అన్వేషించండి

Karthika Deepam December 27th Update: మోనిత, చారుశీల ప్లాన్ సక్సెస్ - దీపకు గుండెపోటు, హిమ మాటనమ్మని శౌర్య!

కార్తీకదీపం డిసెంబరు 27 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam  December 27th  Episode 1547 (కార్తీకదీపం డిసెంబరు 27ఎపిసోడ్)

దీపకు ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయో లేదో...ఫోన్ చేయాలి అనుకుంటుండగా పండరి అక్కడికి వస్తుంది.
చారుశీల: దీపకు మందులు ఇస్తున్నావా లేదా
పండరి: పొద్దున్న కాఫీలో కలిపి ఇచ్చాను, ఆ తర్వాత దోశల్లో కలిపి ఇచ్చాను కానీ గుండెల్లో మంట అనగానే భయం వేస్తోంది. మందులు వాడితే తగ్గాలి కదా మరి మంట ఎందుకు వచ్చింది
చారుశీల: అలా వచ్చి అలా పోతుంది..లేదంటే ఇంకా ఇబ్బంది అయ్యేది. కార్తీక్ కి చెప్పిందా..
పండరి: చెప్పారమ్మా..ఏదో ఎసిడిటీ అని ఊరుకున్నారు
చారుశీల: పండరి వెళ్లిపోగానే...గుండెల్లో మంట అనగానే పరిగెత్తుకు వచ్చేసింది..ఆ గుండె ఆగిపోతే ఏమైపోతుందో అని నవ్వుకుంటుంది

మరోవైపు సౌందర్య, ఆనంద్ రావు..దీప కార్తీక్ ని వెతుకుతుంటారు. 
సౌందర్య: గుళ్ళు హాస్పిటల్ మొత్తం అన్ని వెతికాను ఎక్కడా కనిపించడం లేదు .ఇదే ఊర్లో ఉన్నారో లేదో
ఆనందరావు:మనకు కనిపించకుండా దాక్కుంటున్నారేమో
సౌందర్య: అలా మాట్లాడకండి నాకు ఆ మాటలు వింటుంటే చాలా భయంగా ఉంది..అయినా వాళ్లు కచ్చితంగా కనిపిస్తారు
ఆనంద్ రావు: నాకెందుకో మన చుట్టూ ఉన్న వారిపై అనుమానం వస్తోంది నిజం తెలిసి కూడా మన దగ్గర నిజం చేస్తున్నారేమో అనిపిస్తోంది
సౌందర్య: నాక్కూడా అలాగే అనిపిస్తోంది 

Also Read: వసుని ఇంట్లోంచి పొమ్మన్న తండ్రి చక్రపాణి, రిషికి అబద్ధాలు చెప్పిన వసుధార

మరోవైపు దీప,కార్తీక్, ఇంద్రుడు ఒకచోట కలుసుకుంటారు. అప్పుడు దీప నీ గురించి చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇంద్రుడు మా బిడ్డను మాకు ఇవ్వడం ఇష్టం లేక ఇలా ఊర్లు తిరుగుతున్నావు అనుకున్నాను. కానీ మా కంటే బాగా చూసుకుంటున్నావు. నీ రుణం తీర్చుకోలేము అనగానే అలాంటి పెద్ద మాటలు ఎందుకమ్మా అంటాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు  నీ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉందమ్మా దీప కండిషన్ గురించి మాట్లాడుతూ ఉండగా కార్తీక్ చెప్పొద్దు అని సైగ చేస్తాడు. 
దీప: శౌర్య వాళ్ళ నాన్నమ్మ తాతయ్యల దగ్గర ఉంటే బాగుండేది 
ఇంద్రుడు: ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉందమ్మా అని అంటాడు ఇంద్రుడు.
దీప:ఏం మాట్లాడుతున్నావ్ ఇంద్రుడు 
ఇంద్రుడు:అవును సార్ నిన్ననే మీ అమ్మానాన్న వాళ్ళు వచ్చారు మేమందరం ఒకటే ఇంట్లో ఉన్నాం పెద్ద ఇల్లు తీసుకున్నారు వాళ్ళు జ్వాలమ్మ కోసం ఇక్కడికే వచ్చేశారు 
దీప, కార్తీక్ షాక్ అవుతారు..దీప సంతోష పడుతూ ఉంటుంది. హిమ కూడా వచ్చిందా అని దీప అడగగా వచ్చింది అనడంతో డాక్టర్ బాబు నేను హిమను చూడాలి అని అంటుంది దీప.

Also Read: కార్తీక్-దీపను చూసేసిన హిమ, మోనిత కళ్లలో ఆనందం కోసం చారుశీల అరాచకం

హిమ: శౌర్య గురించి ఆలోచిస్తూ అమ్మానాన్నలు బతికే ఉన్నారు అంటోంది కానీ వాళ్ళు కనిపించడం లేదనుకుంటూ ఉంటుంది. అమ్మ నాన్న నేను కూడా వెతుకుతాను అనుకుంటూ ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది హిమ. ఎలా అయినా అమ్మానాన్నలను వెతికి శౌర్య ముందు నిలబెట్టి నాతో మాట్లాడించేలా చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. 
శౌర్యని ఎలా అయితే చూపించావో మా అత్తమ్మ, మావయ్య, హిమని కూడా అలాగే చూపించాలని అడుగుతుంది దీప... అప్పుడు అదే రూట్లో వస్తుంటుంది హిమ. ఇంద్రుడు చూసి హిమ వస్తోందని చెబుతుంది. నా బిడ్డ అని దీప అరుస్తూ ఉండగా కార్తీక్ ఆపుతాడు. అప్పుడు కార్తీక్...దీపను లాక్కెళ్లడం చూస్తుంది హిమ. అమ్మ డాడీ అని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లగా అక్కడ వాళ్ళు లేకపోవడంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ దీప వాళ్ళు హిమ వెనక చెట్టు చాటున దాక్కొని హిమను ఏడుస్తుంటే చూసి బాధపడుతూ ఉంటారు. 
దీప : కళ్ళ ముందు బిడ్డ నాకోసం ఆరాటపడుతున్నా దగ్గరకు కూడా తీసుకోలేకపోతున్నానే ఎందుకు నాకు ఈ బతుకు డాక్టర్ బాబు అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది.

మరొకవైపు చారుశీల, పండరీకి ఫోన్ చేసి దీప హెల్త్ గురించి అడుగుతూ ఉంటుంది. ఈపాటికి దీపకు గుండెపోటు రావాలి కదా ఇంకా కాల్ రావడం లేదేంటి అనుకుంటూ ఉంటుంది చారుశీల. ఇప్పుడు గుండెపోటు రాకపోతే పండరిని డోస్ పెంచమని చెప్పాలి అనుకుంటుంది. 

 హిమ ఇంటికి వెళ్లి నానమ్మ తాతయ్య అందరూ కిందికి రండి అని గట్టిగా అరుస్తుంది. ఇప్పుడే అమ్మ నాన్నలను చూశాను అనడంతో సౌందర్య ఆనందరావు సంతోషపడతారు. కానీ శౌర్య మాత్రం హిమ మాటలను నమ్మొద్దు..అంతా అబద్ధం అని అరుస్తుంది.  అంతలోనే కనిపించి అంతలోనే మాయం అవుతారా చూశావా బాబాయ్ హిమకి అమ్మానాన్నలు కనిపించారంట జోక్ చేస్తోంది అనడంతో జోకు కాదు అమ్మ నిజంగానే చూసింది అనుకుంటూ ఉంటాడు ఇంద్రుడు. అప్పుడు హిమ ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించిన శౌర్య పొగరుగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నాన్నలు ఉన్నారని అబద్దం చెబితే నేను తనతో మాట్లాడుతానని అబద్ధాలు చెబుతోంది తాతయ్య అని అంటుంది శౌర్య. వాళ్లు బతికే ఉన్నారని కాదు హిమ వాళ్ళను నువ్వు నిజంగానే నీతో పాటు పిలుచుకొని వచ్చినా నేను నీతో మాట్లాడను అనడంతో అందరూ షాక్ అవుతారు. 

మరోవైపు దీప కు హార్ట్ స్ట్రోక్ రావడంతో కార్తీక్ హాస్పిటల్ కి తీసుకెళతాడు. పండరీ దీప ని చూసి భయపడుతూ ఉంటుంది...కార్తీక్ టెన్షన్ పడతాడు

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
దీప ఆరోగ్యం నిలకడగా ఉంది..హార్ట్ ట్రాన్సప్లంటేషన్ కి హార్ట్ దొరుకుతుందని చారుశీల చెబుతుంది. దీప మత్తులో లేకపోయినా ఉందని చెప్పి కావాలనే దీప ఎన్నాళ్లో బతకదన్న విషయం కార్తీక్ తో మాట్లాడుతుంది చారుశీల. కార్తీక్ ఏడుస్తూ వెళ్లిపోయిన తర్వాత చారుశీల క్రూరంగా నవ్వుకుంటుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Allu Arjun: బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
Embed widget