అన్వేషించండి

Karthika Deepam December 28th Update: కార్తీక్ ను దూరం చేసుకునేందుకు సిద్ధపడిన దీప, ఇంద్రుడి కాలర్ పట్టుకున్న సౌందర్య!

కార్తీకదీపం డిసెంబరు 28 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam  December 28th  Episode 1548 (కార్తీకదీపం డిసెంబరు 28ఎపిసోడ్)

దీపకు గుండెనొప్పి వచ్చి పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళతాడు కార్తీక్. చారుశీలకు ఫోన్ చేస్తాడు. అది విని చారుశీల క్రూరంగా నవ్వుకుంటుంది. 
చారుశీల: నేను అనుకున్నదే జరిగింది ఈ చారుశీల అంచనాలు ఎప్పుడూ తప్పవు అనుకున్న విధంగానే దీపకి హార్ట్ స్టోక్ వచ్చింది. మోనిత మేడం మీరు అనుకున్నది అన్ని సంవత్సరాలుగా చేయలేనిది నేను రెండు రోజుల్లో చేశాను. రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తాను జైల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అనుకుంటూ ఉంటుంది. 
ఇంతలోనే కార్తీక్ దీపని హాస్పిటల్ కి తీసుకొస్తాడు. అప్పుడు చారుశీల దీపని చెక్ చేస్తూ నేను ఒకేసారి పైకి పంపియచ్చు కానీ నీ మొగుడు డాక్టర్ కదా అందుకే స్లోగా పైకి పంపించేస్తాను అనుకుంటుంది. కార్తీక్ అక్కడికి వచ్చి...మొన్ననే ఆపరేషన్ జరిగింది ఇలా స్ట్రోక్ ఎందుకు వచ్చింది అర్థం కావడం లేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు చారుశీల కావాలనే దీపం ముందు గుండె ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు అయ్యాయి గుండె దొరుకుతుంది అని మాట్లాడుతుంటుంది.. దీప వింటుంది మాట్లాడొద్దని కార్తీక్ సైగచేస్తాడు..కానీ దీప మత్తులో ఉందని అబద్ధం చెప్పి కావాలనే దీపకు తెలిసేలా కొన్ని రోజుల్లో చనిపోతుందని మాట్లాడుతుంది.
కార్తీక్: నన్ను పెళ్లిచేసుకుని సంతోషంగా ఉన్న రోజులు వేళ్లపై లెక్కపెట్టొచ్చు.. ఓ డాక్టర్ ని అయి ఉండి ఆ మోనిత ఇచ్చిన తప్పుడు రిపోర్ట్స నమ్మాను... తన పిల్లలు నా పిల్లలు కారని అనుమానించి పదేళ్లు దూరం పెట్టాను...
చారుశీల: ఇప్పుడు చేస్తున్నది కూడా అదే కార్తీక్...అప్పుడు మోనిత ఇచ్చిన రిపోర్ట్స్ ని నమ్మావు. ఇప్పుడు నేను ఇచ్చిన రిపోర్ట్స్ నమ్మావు నువ్వు మంచి వాడివి కార్తీక్ అనుకుంటూ ఉంటుంది.
కార్తీక్: యాక్సిడెంట్లో గతం గుర్తు లేక ఎన్నో రోజులు బాధపడ్డాను గతం గుర్తుకు వచ్చిన తర్వాత సంతోషంగా ఉందాము అనుకుంటే తనకు ఇలా జరిగింది . నా దీపను కాపాడుకోవడానికి నా ప్రాణాలు ఇచ్చిన తక్కువే అని కార్తీక్ ఎమోషనల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
చారుశీల: నీ పిచ్చి కాకపోతే దీప మత్తులో లేదు మెలకువ లోనే ఉంది అనుకుంటుంది..అప్పడు దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. 

Also Read: శాడిస్ట్ తండ్రి, సైకో బావ మధ్యలో వసుధార, రిషి ఏం చేయబోతున్నాడు!

సౌందర్య కాఫీ తాగుతూ ఉండగా ఇంతలోనే శౌర్య అక్కడికి వచ్చి కార్తీక్ రాసి ఇచ్చిన మందు స్లిప్పు చూపించడంతో అది చూసి ఇది మీ నాన్న చేతిరాత అయితే ఎవరు రాసిచ్చారు అని సంతోషపడుతుంది. చారుశీల మేడం రాసిచ్చింది అని అంటుంది. అప్పుడు హిమ అక్కడికి వచ్చి  కచ్చితంగా డాడీ చేతిరాతే అని అంటుంది.అప్పుడు శౌర్య అది చారుశీల మేడం ది అనడంతో హిమ కోప్పడి కాదు ఇది కచ్చితంగా డాడీదే అని వాళ్ళిద్దరు పోట్లాడుకుంటారు...
అప్పుడు సౌందర్య..ఇంద్రుడిని పిలిచి నీకు ఎవరిచ్చారని నిలదీస్తుంది. చారుశీల మేడమ్ అని ఇంద్రుడు కవర్ చేయడంతో..  సరే నీతోపని ఉంది పద బయటకు వెళదాం అంటుంది సౌందర్య. అప్పుడు ఇంద్రుడు బయటికి వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. చంద్రమ్మ వచ్చి..నీనుంచి నిజం తెలుసుకోవడానికి ఆవిడ తీసుకెళుతోంది అర్థమవుతోందా అంటుంది. 

మరోవైపు దీపని కార్తీక్ ఇంటికి తీసుకెళ్తాడు. నువ్వేం భయపడకు ఇక ఎలాంటి సమస్యలు రావని సర్దిచెప్పేందుకు ప్రయత్నించడంతో దీప అలాగే చూస్తూ ఉంటుంది. 
దీప: హాస్పిటల్ లో జరిగిన డిస్కషన్ గుర్తుచేసుకుని నిజంగా నాకేం కాదా డాక్టర్ బాబు.. హార్ట్ స్టోక్ ఎందుకు వచ్చింది 
కార్తీక్ : అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు.
దీప: నిన్నటి వరకు మీకు ఏమవుతుందో అని ఈ గుండె కొట్టుకుంది ఈరోజు నా ప్రాణాలే పోతాయని తెలిసిన తర్వాత ఈ గుండె విశ్రాంతి తీసుకుంటుంది కానీ మిమ్మల్ని విడిచి వెళ్లిపోతాను అన్న బాధ ఒకటి మనసులో ఉంది అనుకుంటుంది
ఇంతలో పండరి అక్కడికి నీళ్లు తీసుకొని వస్తుంది. అప్పుడు దీప రేపటి నుంచి నేనే వంట చేస్తాను అనడంతో  కార్తీక్ వద్దు అంటాడు. చేయనివ్వండి సారు భర్తకు ఇలా అవుతుందని తెలిసాక ప్రేమతో వండి పెట్టాలని అనుకుంటుంది కదా అని చెబుతుంది. అప్పుడు వద్దు అని కార్తీక్ గట్టిగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప జరిగిన విషయాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఉన్నన్ని రోజులు నా భర్తను సంతోషంగా చూసుకోవాలి అనుకుంటుంది

Also Read: మోనిత, చారుశీల ప్లాన్ సక్సెస్ - దీపకు గుండెపోటు, హిమ మాటనమ్మని శౌర్య!

ఇంద్రుడు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నాడని సౌందర్యకి అనుమానం వస్తుంది. ఇంతలో ఇంద్రుడు అక్కడికి రావడంతో చిన్నప్పటి నుంచి నా కొడుకుని చూస్తున్నాను నా కొడుకుని చేతిరాత నేను గుర్తుపట్టలేనా అనడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ ప్రిస్క్రిప్షన్ రాసిందే నా కొడుకే అని అంటుంది సౌందర్య. కాకపోతే నాకు ఒక డౌట్ వాళ్ళు మా నుంచి తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నారు అని సౌందర్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సౌందర్య ఇంద్రుడు కాలర్ పట్టుకుని నాటకాలు నా దగ్గర ఆడొద్దు నీకు అన్ని విషయాలు తెలుసు అని నాకు తెలుసు ఇప్పుడు ఇంద్రుడు బుకాయిస్తూ పట్టుకుని అడిగినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి ఉన్నారని ఎలా చెప్పాలి అనడంతో వాళ్లు బతికే ఉన్నారు అని గట్టిగా చెబుతుంది సౌందర్య.

రేపటి( గురువారం) ఎపిసోడ్ లో 
సౌందర్య, ఆనందరావు,పిల్లల్ని చూసి దీప బాధపడుతుంది. మన బతుకు ఇలా ఉందంటని బాధపడుతుంది దీప. మీరు నన్ను వదిలేసి అత్తయ్య వాళ్ల దగ్గరకి వెళ్లిపోండిఅంటుంది... నా ప్రాణాలు పోతాయని మీరు అబద్ధం చెప్పారని నాకు తెలుసు.. అత్తయ్య వాళ్లు వెళ్లిపోతున్నారు వెళ్లండి అని అంటుంది..దీప మాటలు విని కార్తీక్ షాక్ అవుతాడు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget