By: ABP Desam | Updated at : 13 Jan 2022 08:11 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu January 13th Episode (Image Credit: Star Maa/Hot Star)
'గుప్పెడంత మనసు' జనవరి 13 గురువారం ఎపిసోడ్
ప్రేమలేఖ బాగా రాశారన్న వసు మాటలు తలుచుకున ఆనందంగా, ఆలస్యంగా ఇంటికి చేరుకుంటాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ లో... ధరణిని పిలిచిన దేవయాని..రిషి ఇంకా లేవలేదా అని అడుగుతుంది. రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడు..ఈ విషయం అయినా నీకు తెలుసా అని మహేంద్రని ప్రశ్నించిన దేవయానితో.. రిషి ఇంకా చిన్నపిల్లాడు కాదు పదే పదే అలా అడగడం సరికాదంటాడు మహేంద్ర. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రిషి...గౌతమ్ ఏడి అని అడుగుతాడు. పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరాడంటే వీడు కచ్చితంగా వసుధార దగ్గరకే వెళుతున్నాడేమో అనుకుని కాల్ చేస్తాడు.
Also Read: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
వీడితో మాట్లాడితే నన్ను వెనక్కు రమ్మంటాడేమో అనే ఆలోచనతో కాల్ కట్ చేస్తాడు గౌతమ్. వెనక్కు రమ్మంటానని కట్ చేశావ్ కదా..తెలివి నీ ఒక్కడికే ఉందా అనుకున్న రిషి.. వసుధారకి కాల్ చేస్తాడు. ఆ కాల్ చూసిన జగతి..ఏంటో మా అబ్బాయి కాల్ చేస్తున్నాడా, మీ సార్ కాల్ చేస్తున్నారా అంటే..అది రిషి సార్ మూడ్ ని బట్టి ఉంటుంది అని సమాధానమిస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన వసుధారతో..నువ్వు అర్జెంటుగా బయలుదేరాలి అంటాడు. ఎక్కడికి అంటే..చెప్పేలోగా ఆగవా అంటూనే.. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ తీసుకుని ఇంటికొచ్చెయ్ అంటాడు. నేను, రిషి సార్ ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్క్ కోసం బయటకు వెళుతున్నాం అని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుతుంది వసుధార.
Also Read: కాకిఎంగిలి చేసిన చాక్లెట్ వసుతో షేర్ చేసుకున్న రిషి, ఐ యామ్ వెరీ హ్యాపీ అంటూ రోడ్డుపై అరుపులు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్...
వసు అటు వెళ్లగానే ఇటు దిగుతాడు గౌతమ్. జగతికి గుడ్ మార్నింగ్ చెప్పి వసుని పిలవమని చెబుతాడు. వసు బయటకు వెళ్లిందని చెప్పిన జగతితో..చెబితే నేను డ్రాప్ చేసేవాడిని అంటాడు గౌతమ్. ఎవరి పనులు వాళ్లకుంటాయి..అన్నీ చెప్పి చేయలేం అంటుంది. కాల్ చేసి రావాల్సింది.. ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం నాదే తప్పు అంటాడు. ఏదేదో మాట్లాడేస్తున్న గౌతమ్ తో.. ఒక్క ప్రశ్నకి ఇన్ని సమాధానాలు ఉంటాయా అంటుంది. మీ షార్ట్ ఫిలింలో నాకో క్యారెక్టర్ ఇవ్వండని అడిగితే..అది నా చేతిలో ఉండదని చెప్పిన జగతి కాలేజీకి టైమ్ అవుతోందని చెప్పి గౌతమ్ ని పంపించేస్తుంది.
రిషి ఏదో ఆలోచనలో ఉన్నట్టు గమనించిన ఫణీంద్ర...ఎక్కడికైనా వెళ్లాలా అంటే..అవును ఒకరి కోసం వెయిట్ చేస్తున్నా అంటాడు. లంచ్ బాక్స్ కారులో పెట్టించనా అని అడిగిన దేవయాని ఎవరు వస్తున్నారని అడగ్గా..వసు పేరు చెప్పి షాకిస్తాడు. వసుని ఇంటికి రమ్మన్న విషయం ఇంత ధైర్యంగా చెబుతున్నాడంటే నేను ఆడిన నాటకం పవర్ తగ్గిపోయిందా అనుకుంటుంది. తనని ఎందుకు ఇంటికి పిలవడం..చేసిన నిర్వాకాలు చాలవా అని ప్రశ్నిస్తుంది దేవయాని. ఇంతలో అక్కడకు వస్తుంది వసుధార. రమ్మనగానే సిగ్గులేకుండా వచ్చేసింది..ఇంక నేనెందుకు ఇక్కడ అనుకుని దేవయాని వెళ్లిపోబోతుంటే... మేడం మీకు ఒంట్లో ఎలా ఉందని అడుగుతుంది. గిల్లి జోల పాడటం అంటే ఇదే..నొప్పులు తగ్గిపోయాయా అన్న ప్రశ్నకు .. పర్వాలేదు..నీ పరామర్శలు-సానుభూతి నాకు అవసరం లేదులే అంటుంది దేవయాని.
Also Read: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
మీరు పెద్దవారు.. మీరంటే నాకు గౌరవం ఉంది..జరిగిన దాంట్లో తప్పొప్పుల ప్రస్తావన పక్కనపెడితే మీరు అలా పడడం నాకు బాధకలిగించింది. మిమ్మల్ని మళ్లీ కలిసే అవకాశమే రాలేదు.. మొత్తానికి మీరే ప్రమాదం లేకుండా బయటపడ్డారు సంతోషం.. మా రెస్టారెంట్ కి వచ్చి అలా జరిగినందుకు నాకు బాధేసింది... రెస్టారెంట్లో మీకేదైనా అసౌకర్యం జరిగి ఉంటే సారీ అంటుంది వసుధార. షాక్ అయిన రిషి లేచి నిల్చుంటాడు.. నన్ను క్షమించండి మేడం అంటుంది. నేనే గొప్ప నటిని అనుకుంటే నా కన్నా మహానటిలా ఉందే అనుకుంటుంది దేవయాని. ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి జాగ్రత్త మేడం అంటుంది. వసు నీ సంస్కారానికి హ్యాట్సాఫ్ అని మహేంద్ర .. అహంకారి అయిన అత్తయ్యకి నీలాంటి కోడలు రావాలని ధరణి అనుకుంటారు. ఏదో పని ఉందన్నావ్ వెళ్లు అంటుంది దేవయాని.
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
పెద్దమ్మకి సారీ చెప్పాలి అని అడిగినప్పుడు...చెప్పమన్నా చెప్పను అన్న వసుధార మాటలు గుర్తుచేసుకుంటాడు రిషి. నిన్ను అంచనా వేయడం చాలా కష్టం అన్న రిషి..ఎప్పటికప్పుడు ఓ చిక్కు ప్రశ్నలా మారుతుంటావ్ అంటాడు. దేవయాని మేడంతో నేను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నారు కదా అన్న వసుధార.. సారీ చెప్పను అన్న నేను ఈ రోజు నాకు నేనుగా వచ్చి ఎందుకు చెప్పానని ఆలోచిస్తున్నారు కదా అంటుంది. ఆవిడపై నాకు కోపం ఉండదు.. కానీ జగతి మేడంని, నన్ను సూటిపోటి మాటలు అని బాధిస్తారు..అవన్నీ మీకు చెప్పలేను, మొన్న కూడా తనంతట తానే పడిపోయారు, అందులో మా తప్పు లేదు.. కానీ పెద్దావిడ పడిపోయినందుకు బాధ అనిపించింది... జరిగిన దానికి బాధపడి చెప్పాను కానీ తప్పుచేశానని చెప్పలేదని క్లారిటీ ఇస్తుంది. ఇదే వ్యక్తిత్వం జగతి మేడంలో కనిపిస్తుంది అన్న వసుతో..ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దాం అన్న రిషి..ఎక్కడికి వెళదాం అని అడుగుతాడు. అదేంటి మిషన్ ఎడ్యుకేషన్ పనిపై వెళదాం అని.. మళ్లీ నన్ను అడుగుతున్నారేంటని అడుగుతుంది.
Also Read: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
ఆకలి అన్న రిషికి టీ, బన్ లు కొనిస్తుంది. సార్ మీరంటే నాకు ఇష్టం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న వసు మాటలకి షాక్ అవుతాడు రిషి ( ఇది ఇద్దరిలో ఎవరో ఒకరి ఊహ అయి ఉండొచ్చు)
Also Read: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!
Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్
Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే
Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా