X

Karthika Deepam జనవరి 14 ఎపిసోడ్: బస్తీవాసుల మనసు గెలుచుకున్న మోనిత, ఆవేదనలో డాక్టర్ బాబు.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 14 శుక్రవారం 1249 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం జనవరి 14 శుక్రవారం ఎపిసోడ్

గత ఎపిసోడ్‌లో దీపకు మహాలక్ష్మి.. రుద్రాణి గురించి చెప్పడంతో.. రుద్రాణికి వార్నింగ్ ఇవ్వడానికి దీప రుద్రాణి ఇంట్లోనే వంట చేస్తుంది. అది చూసి షాక్ అయిన రుద్రాణికి ఫుల్ క్లారిటీ ఇస్తుంది దీప. ‘ఇంట్లో వంట గ్యాస్ అయిపోయింది.. అందుకే మీ ఇంట్లో వంట చేసుకుంటున్నా రుద్రాణి గారు’ అంటే  ‘నీ ఇంట్లో గ్యాస్ అయిపోతే నా వంటగది వాడుకోవడం ఏంటీ?’ అంటూ రుద్రాణి అరుస్తుంది. ‘మరి నా పిల్లపై మీరు కన్ను వేయడం ఏంటీ’ అంటూ దీప నవ్వుతూనే నిలదీస్తుంది.  ఈ రోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో ఓపెనైంది. ‘వద్దు రుద్రాణి గారు.. రావద్దు నా పిల్లల జోలికి రావద్దు..’ అంటూ స్ట్రాంగ్ గా చెబుతుంది దీప.  

Also Read: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్

రుద్రాణిగారు.. నేను మీలాగే.. మీకంటే ఎక్కువే కళ్లు ఉరిమి చూస్తూ పెద్దగా అరుస్తూ ఇదే విషయాన్ని చెప్పగలను కానీ మీకు నాకు తేడా ఉంది కదా సరే కానీ ఈ కూర రుచి చూడండి అంటూ కూర ఇస్తుంది. రుచి చూసిన రుద్రాణి.. కూరల్లో కారం తగ్గింది దీపా.. నేను కారం ఎక్కువగాతింటానులే.. నువ్వు కూరల్లో కారం పెంచు. పిల్లలకు కాస్త రోషం, పౌరుషం పెరుగుతుంది...  నా దగ్గరకు వచ్చేసరికి అవి ఎక్కువగా ఉండాలిగా అందుకే రుచి చూశాను అంటుంది రుద్రాణి. మీకు రోజులు దగ్గర పడ్డాయి అప్పు తీరుస్తారో లేదో అప్పుడు చూద్దాం అన్న రుద్రాణితో..నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను అని హెచ్చరించి వెళ్లిపోతుంది. షాక్ లో ఉన్న రుద్రాణి‘ఏంట్రా ఇది నా ఇంటికొచ్చి వంటగదిలో వంట చేసుకోవడమే కాకుండా నన్నే బెదిరిస్తుందా..ఈ విషయం నాకు గుర్తుండాలంటే ఈ వంటగదిని వాడను..రేపటి నుంచి భోజనం హోటల్ నుంచి తెప్పించండి అంటుంది. 

Also Read: ఐ లవ్ యూ సర్ అన్న వసుధార.. షాక్ లో రిషి, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
ఏంటి దీపా ఇంత ఆలస్యం అయింది అంటే.. ఇంట్లో గ్యాస్ అయిపోతే వెళ్ల వంట చేసుకుని వచ్చాను అంటుంది. ఇక్కడ అంతలా నీకు ఎవరు పరిచయం అయ్యారు అని అంటే రుద్రాణి విషయం దాచిపెట్టి నాకు తెలిసిన వాళ్లింటికి వెళ్లి వంట చేసి తెచ్చానంతే అంటుంది. మన బతుకు ఏంటి ఇలా అయిపోయింది అన్న కార్తీక్ తో..అన్నీ అలా చించడం ఎందుకు అంటుంది. గ్యాస్ నేను తీసుకొస్తా అంటే నేను తీసుకొస్తా అని అప్పారావు ని అడుగుదాం అని ఇద్దరూ మనసులో అనుకుంటారు. చేతికి దెబ్బచూసిన దీప..ఎందరి ప్రాణాలో కాపాడిన చేతులివి..నాకు తెలియకుండా ఎక్కడైనా పనిచేస్తున్నారా అయినా నాకేం పని వచ్చు చేయడానికి అంటాడు కార్తీక్. కష్టాలు వచ్చి వెళుతూనే ఉంటాయని ధైర్యం చెబుతుంది దీప. కష్టాలు వర్షంలా కాదు వచ్చిపోవడానికి నీడలా మనం ఎటు వెళితే అటు వస్తున్నాయని బాధపడతాడు. మన అందరం ఉన్నదాంట్లో తృప్తిగా ఉందాం అన్న దీపతో..నిన్ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచలేదు..అన్నీ బావున్నాయి అనుకున్నప్పుడు ఇల్లు వదిలి వచ్చేశాం అంటాడు. మీరు ఇలా ఉంటే నచ్చదు నా డాక్టర్ బాబులానే ఉండాలని చెబుతుంది. 

Also Read: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
కట్ చేస్తే మోనిత తన క్లినిక్ దగ్గరకు వెళ్లేసరికి.. లక్ష్మణ్ భార్య కడుపు నొప్పితో విలవిలలాడుతుంది. వారణాసి ఆటో ఎక్కించి హాస్పెటల్‌కి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే ఆటో స్టార్ట్ కాకపోవడంతో.. లక్ష్మణ్ మరో విధంగా వేరే హాస్పిటల్‌కి వెళ్లాలనుకుంటారు. అప్పుడే అక్కడకు వచ్చిన మోనితతో వైద్యం చేయించాలని అనుకోరు. దాంతో లక్ష్మణ్‌ని లాగిపెట్టిన మోనిత.. ‘నీ భార్య చనిపోయేలాఉంది.. ఇలాంటి సమయంలో పంతాలా.. నా క్లినిక్‌లోకి తీసుకుని రండి'’ అంటుంది. దాంతో లక్ష్మణ్, వారణాసి.. పేషెంట్‌ని మోనితక్లినిక్‌కి తీసుకుని వెళ్తారు. కాసేపటి తర్వాత ‘తను బాగానే ఉంది.. రెండు గంటల్లో తీసుకుని వెళ్లొచ్చంటుంది. ఇప్పుడు చెప్పండి మీ దీపక్క వచ్చి కాపాడిందా? నేను కాపాడాను.. మీకు దీపక్క అంటే అభిమానంఉంటే ఒక ఫొటో పెట్టి రోజు పూజ చేసుకోండి.. అంతే కానీ నా మీద చూపించకండి.. కొంచెం ఆలోచించండి’ అనేసి వెళ్లిపోతుంది. భార్యని కాపాడినందుకు లక్ష్మణ్ మోనితకు దన్నంపెడతాడు. మిగిలిన వారు అపరాధ భావంతో తల దించుకుంటారు.

Also Read: కాకిఎంగిలి చేసిన చాక్లెట్ వసుతో షేర్ చేసుకున్న రిషి, ఐ యామ్ వెరీ హ్యాపీ అంటూ రోడ్డుపై అరుపులు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్...
ఇక ఆనందరావు, సౌందర్యలు దీప- కార్తీక్‌ ను తలుచుకుని బాధపడతారు. రాజులు అడవి పాలయ్యారని పురాణాల్లో చదివి ఏమో అనుకున్నాను కానీ..మనం అన్నీ వదిలేసి ఇక్కడకు వస్తామని అనుకోలేదు అంటాడు. మనసులో బాగాలేనప్పుడు ఎక్కడికి వచ్చి ఏం లాభం అన్న ఆనందరావుతో... ఎక్కడోచోట ఇద్దరూ ఆనందంగా ఉన్నారనుకోండి...త్వరలోనే తిరిగి వస్తారని ధైర్యం చెబుతుంది. కట్ చేస్తే కార్తీక్ మాత్రం హోటల్ కి వచ్చిన మోనితని తలుచుకుని బాధపడుతుంటాడు. ఇంతలో దీప వచ్చి ఆరా తియ్యడంతో.. ‘ఈ ఊరు హోటల్‌లో టీ తాగడానికి వెళ్లినప్పుడు మోనితని చూశాను అంటాడు. దీప షాక్ అవుతుంది. మనల్నే వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది అని దీప అంటే.. నాకు అలా అనిపించలేదు అంటాడు కార్తీక్. మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేసిన మోనితని ఏమీ చేయలేకపోయాం..జైలుకి వెళ్లొచ్చినా బుద్ధిరాలేదు, ఇంకా వెంటాడుతూనే ఉందని బాధపడిన కార్తీక్ తో... రేపు మీరు బయటకు వెళ్లకండి అని చెబుతుంది. మోనిత బాబుని తీసుకొచ్చిందా అంటే..లేదని చెబుతాడు. తను కన్నతల్లి కాదు కదా కొన్న తల్లి..తనకు ప్రేమలు ఆప్యాయతల గురించి ఏం తెలుస్తుందిలే అంటుంది.  తన కంట్లో పడకుండా ఉంటే ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటాం...‘నాకు మీరుంటే చాలు ఇంకేమీ అవసరం లేదు డాక్టర్ బాబు అంటుంది దీప..

Also Read: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
మర్నాడు ఉదయాన్నే పిల్లలకు టిఫిన్ పెడుతున్న కార్తీక్.. ‘మీరు సంతోషంగా ఉంటేనే తల్లిదండ్రులుగా మాకు సంతోషం’ అంటాడు. ఆ మాటకు సౌర్య.. ‘నీకు మేము పిల్లలం కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావ్.. మరి నువ్వు నాన్నమ్మ తాతయ్యలకు కొడుకువి కదా.. వాళ్లు నువ్వు కనిపించక అలానే బాధపడుతూ ఉంటారు కదా? మరి నీకు ఎప్పుడూ వాళ్లు గుర్తు రావట్లేదా? అని అడగడంతో కార్తీక్ బాధపడతాడు. నేను చేసిన తప్పులకు నువ్వు, పిల్లలు, అమ్మా-నాన్న అంతా శిక్ష అనుభవిస్తున్నారు. వెనక్కు తిరిగి చూసుకుంటే ఏం మిగిలిందంటాడు.... ఎపిసోడ్ ముగిసింది...

Also Read: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam Written Update Future story of Karthika Deepam Nirupam Paritala as Karthik Premi Viswanath as Deepa Shobha Shetty as Monitha Bhavana Reddy as Rudraani. Written UpdateKarthika Deepam 14th January 2022

సంబంధిత కథనాలు

Sharwanand: 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ సింగిల్.. ఎమోషనల్ గా సాగే 'అమ్మ' పాట..

Sharwanand: 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ సింగిల్.. ఎమోషనల్ గా సాగే 'అమ్మ' పాట..

RadheShyam: ప్రభాస్ 'రాధేశ్యామ్'కి క్రేజీ ఓటీటీ డీల్.. డైరెక్టర్ ఏమంటున్నారంటే..?

RadheShyam: ప్రభాస్ 'రాధేశ్యామ్'కి క్రేజీ ఓటీటీ డీల్.. డైరెక్టర్ ఏమంటున్నారంటే..?

Raviteja: 'ఫుల్ కిక్కు..' సాంగ్.. రవితేజ నుంచి మాసివ్ ట్రీట్..

Raviteja: 'ఫుల్ కిక్కు..' సాంగ్.. రవితేజ నుంచి మాసివ్ ట్రీట్..

Keerthi Suresh: 'లక్కు లే.. గిక్కు లే.. నా రిలీజ్‌కి..' బ్యాడ్ లక్ రూమర్స్ పై కీర్తి స్ట్రాంగ్ కౌంటర్.. 

Keerthi Suresh: 'లక్కు లే.. గిక్కు లే.. నా రిలీజ్‌కి..' బ్యాడ్ లక్ రూమర్స్ పై కీర్తి స్ట్రాంగ్ కౌంటర్.. 

Chiranjeevi: కోవిడ్ బారిన పడ్డ చిరు.. త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్..

Chiranjeevi: కోవిడ్ బారిన పడ్డ చిరు.. త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

Republic Day 2022: జాంటీ రోడ్స్‌కు మోదీ లేఖ! ఇండియాకు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రశంస

Republic Day 2022: జాంటీ రోడ్స్‌కు మోదీ లేఖ! ఇండియాకు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రశంస

PRC Issue In AP: ఉద్యోగులను చంపడానికేనా బుగ్గనకు మంత్రి పదవి ఇచ్చిందీ? పీఆర్సీ సాధన సమితి ఆగ్రహం

PRC Issue In AP: ఉద్యోగులను చంపడానికేనా బుగ్గనకు మంత్రి పదవి ఇచ్చిందీ? పీఆర్సీ సాధన సమితి ఆగ్రహం

East Godavari: మూడుగా విడిపోనున్న తూర్పుగోదావరి జిల్లా.. ఇప్పుడు పేర్లపైనే అసలు పంచాయితీ

East Godavari: మూడుగా విడిపోనున్న తూర్పుగోదావరి జిల్లా.. ఇప్పుడు పేర్లపైనే అసలు పంచాయితీ