News
News
X

Karthika Deepam December 26th Update: కార్తీక్-దీపను చూసేసిన హిమ, మోనిత కళ్లలో ఆనందం కోసం చారుశీల అరాచకం

కార్తీకదీపం డిసెంబరు 26 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

Karthika Deepam  December 26th  Episode 1546 (కార్తీకదీపం డిసెంబరు 26ఎపిసోడ్)

సౌందర్య వాళ్ళందరూ ఒక ఇంట్లోకి రావడంతో ఆ ఇల్లు చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. అందరూ ఇల్లు బావుందని అనడంతో...శౌర్య మాత్రం కోపంగా ఉంటుంది.  ఆ ఇంటికంటే ఈ ఇల్లు బావుందికదా అని సౌందర్య అంటే.. మా అమ్మా నాన్న ఇక్కడలేరుకదా అంటుంది శౌర్య. మరోవైపు చారుశీల పండరికి ఫోన్ చేసి నేను ఇచ్చిన టాబ్లెట్స్ కాఫీలో  కలిపి ఇచ్చావా అని అడిగి..టిఫిన్లో కూడా కలపి ఇవ్వు...ఆ విషయం దీపకు తెలియకూడదని మరోసారి చెబుతుంది. ఇంతలో కార్తీక్ రావడంతో మళ్లీ దీప-కార్తీక్ పై దొంగప్రేమ నటిస్తుంది చారుశీల. ఇది అర్థంచేసుకోలేని కార్తీక్..దీప విషయంలో చాలా చేస్తున్నావు చారుశీల థ్యాంక్స్ అంటాడు. 
చారుశీల: అబద్ధం ఎందుకు చెప్పావు కార్తీక్ .. ఆవేశంలో తనగురించి చెబుతావు అనుకున్నా 
కార్తీక్: తన ప్రాణాలు పోతాయి అని చెప్పేంత ధైర్యం నా దగ్గర లేదు చారుశీలా. అలా చెప్పడం వల్ల దీప ఎంత సేపు నా గురించి ఆలోచిస్తుంది. దీప కోలుకునేవరకూతప్పదు
చారుశీల: దీప కోలుకోదు..ఏకంగా పైకి పోతుందని మనసులో అనుకుంటుంది
కార్తీక్: దీపను శౌర్య దగ్గరకు తీసుకెళతా అన్నాను అని చెప్పేవి వెళ్లిపోతాడు..

Also Read: నీ దూరం భరించలేనంటూ వసుని పుట్టింటికి సాగనంపిన రిషి, దేవయానికి ఇచ్చిపడేసిన జగతి

దీపను తీసుకెళ్లి ఓ దగ్గర కారు ఆపుతాడు..ఎదురుగా శౌర్యని ఇంద్రుడు సైకిల్ పై తీసుకొస్తాడు. 
దీప: శౌర్యను చూసి మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం..సరిదిద్దుకోలేనంత తప్పు చేస్తున్నాం కార్లలో తిరగాల్సిన బిడ్డను ఇలా సైకిళ్లలో తిప్పుతున్నాము అని ఏడుస్తుంది . కార్తీక్ ఎంత వద్దని చెప్పినా..శౌర్యని కలుస్తానని చెప్పి కాదు దిగుతుంది దీప. శౌర్య దగ్గరకు ఒక్కసారి వెళతాను దాని ఒక్కదానికి ఈ నిజం చెబుతాను అని అంటుంది. కార్ డోర్ తీసుకొని సౌర్య దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా కార్తీక్ అడ్డుకుంటాడు.
కార్తీక్: అందుకేనా నన్ను ఇక్కడికి తీసుకు రమ్మని చెప్పావు అంటాడు. 
శౌర్యకి కనిపించకుండా ఇంద్రుడు అడ్డుకుంటాడు. అప్పుడు కార్తీక్ తన పరిస్థితి గురించి చెప్పి దీపకీ అడ్డుకట్ట వేస్తాడు. అప్పుడు దీప, సౌర్యనీ చూసి ఎమోషన్ అవుతూ ఉండగా కార్తీక్ నచ్చచెప్పి అక్కడినుంచి తీసుకెళ్లిపోతాడు. 
ఆ తర్వాత ఇంద్రుడు ఎమోషనల్ అవుతూ ఉండగా ఎందుకు బాబాయ్ అంతలా ఏడుస్తున్నావు అని అడగగా ఏం లేదు జ్వాలమ్మ అని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. 

Also Read: చారుశీల మోనితకన్నా సైకో, దీపను చంపేందుకు పక్కా ప్లాన్, ఇంద్రుడికి షాక్ ఇచ్చిన సౌందర్య

మరొకవైపు సౌందర్య, హిమ మాట్లాడుకుంటూ..శౌర్య ఎక్కడికి వెళ్లిందని అనుకుంటారు. ఆన్ లైన్ క్లాసులపై దృష్టిపెట్టు నీతోపాటూ శౌర్యని కూడా కూర్చోబెట్టుకో అనుకుంటారు. సౌందర్య శౌర్యని పిలవడంతో...చంద్రమ్మ అక్కడికి వచ్చి ఇవాళ బాబాయ్ తో కలిసి బయటికి వెళ్లిందమ్మా అనగానే ఈ టైం లోనా అని అడుగుతుంది. అరటిపళ్లకోసం వెళ్లారని చెబుతుంది. మరోవైపు ఆనంద్ రావు అలా వాకింగ్ చేస్తూ ఉండగా హేమచంద్ర పలకరిస్తాడు...నా కొడుకు కూడా డాక్టరే అని ఆనందరావు చెబుతాడు కానీ అందరికీ డీటేల్స్ చెప్పడం ఎందుకని చెప్పడు. 

కార్తీక్ హాస్పిటల్ కి వెళుతుండగా..దీప...ఇక్కడే ఉండండి డాక్టర్ బాబు అని అడుగుతుంది. ఈ లోగా పండరి టిఫిన్ చేసి చారుశీల చెప్పిన ట్యాబ్లెట్స్ కలపి దీపకు పెడుతుంది. నాకు గుండెల్లో మంటగా అనిపిస్తోంది డాక్టర్ బాబు పొద్దున్న కాఫీ తాగినప్పటి నుంచీ అని చెబుతుంది. అది ఎసిడిటీ వల్ల వచ్చిన మంట..తగ్గిపోతుందిలే అని కార్తీక్ చెబుతాడు. చారుశీల ఇచ్చిన మందులు కలపి ఇస్తున్నాకదా నయం అయిపోతుందిలే అనుకుంటుంది పండరి...

రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
ఇంద్రుడిని కలుస్తారు దీప-కార్తీక్....సౌందర్య వాళ్లు వచ్చిన విషయం తెసుకున్న దీప-కార్తీక్...సంతోషపడతారు. ఇంతలో అటుగా వచ్చిన హిమ..దీప-కార్తీక్ ని చూసేస్తుంది...

Published at : 26 Dec 2022 10:38 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial December 26h update

సంబంధిత కథనాలు

రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?

రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?

K Viswanath : విశ్వనాథ్ సినిమాల్లోనే కమల్ హాసన్, చిరంజీవి నట విశ్వరూపం చూపించారెందుకు?

K Viswanath : విశ్వనాథ్ సినిమాల్లోనే కమల్ హాసన్, చిరంజీవి నట విశ్వరూపం చూపించారెందుకు?

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే  'నిజం విత్ స్మిత' మొదలు

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

టాప్ స్టోరీస్

ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు

ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?