇస్తాను అన్నాను కార్తీక్ వినడం లేదు
సౌందర్య: నిజమే నువ్వు విషం లాంటి దానివి ఔషధం అవుతుంది అంటే ఎలా నమ్మాలి
మోనిత: దీప బతకాలంటే నేను చావాలి ఆంటీ
సౌందర్య: అవునే నిజంగా నువ్వు ఎప్పుడో చచ్చి ఉంటే దీప ఈపాటికి లక్షణంగా ఆనందంగా బతికి ఉండేది. ఒకవేళ నిజంగానే దీప నీ మూలంగా బతుకుతుంది అంటే నిన్ను చంపేసి దీపకి నేను గుండె మార్పిడి చేయిస్తాను
మోనిత: నేనే చనిపోతాను అంటున్నాను కదా ఆంటీ మళ్లీ మీరు నన్ను చంపడం ఏంటి ...కానీ నాకు ఒక ఆఖరి కోరిక ఉంది. మీ కొడుకుతో నాకు పెళ్లి చేయండి నా గుండె దీపకు ఇచ్చి తృప్తిగా చనిపోతాను అనడంతో సౌందర్య షాక్ అవుతుంది. నమ్మండి ఆంటీ
సౌందర్య: చాలు ఆపవే నీ నాటకాలు . ఇలాంటి పనికిమాలిన ప్రపోజల్ తో ఎప్పుడూ నా ఇంటికి రావద్దు వెళ్ళు అని సీరియస్ అవ్వడంతో మోనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి రావడంతో అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సౌందర్య దీప రిపోర్ట్స్ చూసి కార్తీక్ నిలదీయడంతో కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు కార్తీక్ ఏడుస్తూ ఈ కారణంతోనే మమ్మీ మేము తప్పించుకొని తిరిగాము అని ఏడుస్తూ ఉండగా సౌందర్య కూడా ఎమోషనల్ అవుతుంది. ఎంతోమందికి ఆపరేషన్ చేసిన నేను నా భార్యని నేను బతికించుకోలేకపోతున్నాను ఇదే రాత మమ్మీ అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు సౌందర్య కార్తీక్ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. మోనిత మాటలుతల్చుకుంటారు.
Also Read: రిషి నిర్ణయం విని షాకైన దేవయాని- వసు ప్రేమని అంగీకరించి పెళ్లిచేసుకోమన్న చక్రపాణి
మరోవైపు శౌర్య,హిమ ఇద్దరూ పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దీప వస్తుంది. అప్పుడు పిల్లలిద్దరూ రామ్మా కలిసి డాన్స్ చేద్దాం అంటూ దీపను బలవంతంగా లాక్కెళతారు. అప్పుడు దీప హిమ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు సౌందర్య అక్కడికి వచ్చి దీప అని గట్టిగా అరిచి ఇప్పుడు ఈ డ్యాన్సులు అవసరమా అంటుంది. ఏమైంది నానమ్మా అని పిల్లలు అడగడంతో సౌందర్య...మాట దాటవేస్తుంది. ఆ తర్వాత దీప వంటచేస్తానంటే..వద్దంటుంది సౌందర్య. ఆ తర్వాత డాక్టర్ బాబు ఏమైందని దీప అడిగితే..మమ్మీకి ఎలా తెలుస్తుందని అబద్ధాలు చెబుతాడు. ఎప్పటికి నిజం తెలియకూడదు డాక్టర్ బాబు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దీప కార్తీక్ ల మాటలు విన్న హిమ ఏదో జరుగుతోందే ఆలోచనలో పడుతుంది.
మరొకవైపు మోనిత ఈ ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా లేవని ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో హిమ సౌందర్య మొబైల్ నుంచి మోనిత ఫోన్ చేస్తుంది. మా అమ్మ వాళ్ళు ఏదో సీక్రెట్ అంటున్నారు ఏదైనా నిజం దాస్తున్నారు నాకు చెప్పండి ఆంటీ ప్లీజ్ ఆంటీ వినడంతో వద్దులేమా నువ్వు చిన్న పిల్లవి అని అంటుంది మోనిత. వద్దులే హిమ తలచుకుంటే నాకే ఏడుపు వస్తోంది నువ్వు చెబితే నువ్వు తట్టుకోలేవు అనడంతో హిమ ఏడుస్తూ ఆంటీ ప్లీజ్ ఆంటీ ఏంటో చెప్పండి అంటుంది. అప్పుడు మోనిత...కావాలనే sorry హిమా నా వల్లకాదని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. అప్పుడు ఫోన్ కట్ చేసిన మోనిత ఆ ఇంట్లో ఎవరు దొరుకుతారా అనుకుంటున్నాను ఈ పిల్ల దొరికింది అనుకుంటుంది.