ABP Desam


ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు
డిసెంబరు 26 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఊపందుకుంటాయి. అయితే ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ కలహాల కారణంగా ఆందోళన చెందుతారు. మీ ఆలోచన మార్చుకుంటే మంచిది. సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే అవకాశం ఉంది.


ABP Desam


వృషభ రాశి
ఈ రాశి వారు ఈ రోజు చేసే పనులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా పని మీద దృష్టి పెట్టాలి. వ్యాపారులు లాభం పొందుతారు. మతంపట్ల విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.


ABP Desam


మిథున రాశి
ఈ రాశి వారికి ఈరోజు మంచిరోజు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి లేదంటే ఇబ్బందులు తప్పవు. ఈ రోజు పెట్టిన మూలధన పెట్టుబడి నుంచి కొంత లాభం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రాశి వారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పాత వ్యవహారాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు వాయిదా వేయడం మంచిది.


ABP Desam


సింహ రాశి
ఈ రాశివారి స్వభావం చంచలంగా ఉంటుంది...ఈ కారణంగా మీరు నష్టపోతారు. పెద్దల మాటలను జాగ్రత్తగా వినండి, వారి అనుభవాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వివాహ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి, వ్యాపార పర్యటనలు చేయాల్సి వస్తుంది


ABP Desam


కన్యా రాశి
కన్యారాశికి మిశ్రమ ఫలవంతమైన కాలం కొనసాగుతోంది. తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయనాయకులకు శుభసమయం. మీ ఆర్థికపరిస్థితి బావుంటుంది.


ABP Desam


తులా రాశి
ఈ రోజున ప్రత్యేక వ్యక్తులను కలవడం వల్ల తుల రాశి వారికి విశ్వాసం పెరుగుతుంది. న్యాయ శాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. ప్రేమ వ్యవహారంలో డైలమా ఉంటుంది.


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రాశి వారు సోమరితనాన్ని వదులుకోవాలి. సమయానికి పని చేయాలి. కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. కుటుంబ సమస్యలు ఓ కొలిక్కివస్తాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు. శత్రువులను ఓడించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది.



ధనుస్సు రాశి
ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆకస్మిక ప్రయోజనాలు పొందవచ్చు. సన్నిహితుల పురోభివృద్ధి వల్ల మనసులో ఆనందం ఉంటుంది. శ్రమ వల్ల సొంత పనుల్లో శుభ ఫలితాలు లభిస్తాయనే ఆశతో ఉంటారు. కోర్టు వ్యవహారాలు కలిసొస్తాయి



మకర రాశి
ఈ రాశికి చెందిన వారి కుటుంబ బాధ్యత ఈ రోజు పెరుగుతుంది. పనిలో నూతనోత్తేజంతో ఉంటారు. పిల్లల ప్రవర్తన వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. రోజు మీకు అనుకూలంగా ఉంటుంది, వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ కీర్తి పెరుగుతుంది.



కుంభ రాశి
డిసెంబర్ 26వ తేదీ కుంభ రాశి వారికి శుభదినం. అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. అపరిచితుడిని నమ్మి మోసపోవచ్చు జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. చురుకుగా ఉండటం వల్ల మీ పరిచయాల పరిధి పెరుగుతుంది



మీన రాశి
ఈ రోజు మీన రాశి వారు తక్కువ మాట్లాడాలి...బాగా మాట్లాడాలి. ఈ రోజు మీ ఆనందం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. స్వీయ అధ్యయనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది.