అన్వేషించండి

Guppedanta Manasu December 13th Update: దేవయాని కుట్రకు మరోసారి వసు బలి, రిషి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు!

Guppedantha Manasu December 13th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంత మనసు డిసెంబరు 13 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 13th Update Today Episode 632)
ఎప్పుడూ మేడం దగ్గరేనా అప్పుడప్పుడు నాక్కూడా కనిపించాలి కదా అంటాడు రిషి. ఎందుకు సార్ అంటే.. ఏమో తెలియదు కానీ నువ్వు కాసేపు కనిపించకపోతే నాకు ఊపిరి ఆడనట్టు అనిపిస్తుందని రిప్లై ఇస్తాడు. గతంలో కాలేజీ ఫంక్షన్లో నాకు కనిపించేలా కూర్చో అన్న రిషి మాటలు తలుచుకుని వసు ముసిముసినవ్వులు నవ్వుకుంటుంది..
రిషి: అదేదో నాకు చెబితే నేనుకూడా నవ్వుతాను
వసు: వద్దులెండి సార్..
రిషి: పోనీ మీ ఫ్రెండ్ ఆకాశానికైనా చెప్పొచ్చు కదా... వసుధారా జీవితం అంటే ఏంటి
వసు: కాల ప్రవాహంలో వెళ్లడమేజీవితం
రిషి: ఆనందకరమైన జీవితం అంటే ఏంటి..
వసు: బోలెడన్ని జ్ఞాపకాలు సంపాదించుకోవడం
రిషి: నాకు వసుధారని సంపాదించుకోవడమే అందమైన జీవితం
ఆ మాటలకు వసు మొహం వెలిగిపోతుంది.. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారేంటి
రిషి: నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ప్రతిరోజూ కొత్తగానే ఉంటోంది..ఈ మధ్య మరీ కొత్తగా అనిపిస్తోంది
వసు: ఎందుకు
రిషి: ప్రతీదానికీ స్పష్టంగా చెప్పలేం..
వసు: అస్పస్టంగానే చెప్పండి
రిషి: పొద్దున్నే పలకరిస్తావ్,కాఫీ షేర్ చేసుకుంటావ్... 
వసు: ఇంకా..
రిషి: నాతో పాటూ కాలేజీకి వస్తావ్.. కాలేజీలో కనిపిస్తుంటావ్.. అందుకు.. 
వసు: ఇంకా
రిషి: నాతో పాటూ ఇంటికొస్తావ్.. నాతో కలసి భోజనం చేస్తావ్.. ఒకే ఇంట్లో ఉంటూ మెసేజెస్ చేసుకుంటూ పలకరిస్తావ్
వసు: ఇంకా
రిషి: ఇలా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది.. నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేంటి ఆపేస్తావ్
వసు: మీరు మాట్లాడుతుంటే వినేందుకుబావుంటుండి సార్ అంటూ చేయి పట్టుకుని దగ్గరకు చేరి భుజంపై తలపెట్టి ఉంటుంది

ALso Read: దీపకు దొరికిపోయిన ఇంద్రుడు-చంద్రమ్మ, ఇప్పుడు కార్తీక్ ఏం చేయబోతున్నాడు!

కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు విషయంలో మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు రిషి. ఈ ప్రాజెక్టును ఇన్ని రోజులు జగతి మేడం చూసుకున్నారు..అనగానే అదేంటి ఇలా అంటున్నారని కాలేజీ స్టాఫ్ అనుకుంటారు. అప్పుడు రిషి.. జగతి వీడియో ప్లే చేస్తాడు. అందులో జగతి...మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు..నా స్థానంలో వసుధారని నియమించనున్నట్టు మినిస్టర్ గారు చెప్పారని క్లారిటీ ఇస్తుంది. దీనిపై అందరం ఏకాభిప్రాయానికి రావాలని అంటాడు రిషి. ఇంతలో మినిస్టర్ నుంచి రిషికి కాల్ వస్తుంది. వసుధార ని జగతి ప్లేస్ లో పెట్టాలి అనుకున్న విషయం కరెక్టే కానీ ని విషయంలో రేపటి రోజున అధికారులు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉండదు అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. మీకు ఇష్టం వచ్చిన వారిని నియమిస్తారా అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు కదా అనడంతో అవును సార్ అని అంటారు రిషి. 

రిషి కాల్ కట్ చేసిన తర్వాత ఏమైందని అడుగుతాడు మహేంద్ర, ఫణీంద్ర. వెంటనే రిషి..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా వసుధారని నియమించడం కరెక్ట్ కాదంటున్నారని అనడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఆ మాట విన్న కాలేజీ స్టాఫ్ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర ఇప్పుడు ఏం చేద్దాం రిషి అని అడగడంతో ఓటింగ్ పెడదాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుధార ఆలోచించుకుంటూ బయటకు వెళ్తూ ఉండగా ఇంతలోనే కాలేజీలో స్టాఫ్ దేవయానికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో ఆ మాటలు విన్న వసుధార షాక్ అవుతుంది. మేడం వసుధార నియామకం మీద అభ్యంతరం ఉన్నట్టు మినిస్టర్ గారికి మెయిల్ చేశాము అనగా ఆ మాట విని వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 

Also Read: పెళ్లి గురించి ఆలోచిద్దామన్న రిషి- తండ్రి గురించి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్న వసు

మరోవైపు మహేంద్ర జరిగిన విషయాన్ని జగతి చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతి కూడా బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అని మహేంద్ర అనగా ఇంతలోనే అక్కడికి వసుధార వచ్చి...దీనికి కారణం దేవయాని మేడం అని చెబుతుంది. మహేంద్ర కోపంతో రగిలిపోతాడు.  ఎలా అయినా వాళ్లకు గుణపాఠం చెప్పాలి అని మహేంద్ర అక్కడి నుంచి వెళుతుండగా వద్దు అని అడ్డుపడుతుంది. ఈ విషయం మనకు తెలిసిందని దేవయాని మేడంకు తెలిస్తే ఈ విషయాన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకుంటారు వద్దు సార్ అని అంటుంది వసుధార.జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు.  ఏదేమైనా ఈ సవాల్ ని ఎదుర్కోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. 
వసు:  ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి హెడ్ గా నేను ఉండడం అవసరమా 
రిషి: ఏంటి అలా మాట్లాడుతున్నావ్
వసు: ఎందుకో తెలియడం లేదు కానీ నాకు ఈ హోదాలు ఓటింగ్ లు ఇవన్నీ అవసరం లేదని అనిపిస్తోంది. వేరే ఎవరినైనా ఆ స్థానంలో నియమించండి 
రిషి:ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు 
వసు: ఈ విషయంలో లేనిపోని తలనొప్పులు ఎందుకని సార్  ( ఈ విషయంలో దేవయాని మేడం హస్తం ఉందని తెలిస్తే ఆవిడ మిమ్మల్ని ఇంకా బాధపెడతారు అందుకే చెప్పలేకపోతున్నాను) 
రిషి: ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు వసుధార ...ఓటింగ్ జరగాలి జరిపి తీరుతాను 

ఆ తర్వాత మీటింగ్ హాల్లో వసుధార విషయంలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి హెడ్గా ఉండాలా లేదా అని ఓటింగ్ నిర్వహిస్తూ ఉంటాడు రిషి. ఇప్పుడు రిషి మీలో ఎవరైతే వసుధార హెడ్ గా ఉండాలి  అనుకుంటున్నారో వారు వచ్చి ఎస్ అని పెట్టండి వద్దు అనుకున్నవారు న నో అని టిక్ పెట్టండి అని ఫణీంద్రతో మొదలు పెడతాడు రిషి. తర్వాత ఒక్కొక్కరుగా వెళ్లి వసుధారకి ఓటింగ్ చేస్తూ ఉంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Embed widget