News
News
X

Karthika Deepam December 14th Update:దీపను పండరి నిజంగా శౌర్య దగ్గరకే తీసుకెళుతోందా, ఇంద్రుడు చెప్పింది విని షాక్ అయిన కార్తీక్

కార్తీకదీపం డిసెంబరు 14 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

Karthika Deepam  December 14th  Episode 1535 (కార్తీకదీపం డిసెంబరు 14 ఎపిసోడ్)

శౌర్య కింద పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకొస్తారు. ట్రీట్మెంట్ చేసిన కార్తీక్..కూతురికి కనిపించకుండా దాక్కుంటాడు. చారుశీల ...కార్తీక్ అని పిలవడంతో మా నాన్న ఇక్కడున్నారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది శౌర్య. ఇంద్రుడు, చంద్రమ్మ నెమ్మదిగా సర్దిచెబుతారు. 
శౌర్య: మా నాన్న వచ్చి నా తలకి కట్టు కట్టాడేమో అనుకున్నాను 
ఇంద్రుడు: మీ నాన్నే కనుక వస్తే నేను ఇలా వదిలేసి వెళ్ళిపోతారా
కార్తీక్: చాటుగా దాక్కున్న కార్తీక్..ఇన్నాళ్ళు మా కోసం ఎదురుచూసిన నీకు నీ తల్లి పరిస్థితి తెలిస్తే భరించలేవు దానికన్నా మా కోసం ఎదురు చూడడమే మంచిది అనుకుంటాడు. 
చారుశీల: అయినా గోడలు ఎందుకు ఎక్కావ్ . అల్లరి చేయకు బుద్ధిగా ఉండు..పిన్ని బాబాయ్ చెప్పినట్టు వింటే మీ అమ్మా నాన్న తొందరగా వచ్చేస్తారు
శౌర్య: మా నాన్నకి నేను చేసే అల్లరి ఇష్టం..
చారుశీల: ఇప్పుడు మాత్రం రౌడీ వేషాలు వేయకుండా ఉండు...నిద్రపో అని చెబుతుంది

Also Read: దేవయాని కుట్రకు మరోసారి వసు బలి, రిషి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు!

మరోవైపు ఇంద్రుడు-చంద్రమ్మ..శౌర్య గురించి మాట్లాడుకుని బాధపడతాడు. కార్తీక్ సార్ ఎందుకు ఇంకా పాపని మనదగ్గరే ఉంచారో మేడంకి ఏం చెప్పాలో అనుకుంటారు. ఇంతలో హాస్పిటల్లోకి దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసిన కార్తీక్.. కంగారుపడతాడు...పండరి క్యారియర్ తెస్తానంది కదా దీప ఎందుకు తీసుకొచ్చిందని అనుకుంటాడు. హాస్పిటల్లో చంద్రమ్మని చూసి రగిలిపోయిన దీప..నా బిడ్డ ఎక్కడని నిలదీస్తుంది. అది గమనించిన కార్తీక్.. ఇంద్రుడిని పిలిచి అక్కడి నుంచి ఎలాగైనా చంద్రమ్మని తీసుకెళ్లిపోవాలని చెబుతాడు. అలా చంద్రమ్మని తీసుకుని ఇంద్రుడు దీప నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. వారి వెనుకాలే అరుస్తూ కిందపడిపోతుంది దీప..హాస్పిటల్లో శౌర్య ఉండడంతో దీపను అక్కడినుంచి తీసుకెళ్లిపోతాడు కార్తీక్..

డ్రైవర్ అంజిని తీసుకుని సౌందర్య..కార్తీక్-దీపను వెతికేందుకు వస్తుంది. కాసేపు హోటల్లో రెస్ట్ తీసుకుని వెతకడానికి వెళదాం అంటుంది సౌందర్య. మీరు ఉన్నారు అని నాకు గట్టిగా అనిపిస్తుంది ఉంటే వాళ్ళే వస్తారు కదా అని మీ నాన్న వాదన కానీ ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే నాకు ఎందుకు ఇంత బలంగా అనిపిస్తుంది. నాకు చిన్న క్లూ దొరికితే చాలు పట్టుకొని వచ్చేసాను. మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్న పరిష్కరించి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనుకుంటుంది సౌందర్య.

ALso Read: దీపకు దొరికిపోయిన ఇంద్రుడు-చంద్రమ్మ, ఇప్పుడు కార్తీక్ ఏం చేయబోతున్నాడు!

మరోవైపు హాస్పిటల్ లో దీప నుంచి తప్పించుకుని వెళ్లిపోయిన ఇంద్రుడు-చంద్రమ్మ కాసేపటి తర్వాత తిరిగి హాస్పిటల్ కి వస్తారు. అసలేం జరిగింది..శౌర్య మీ దగ్గరకు ఎందుకు వచ్చింది, వాళ్ల నానమ్మ తాతయ్య దగ్గరకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తాడు. అప్పుడు శౌర్య పరిచయం అయినప్పటి నుంచీ జరిగిన ప్రతివిషయం చెబుతాడు ఇంద్రుడు. 
ఇంద్రుడు: జ్వాలమ్మ రావటం వల్లే మా బ్రతుకులు మారిపోయాయి. మేం చిల్లర దొంగతనాలు చేసుకునే వాళ్ళమే ఒకసారి మమ్మల్ని పట్టుకుంది అలా పరిచయమైంది తను. తన అదంతా తెలుసుకున్న మేము మాతోపాటు ఉండిపోమంటే దొంగతనాలు మానేస్తేనే ఉంటాను అంది. తనకోసం మేము దొంగతనాన్ని వదిలేసాం కష్టపడాలనిపించింది అందుకే ఆటో నడుపుతున్నాను అంటాడు ఇంద్రుడు.తనని నానమ్మ ఇంటికి చేర్చడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా తను వినలేదు. మీకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం తన చెల్లి హిమ అని జ్వాలమ్మ గట్టి నమ్మకం. అందుకే తనతో ఉండడం ఇష్టంలేక వాళ్లు ఎన్నిసార్లు వచ్చినా వెళ్లలేదు
కార్తీక్: అదేంటి మా అమ్మవాళ్ళు ఇక్కడికి వచ్చారా.మేం బతికి ఉన్నాం అని శౌర్యకి ఎలా తెలుసు
ఇంద్రుడు: అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత బ్రతికి ఉంటారని ఎవరైనా అనుకుంటారా? తిరిగి వచ్చేవాళ్ళు కదా రాలేదు అంటే బ్రతికి లేరు అని అందరం చెట్లు కానీ తను నమ్మలేదు.
ఇంద్రుడు: అంత పెద్ద కుటుంబం కదా ఎందుకు అందరూ దూరంగా ఉన్నారు
కార్తీక్: నువ్వు చేసిన మేలు నేను జీవితాంతం మర్చిపోలేను అంటూ చేతులు జోడించి థాంక్స్ చెప్తాడు. నువ్వు లేకపోతే శౌర్య ఏమైపోయాదో తలుచుకుంటేనే భయంగా ఉంది. మనం ఎవరికైనా ఏదైనా నిజం చెప్తే అది అందరికీ సంతోషం కలిగించేది అయి ఉండాలి అంతేకానీ బాధ అనిపించేదిగా ఉండకూడదు. అలా సంతోషం కలిగిస్తుంది అన్న రోజున తప్పకుండా చెప్తాను అంతవరకు పాప జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. 

పేపర్ చదువుతున్న శౌర్యని..స్కూల్ కి వెళ్లి చదువుకుంటావా అని అడిగితే లేదు పిన్నీ..అమ్మా నాన్న దగ్గరకు వెళ్లి చదువుకుంటాను అంటుంది.  మా దగ్గర డబ్బుల్లేవనా అంటే.. అదేం కాదు పిన్నీ అమ్మావాళ్లు దొరుకుతారు కదా అక్కడికి వెళ్లిపోయాక చదువుకుంటాను అంటుంది..
ఎపిసోడ్ ముగిసింది

రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
ఇంద్రుడు-చంద్రమ్మతో కలసి శౌర్య దిగిన ఫొటో పండరికి చూపిస్తుంది దీప. పాప చక్కగా ఉంది కానీ వీళ్ళతో ఉందేంటని అడుగుతుంది. వాళ్ళు నా పాపని తీసుకుని వెళ్ళిపోయారు ఎక్కడ ఉంటారో తెలియదు అంటుంది . నాకు తెలుసు మా ఇంటి దగ్గరే ఉంటారు పదా తీసుకుని వద్దాం అని దీపను ఆటోలో తీసుకెళుతుంది పండరి. 

Published at : 14 Dec 2022 09:18 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial December 14th update

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్