Karthika Deepam December 13th Update: దీపకు దొరికిపోయిన ఇంద్రుడు-చంద్రమ్మ, ఇప్పుడు కార్తీక్ ఏం చేయబోతున్నాడు!
కార్తీకదీపం డిసెంబరు 13 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam December 13th Episode 1534 (కార్తీకదీపం డిసెంబరు 13 ఎపిసోడ్)
సౌందర్య పనిమనిషితో ఫోన్ మాట్లాడుతుంటుంది...నేను ఇవాళ బయలుదేరుతున్నాను సాయంత్రం నుంచి వచ్చి పనులు జాయిన్ అవ్వు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. పనిమనిషితో మాట్లాడుతున్నాను అని చెబుతుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావని ఆనందరావు అడిగితే..కొడుకు కోడల్ని వెతకడానికి వెళుతున్నాను ఎక్కడ ఉన్నా సరే తీసుకొస్తానంటుంది.
ఆనంద్ రావు: ఎంత వెతికినా ఫలితం కనిపించదు సౌందర్య...ఎందుకు అనవసరంగా సమయం వృధా
సౌందర్య: కార్తీక్ వాళ్లు బతికే ఉన్నారు కాబట్టి ఇంద్రుడు సౌర్యని తీసుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. మనం ఇంతవరకు ఆ ఇంద్రుడినే కనిపెట్టలేదు కదా..
ఆనందరావు: ఒకవేళ కార్తీక్ వాళ్ళు బతికే ఉంటే ఇన్ని రోజులు మన ఇంటి దగ్గరికి రాకుండా ఎందుకు ఉంటారు, వాళ్లు ప్రాణాలతో ఉన్నారని మనకు తెలిసేలా చేసే వాళ్ళు కదా
సౌందర్య: మోనిత వాళ్ళిద్దర్నీ కిడ్నాప్ చేసి దాచి పెట్టిందేమో అది ఎంతకైనా తెగిస్తుంది
Also Read: పెళ్లి గురించి ఆలోచిద్దామన్న రిషి- తండ్రి గురించి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్న వసు
మరోపు కార్తీక్ జాగింగ్ కి బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక ఆమె వచ్చి ( పనిమనిషి పండరి) మీరు వెళ్లడానికి వీల్లేదు ఈరోజు శుక్రవారం హాయిగా స్నానం చేసి దీపమ్మతో కలసి పూజ చేయాలని హడావుడి చేస్తుంది. ఎవరీమె అని కార్తీక్ అడిగితే..చారుశీల పంపించిందని చెబుతుంది దీప. మరోవైపు దీప రెడీ అవుతుండగా వచ్చిన ఆమె..బొట్టు ఎలా పెట్టుకోవాలో చెబుతుంది. నువ్వు అంత తెల్లవారుజామునే వచ్చావా..ఎక్కడుంటావ్, నీ వాళ్లెవరు అని ప్రశ్నిస్తుంది. ఆమె మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు చంద్రమ్మ ఇంటికి కూరగాయలు తీసుకొస్తుంది. కూరగాయల్లో దోసకాయలు చూసి శౌర్య మండిపడుతుంది. వెంటనే దోసకాయలు పడేస్తుంది చంద్రమ్మ. అయ్యో అనవసరంగా పిన్నిని బాధపెట్టాను అనుకుంటూ వెళ్లి పూలు కోస్తుంది. గట్టుపైకి ఎక్కి పూలు కొస్తుండగా కిందపడిపోతుంది. చంద్రమ్మ కంగారుగా పరిగెత్తుతుంది.
దీప ఇల్లు శుభ్రం చేస్తుండగా అక్కడకు వచ్చిన పండరి నువ్వు ఈ పనులన్నీ చేయొద్దమ్మా అంటుంది. ఇవన్నీ సరేకానీ నీ గురించి చెప్పు అని దీప మరోసారి అడిగినా మాట దాటేస్తుంది పండరి. బట్టలు ఉతకాలి, వంట చేయాలి అంటూ వెళ్లిపోతుంది. అటు హాస్పిటల్లో కార్తీక్ దీప గురించే ఆలోచిస్తుంటాడు. ఇంతలో చారుశీల అక్కడికి వస్తుంది. దీపనీ ఎలా అయినా కాపాడుకోవాలి అని కార్తీక్ చారుశీల తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే ఇంద్రుడు ఫోన్ చేసి శౌర్య గురించి చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. వెంటనే ఇక్కడకు తీసుకురా అని అడ్రస్ చెబుతాడు. దీప రూపంలో చాలదని ఇప్పుడు పాప రూపంలో కూడా నాకు ఇబ్బందులు పెడుతున్నాడు దేవనుడు అని బాధపడతాడు కార్తీక్.. చారుశీల ఓదార్చుతుంది. పాప స్పృహ లో లేకపోతే నేను ట్రీట్మెంట్ చేస్తాను లేదంటే నువ్వు ట్రీట్మెంట్ చేయాలి అంటాడు కార్తీక్.
మరోవైపు సౌందర్య బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఆశతో వెళ్లడం నిరాశ తో తిరిగి రావడం అప్పుడు బాధపడడం ఇవన్నీ జరిగేవి కదా సౌందర్య అని అంటాడు ఆనందరావు. ఫ్లైట్లో వెళ్లమని చెబితే లేదు కారులో వెళతాను అంటుంది.నువ్వు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తే నాకు టెన్షన్ గా ఉంటుంది అనడంతో లేదు అని గతంలో డ్రైవర్ గా పనిచేసిన అంజిని అక్కడికి పిలిపిస్తుంది సౌందర్య. కొడుకు కోడలు ఇంటివరకూ వచ్చి వెళ్లిపోయినట్టు కలవచ్చిందండీ..ఇది నిజమే అనిపిస్తోంది అని చెప్పి అక్కడికి నుంచి బయలుదేరుతుంది.
Also Read: కార్తీక్ ని చూసిన శౌర్య- కన్న కూతురి కోసం తల్లడిల్లిపోతున్న దీప
మరోవైపు ఇంద్రుడు వాళ్ళు శౌర్యను హాస్పిటల్ కి తీసుకుని రావడంతో కార్తీక్ చెక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత చారుశీల శౌర్యకి ట్రీట్మెంట్ చేయడంతో కార్తీక్ శౌర్యను చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చారుశీల కార్తీక్ అని పిలవగానే ఆ మాట విని శౌర్యకి మెలుకువ వస్తుంది..కార్తీక్ వెంటనే పక్కకు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు చంద్రమ్మ శౌర్యని చూసి బాధపడుతూ ఉండగా నాకేం కాలేదు పిన్ని కానీ ఇక్కడ ఎవరో కార్తీక్ అన్న పేరును పలికారు అని అంటుంది శౌర్య. నాన్న పేరు కార్తీక్ పిన్ని మా నాన్న ఇక్కడికి వచ్చారా అని అడగగా కార్తీక్ చాటుగా ఉండి ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
రేపటి(బుధవారం) ఎపిసోడ్
కార్తీక్ కోసం దీప హాస్పిల్ కి క్యారియర్ తీసుకెళుతుంది. శౌర్యని అదే హాస్పిటల్లో చెర్పించడంతో ఇంద్రుడు-చంద్రమ్మ అక్కడే ఉంటారు. దీప వాళ్లని చూస్తుంది..ఎక్కడ నా బిడ్డ అని నిలదీస్తుంది.. ఏం చెప్పాలో అర్థంకాక ఇంద్రుడు-చంద్రమ్మ అలాగే చూస్తుంటారు. కార్తీక్ కూడా షాక్ లో ఉంటాడు...